వాదన/Claim: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం.
నిర్ధారణ/Conclusion: ఆ వికలాంగ వ్యక్తి తన చేతిని రాహుల్ గాంధీకి అందిస్తున్నట్లు, దానిని రాహుల్ గాంధీ సహృదయంతో పట్టుకుని అతన్ని కౌగిలించుకున్నట్లు వీడియోలో చూడవచ్చు.
రేటింగ్: Misleading —
Fact Check వివరాలు:
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగ సభలో వికలాంగ వ్యక్తికి (చేతులు లేని వ్యక్తి) కరచాలనం చేయడం కనిపించిందనే వాదనతో ఒక వీడియో క్లిప్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వాదన రాహుల్ గాంధీని వీల్-ఛైర్‌పై ఉన్న వికలాంగ వ్యక్తి పట్ల “సున్నితంగా”ప్రవర్తించలేదని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది.
Insensitivity is writ large all over… pic.twitter.com/EPfs0qEFmp
— Amit Malviya (@amitmalviya) April 12, 2023
ఈ పోస్ట్‌ను బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఇతరులతో షేర్ చేసుకున్నారు, రాహుల్ గాంధీని “సహృదయం లేనివాడని” పిలిచి అతనిపై విరుచుకుపడ్డాడు మరియు అతని అభిప్రాయాలను మూడు లక్షల మంది వీక్షకులతో షేర్ చేసుకున్నారు.
మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, “తెలివిలేని వ్యక్తి! @రాహుల్ గాంధీ , దివ్యాంగ వ్యక్తితో( (చేతులు లేని వ్యక్తి) )కరచాలనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా?”
మరొక వినియోగదారుడు @erbmjha ఇలా పేర్కొన్నారు: ఇలాంటి మూర్కుడిని నేను ఏక్కడ చూడలేదు.వీల్ చైర్‌పై చేతులు లేని శారీరక వికలాంగుడితో రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి ప్రయత్నించారు… నమ్మశక్యంగా లేదు! ”.
FACT CHECK
ఏప్రిల్ 11న రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన ఒరిజినల్ వీడియో క్లిప్‌ను Digiteye India team బృందం పరిశీలించినప్పుడు, ఆ వికలాంగుడు తానే స్వయంగా ముందుకు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ ప్రతిస్పందించి అతనిని కౌగిలించుకున్నారు.
पूरा देश ही परिवार हो जिसका, पूरा देश ही घर हो जिसका उसको क्या ख़ाक तुम डरपोक लोग डराओगे! @RGWayanadOffice pic.twitter.com/i7k9gmLPTk
— Kerala Pradesh Congress Sevadal (@SevadalKL) April 12, 2023
వికలాంగుడైన వ్యక్తి 30 సెకన్ల వ్యవధిలో రెండుసార్లు రాహుల్ గాంధీని పలకరించడానికి తన కుడి చేయి చాచినట్లు, మరియు అతని ఎడమ చేయి రాహుల్ గాంధీ చిత్రంతో ముద్రించిన ప్లకార్డ్‌ను (“మేము రాహుల్‌తో ఉన్నాము” అనే కాప్షన్తో ఉన్న ప్లకార్డ్) పట్టుకుని ఉన్నట్లు గమనించవచ్చు.
కాబట్టి వాదన/దావా పూర్తిగా తప్పు.
*We are with Rahul* ❤️
Watch how a physically handicapped man shows his love to Rahul Gandhi in Wayanad ❤️ pic.twitter.com/9pL8CGiDKt
— Surbhi (@SurrbhiM) April 11, 2023
ఈ వీడియోలోని వాదన గతంలో US ప్రెసిడెంట్ జో బిడెన్‌ను వృద్ధుడిగా మరియు మతిమరుపు వ్యక్తిగా చూపించడానికి అతనిపై చేసిన మరొక వీడియోను పోలి ఉంది. కానీ Digiteye India ద్వారా అది పూర్తిగా తప్పు అని ఇక్కడ నిరూపించబడింది. వాస్తవానికి, నాయకుడిపై నకిలీ మరియు తప్పుడు అభిప్రాయాన్ని/అవగాహనను వ్యాప్తి చేయడానికి ఇటువంటి వీడియోలు చేయడం అవతలి వాళ్లకు అలవాటుగా మారింది.
మరి కొన్ని Fact Checks:
రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన
50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check