ఇటలీ నిజంగానే ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ తమ దేశంలోకి రాకుండా నిషేధించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఇటలీ ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ తమ దేశంలోకి రాకుండా నిషేధించిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: ఈ వాదన అవాస్తవం. ఇటలీ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు గానీ, ప్రధానమంత్రి మెలోని ప్రకటన గానీ, లేదా ఏ ఇతర ఇటలీ అధికార సంస్థ ప్రకటన గానీ ఇజ్రాయెల్ పర్యాటకులపై నిషేధాన్ని విధించలేదు.ఇజ్రాయెల్ పౌరులు 90 రోజుల వరకు వీసా లేకుండా ఇటలీలోకి ప్రవేశాన్ని పొంది బస చేయవచ్చు.
రేటింగ్ /Rating: అవాస్తవం ![]()
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి.
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.
******************************************************
ఇటలీ తమ దేశంలోకి ఇజ్రాయెల్ పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించిందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ‘kriptoselcukk’ అనే ధృవీకరించబడిన (verified) X వినియోగదారుడు, “ఇటలీ తమ దేశంలోకి ఇజ్రాయెల్ పర్యాటకుల ప్రవేశాన్ని అధికారికంగా నిషేధించింది” అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ను షేర్ చేశారు. ఇందులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చిత్రం మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరొక అధికారితో కలిసి కూర్చుని ఉన్న చిన్న వీడియో క్లిప్ ఉన్నాయి. ఈ పోస్ట్‌ను కింద చూడవచ్చు.
İtalya, israilli Turistlerin Ülkeye Girişini RESMEN Yasakladı. pic.twitter.com/XlkJgAMkAb
— Kripto Selçuk (@kriptoselcukk) May 3, 2026

ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసుకున్నారు
Breaking:
Italy officially bans all Israeli tourists from entering the country pic.twitter.com/rJmknxVaN3
— Mega-Politics (@_MegaPolitics) May 2, 2026
వాస్తవ పరిశీలన
‘డిజిటై’ఇండియా బృందం ఈ వాదనను పరిశీలించగా,అది అవాస్తవమని తేలింది.ఇటలీ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు గానీ, ప్రధానమంత్రి మెలోని ప్రకటన గానీ, లేదా ఏ ఇతర ఇటలీ అధికార సంస్థ ప్రకటన గానీ ఇజ్రాయెల్ పర్యాటకులపై నిషేధాన్ని విధించలేదు.ఇజ్రాయెల్ పౌరులు 90 రోజుల వరకు వీసా లేకుండా ఇటలీలోకి ప్రవేశాన్ని పొంది బస చేయవచ్చు.
వివరాలు:
ఈ వాదనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి, మేము మొదట “Italy bans Israeli tourists” (ఇటలీ ఇజ్రాయెల్ పర్యాటకులపై నిషేధం విధించింది) అనే పదబంధంతో వెబ్లో అన్వేషించగా, అటువంటి నిషేధం విధించినట్లు సూచించే ఎలాంటి నివేదికలు లేదా విశ్వసనీయ ఆధారాలు మాకు లభించలేదు. ఇటలీ ప్రభుత్వ వర్గాలు , మెలోని ప్రకటనలు మరియు ప్రముఖ వార్తా సంస్థల సమాచారాన్ని పరిశీలించినా,అటువంటి నిషేధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.
దీని తర్వాత, ‘TTG ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ 2025’ అంతర్జాతీయ పర్యాటక ప్రదర్శనలో పాల్గొనకుండా ఇటలీ ఇజ్రాయెల్‌ను నిరోధించినట్లుగా, సెప్టెంబర్ 21, 2025న ‘WAFA’ ప్రచురించిన ఒక నివేదిక మా దృష్టికి వచ్చింది. రిమిని నగరంలో అక్టోబర్ 8 నుండి 10 వరకు జరిగిన ఈ ప్రదర్శన విషయంలో ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయం, “నగర మున్సిపాలిటీ నుండి పెరుగుతున్న ఒత్తిడి మరియు గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంతో కూడిన దాడుల పట్ల వ్యక్తమవుతున్న విస్తృత ప్రజా ఆగ్రహం” నేపథ్యంలో చోటుచేసుకుంది.
పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనలు మరియు భారీ స్థాయి నిరసనల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిమిని (Rimini) మేయర్ జమీల్ సాదేఘోల్వాద్ పేర్కొన్నారని ఆ నివేదిక తెలియజేస్తోంది. పాలస్తీనాకు మద్దతుగా ఇటలీ అంతటా జరిగిన నిరసనల పరంపర నేపథ్యంలోనే ఈ చర్య తీసుకోబడింది.అయితే, ఇటలీ దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ పర్యాటకులను నిషేధించినట్లు ఎక్కడా మాకు సమాచారం లభించలేదు. ఆ నివేదికలోని ఒక భాగాన్ని కింద చూడవచ్చు –

తదుపరి, 2026 జనవరి 8న ప్రచురితమైన ఒక AP నివేదిక ప్రకారం, మిలన్ మాల్పెన్సా విమానాశ్రయంలో జరిగిన పాలస్తీనా అనుకూల నిరసనను ఇటలీ విమానయాన సంస్థ ENAC ఖండించింది; ఈ నిరసనలో కార్యకర్తలు టెల్ అవీవ్‌కు వెళ్లే విమానాన్ని ప్రయాణికులు ఎక్కకుండా తాత్కాలికంగా అడ్డుకున్నారు. భద్రత మరియు “పౌరులందరి ప్రయాణించే /సంచార స్వేచ్ఛ”ను ఈ ఘటన ఉల్లంఘించిందని పేర్కొంటూ, ENAC దీనిని “అత్యంత తీవ్రమైన” ఘటనగా అభివర్ణించిందని ఆ నివేదిక తెలిపింది.
ఇటలీలోని ఇజ్రాయెల్ రాయబారి జోనాథన్ పెలెడ్‌తో జరిగిన సమావేశంలో, ఇటాలియన్ విమానాశ్రయాల గుండా ప్రయాణికులు “స్వేచ్ఛగా మరియు సురక్షితంగా” ప్రయాణించగలరని నిర్ధారించడానికి ఇటలీ “కఠినమైన నిబద్ధత”ను కలిగి ఉందని ENAC అధ్యక్షుడు పియర్లూయిగి డి పాల్మా పునరుద్ఘాటించారు. ఇటలీ ఇజ్రాయెల్ పర్యాటకులను నిషేధించిందనడానికి మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు, పైగా ఇజ్రాయెల్‌కు వెళ్లే ప్రయాణికులను అడ్డుకునే ప్రయత్నాలను ఇటాలియన్ అధికారులు ఖండించారు. నివేదికలోని ఈ విభాగాన్ని కింద చూడవచ్చు :

చివరగా, ఇజ్రాయెల్ పర్యాటకులకు ఇటలీలో ప్రవేశం ఉందో లేదో తెలుసుకోవడానికి మేము ఆ దేశపు వీసా పోర్టల్‌ను పరిశీలించాము. జాతీయత, నివాసం, బస చేసే కాలం మరియు పర్యటన ఉద్దేశం వంటి నాలుగు ప్రాథమిక వివరాలను నమోదు చేసిన తర్వాత, ఇజ్రాయెల్ పర్యాటకులకు స్వాగతం అని మరియు వారికి వీసా అవసరం లేదని (90 రోజుల వరకు బస చేయవచ్చు ) ఫలితాలు వెల్లడించాయి. దీనిని బట్టి ఇజ్రాయెల్ పర్యాటకులకు ఇటలీలో ఇంకా అనుమతి ఉందని, ఎటువంటి నిషేధం విధించబడలేదని స్పష్టమవుతోంది. ఆ ఫలితాల స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు –

కాబట్టి, ఈ వాదన అసత్యం/అవాస్తవం.
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన
భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

