Tag Archives: rahul gandhi

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

వాదన/Claim:“ఈ భారత మాత ఎవరు” అని రాహుల్ గాంధీ అడుగుతున్నట్లు ఒక వీడియో క్లిప్‌ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

నిర్ధారణ/Conclusion:ప్రసంగాన్ని తప్పుగా సూచించడానికి వీడియోని పూర్తిగా చూపించకుండా,  సంక్షిప్తంగా(వీడియోని కుదించి) చేయబడింది.

రేటింగ్: Misleading —

Fact check వివరాలు:

రాజస్థాన్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ మాత’ ఎవరని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో క్లిప్‌ని ఇక్కడ చూడండి:

ఈ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “అందరూ ఈ నినాదాన్ని పలుకుతారు.. ‘భారత్ మాతా కీ జై’. “అయితే ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి?” అని వీడియో క్లిప్‌లో ఆయన అడుగుతున్నారు.X ఖాతాలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు ఈ విధంగా క్లిప్‌ని షేర్ చేశారు: ““ये भारत माता है कौन, है क्या [ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి], అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. సిగ్గుచేటు.”

ఈ పోస్ట్ X ప్లాట్‌ఫారమ్‌లో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

Fact Check

Digiteye India team వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని, ప్రధాన/అసలు వీడియో కోసం వెతకగ, అదే క్లిప్‌ను ‘కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్’ వారు ప్రసంగం యొక్క పూర్తి సందర్భాన్ని షేర్ చేసి ఉండడం గమనించారు. నవంబర్ 20న కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల సెల్ ఛైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాట్ షేర్ చేసిన ట్వీట్ చూడండి.

ఈ వీడియోలో రాహుల్ గాంధీ “చంద్నాజీ ఇప్పుడే ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని పలికారు. ఈ నినాదం చాలా సార్లు వినబడుతుంది, అందరు అంటారు కానీ ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి?”అని మాట్లాడుతూ ఆపై ఆయన భరత్ మాత గురించి వివరించారు. పూర్తి ప్రసంగం మరియు వీడియోని చూస్తే, ఆయన భరత్ మాత గురించి క్రింది విధంగా మాట్లాడినట్లు స్పష్టమవుతుంది:

“భారత మాత అంటే ఈ భూమి, ఈ దేశ ప్రజలు. భారత మాత యొక్క స్వరం మీ సోదరులు, సోదరీమణులు, తల్లులు, తండ్రులు, పేదలు, ధనవంతులు, వృద్ధులలో ప్రతిధ్వనిస్తుంది,ఇది భారత మాత. పార్లమెంటులో కూడా నేను, ‘ఈ భరతమాత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తులు ఎవరు? జనాభా ఎంత? ఎంత మంది గిరిజనులు, ఎంత మంది దళితులు, ఎంత మంది వెనుకబడిన వారు, ఎంత మంది పేదలు, ఎంత మంది ధనవంతులు ఉన్నారు? మనం‘భారత్ మాతాకీ జై’ అని నినాదిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమే. ఈ దేశంలో ఎంత మంది వెనుకబడినవారు, ఎంత మంది దళితులు, ఎంత మంది పేదలు ఉన్నారో మనకు తెలియకపోతే ‘భారత్ మాతా కీ జై’అనే నినాదంలో అర్ధం ఏముంది? అందువల్ల, ఈ దేశం ఇప్పుడు ఈ కారణాలపై జనాభా గణనను నిర్వహించవలసి అవసరం ఉంది.”

ఇంకా, పైన చూసినట్లుగా రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఖాతాలో పూర్తి వీడియో అందుబాటులో ఉంచబడింది. రాజస్థాన్‌లోని బుండీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీగారి ప్రసంగం యొక్క 35 నిమిషాల అసలైన పూర్తి వీడియో చూడవచ్చు.

మరి కొన్ని Fact checks:

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

 

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

దావా/Claim: రాహుల్ గాంధీ భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను ప్రకటించారు.

నిర్ధారణ/Conclusion:తప్పు, రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ప్రకటించలేదు.

రేటింగ్: Misrepresentation —

Fact Check వివరాలు:

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్/సందేశం ఆఫర్‌ను పొందేందుకు లింక్‌ను అందించింది. ఇంతకు ముందు మా వాస్తవ పరిశీలనలో BJPకి సంబంధించి తప్పుడు లింక్‌ని ఉపయోగించిన ఇదే విధమైన దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొనబడింది.

FACT CHECK

ముందుగా, మేము రాహుల్ గాంధీ ఓటర్లకు ఉచిత మొబైల్ రీఛార్జ్ అందించడం గురించి ఏదైనా ప్రకటన చేశారా అని వెతకగా, అది ఎక్కడా కనబడలేదు. అదే నిజమైతే, అన్ని సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా వెల్లడై ఉండేది. రెండవది, PM నరేంద్ర మోడీని ఉదహరిస్తూ ఇంతకుముందు ఇదే విధమైన దావా వైరల్ కాగా, Digiteye India బృందం వారు అది తప్పుడు దావా /వాదన అని నిరూపించింది. ఇక్కడ చూడవచ్చు.

అదేవిధంగా, ఈ సందేశాన్ని కూడా రాహుల్ గాంధీ లేదా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదని కనుగొన్నాము. మరియు, పోస్ట్‌లో అందించిన లింక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో అనుసంధానించబడలేదు.

వెబ్ సైట్ ప్రామాణికత పరిశీలించగా, క్రింది ఫలితం వచ్చింది.

మరి కొన్నిFact Checks:

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? Fact Check

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check: