Tag Archives: copper plate found copper plate found

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

అయోధ్య ఆలయం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో, ఆలయ స్థలం నుండి బౌద్ధ మతంకు చెందిన పురాతన రాగి స్క్రోల్(రాగి ఫలకం))కనుగొనబడిందని పేర్కొంటూ పాత వీడియో ఒకటి ప్రచారం చేయబడింది.
వాట్సాప్‌లో వచ్చిన claim/దావా ఇలా ఉంది: “అయోధ్య పురావస్తు తవ్వకంలో, బౌద్ధుల కాలం నాటి రాగి ఫలకం కనుగొనబడిందని, ఇది బౌద్ధమత అస్థిత్వానికి అతిపెద్ద సాక్ష్యం.”

ఈ వీడియో ఇంతకు ముందు ట్విట్టర్‌లో ఈ క్రింది విధంగా షేర్ చేయబడింది:

“తామ్రపాత్ర” అని కూడా పిలుస్తారు, ఈ రాగి ఫలకాలను పురాతన కాలంలో డాక్యుమెంటేషన్(దస్తావేజులను సమకూర్చుట) కోసం ఉపయోగించారు మరియు దానిని ఉదహరిస్తూ, హిందువులకు పూజ్యమైన ప్రదేశం మరియు భగవంతుడు శ్రీ రాముని యొక్క జన్మస్థలంగా పిలువబడే అయోధ్యకు బౌద్ధమతానికి లింక్ ఉందని దావా/వాదన చెబుతుంది.
రాముడి ఆలయ నిర్మాణాన్ని బౌద్ధ భిక్షువులు నిరసిస్తున్న నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరింది.

రామజన్మభూమి ప్రాంతం బౌద్ధ క్షేత్రమని, తవ్వకాల కోసం యునెస్కోకు (UNESCO)అప్పగించాలని 2020 జూలైలో బౌద్ధ సన్యాసులు అయోధ్యలో నిరసన చేపట్టారు.రామమందిర నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, యునెస్కో ఆ స్థలంలో తవ్వకాలను చేపట్టాలని బౌద్ధ సన్యాసులు డిమాండ్ చేశారు.

అయోధ్య ఆలయ సమస్య సుప్రీంకోర్టు ద్వారా పరిష్కరించబడింది మరియు స్థానిక వక్ఫ్ బోర్డు కూడా మసీదును పట్టణంలో వేరే చోటికి మార్చడానికి అంగీకరించినప్పటికీ, అయోధ్యలో బౌద్ధమత అస్థిత్వం/వారసత్వం యొక్క వాదన సున్నితమైన సమస్యకు మరో కోణాన్ని జోడిస్తుంది.

Fact Check

వాస్తవం పరిశీలన కోసం Digiteye India ఈ దావాను స్వీకరించి,వైరల్ వీడియో యొక్క కొన్ని ఫ్రేమ్‌ల ఆధారంగా మొదట Google reverse imageను ఉపయోగించి చూడగ, ఈ దావా జూన్ 2020 నుండి అడపాదడపా ఇక్కడ మరియు ఇక్కడ వెలువడుతున్నట్లు చూపబడింది.

అయితే, మేము యూట్యూబ్‌లో సంబంధిత వీడియోల కోసం పరిశీలన చేసినప్పుడు, శ్రీరామ్ ప్రభు కుమార్ అనే వినియోగదారుడు మార్చి 19, 2022న “500 B.C | ఇరాన్‌లో స్వర్ణాక్షరాలుతో ఉన్న ఎస్తేర్ యొక్క అసలు పుస్తకం కనుగొనబడింది” అనే శీర్షికతో యూట్యూబ్‌లో యూదుల టైమ్ క్యాప్సూల్‌కి(Jewish time capsule) సంబంధించిన ఇలాంటి వీడియో అప్‌లోడ్ చేసారు.

గూగుల్ సెర్చ్‌ని ఉపయోగించి, స్క్రోల్‌పై (ఫలకంపై)యూదుల భాష అయిన ‘హీబ్రూ’లో రాసి ఉన్న లిపి(అక్షరాలు)ని మనం చూడవచ్చును. అంతేకాకుండా, రాగి ఫలకంపై యూదుల ఐకానోగ్రఫీకి చెందిన “స్టార్ ఆఫ్ డేవిడ్” యూదు సంఘాల రక్షణ కోసం ఉపయోగించబడే విలక్షణమైన చిహ్నం మనం చూడవచ్చును.

“ఇది ఒక ఫోర్జరీ” అని న్యూయార్క్ యూనివర్శిటీ యొక్క గ్లోబల్ నెట్‌వర్క్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఇన్ జ్యూయిష్ స్టడీస్ ప్రొఫెసర్ మరియు డైరెక్టర్ లారెన్స్ షిఫ్‌మన్ AFP కి చెప్పారు.”మా దగ్గర హిబ్రూ అక్షరాల యొక్క నిర్హేతుకమాన అమరిక/క్రమం ఉంది,కాని ఎస్తేర్ పుస్తకం లేదు.”

అందుకే, వీడియోలో చూపిన రాగి ఫలకానికి బౌద్ధ సాహిత్యం లేదా బౌద్ధ లిపితో సంబంధం లేదు, మరియు ఇరాన్‌లో కనుగొనబడిన ఎస్తేర్ యొక్క అసలైన పుస్తకమని నిరూపణ కూడ కాలేదు.

Claim/దావా:అయోధ్య త్రవ్వకాల్లో బౌద్ధుల కాలానికి చెందిన రాగి ఫలకం దొరికింది.

నిర్ధారణ:రాగి ఫలకం లేదా స్క్రోల్ యొక్క వైరల్ వీడియో బౌద్ధ కాలానికి చెందినది కాదు, దానిపై హిబ్రూ భాషలో యూదుల గ్రంథాలకు చెందిన లిపి/అక్షరాలు ఉన్నాయి.
Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact checks:ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact CheckMMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check]