Tag Archives: illegal immigration problem

చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఈ చిత్రంలో కనిపించేవాళ్ళు భారతీయులు కాదు, ఇతర అక్రమ వలసదారులను USA నుండి గ్వాటెమాలాకు పంపిస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తెలుస్తుంది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం.

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

ఒక ఫైటర్ జెట్ లోపల కూర్చున్న అనేక మంది వ్యక్తుల చేతులు సంకెళ్లులతో, గొలుసులతో బంధించబడి ఉన్నట్లు చూపించే ఒక చిత్రం, అమెరికా అధికారులు భారతీయులను గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనే వాదనతో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఫిబ్రవరి 4, 2025 మంగళవారం నాడు 205 మంది భారతీయ పౌరులను తీసుకెళ్లిన US మిలిటరీ జెట్ C-17, టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి బయలుదేరి అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన సందర్భం సుపరిచితమే.

వాస్తవ పరిశీలన వివరాలు:

ఇటీవల అమెరికా సైనిక విమానంలో 205 మంది భారతీయులను సంకెళ్లు, గొలుసులతో వెనక్కి పంపించేశారనేది(బహిష్కరించిందనేది) నిజమే అయినప్పటికీ, షేర్ చేయబడుతున్న చిత్రం అసలైన చిత్రం కాదు, అది అక్రమ వలసదారులను మెక్సికోలోని గ్వాటెమాలాకు పంపించే (బహిష్కరించే) సమయంలోని చిత్రం.

అసోసియేటెడ్ ప్రెస్ (AP) సౌజన్యంతో ఉన్న ఈ చిత్రం, ఆ వార్తా సంస్థ ద్వారా జనవరి 31, 2025న పోస్ట్ చేయబడింది మరియు దాని శీర్షిక ఇలా ఉంది: “జనవరి 30, 2025, గురువారం, టెక్సాస్‌లోని ఎల్ పాసోలోని ఫోర్ట్ బ్లిస్ వద్ద ఉన్న సైనిక విమానంలో ఫేస్ మాస్క్‌లు ధరించిన మరియు చేతులు,కాళ్లకు సంకెళ్ళతో బంధించబడిన వలసదారులు గ్వాటెమాలాకు తిరిగి వెళ్ళడం(బహిష్కరణ) కోసం ఎదురు చూస్తున్నారు (AP ఫోటో/క్రిస్టియన్ చావెజ్)”.

అందులో భారతీయుల గురించి ఏమీ ప్రస్తావించలేదు.

అందువల్ల, భారతీయులను గ్వాటెమాలాకు పంపించేస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది.

వాస్తవానికి, భారతీయులను భారతదేశంలోని అమృత్సర్ నగరానికి పంపించిన(బహిష్కరించిన)కొన్ని అసలైన చిత్రాలను US సరిహద్దు గస్తీ సిబ్బంది(US Border Patrol) ద్వారా షేర్ చేయబడటం ఇక్కడ చూడవచ్చు.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఫిబ్రవరి 6, 2025న పార్లమెంటులో చేసిన ప్రకటనలో దీనిని ధృవీకరించారు, ఇది 2012 నుండి అనుసరిస్తున్న ప్రధానమైన విధానంలో భాగమని వివరించారు. మరింత వివరణ ఇస్తూ ఆయన సభతో ఇలా అన్నారు: “సర్, US ద్వారా బహిష్కరణలను ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు నిర్వహిస్తారు మరియు వాటిని అమలు చేస్తారు.
ప్రధానమైన ఆపరేటింగ్ విధానం ప్రకారం, ICE ఉపయోగించే ‘విమానం ద్వారా బహిష్కరణ’ 2012 నుండి అమలులోకి రాగా, అది పరిమితులు విధించి వెనక్కు పంపడానికి వినియోగిస్తారు. అయితే, మహిళలు మరియు పిల్లలు నియంత్రించబడరని ICE ద్వారా మాకు సమాచారం అందింది.”

అందువలన ఇది తప్పుడు వాదన.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన