భవనం పైనుంచి పియానోను విసిరేయగా వచ్చిన ధ్వనితో, ప్లేస్టేషన్ 2 ప్రారంభ ధ్వనిని (ఓపెనింగ్ సౌండ్) తయారు చేశారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : భవనం పైనుంచి పియానోను విసిరేయగా వచ్చిన ధ్వనితో, ‘ప్లేస్టేషన్ 2’ ప్రారంభ ధ్వనిని ( ఓపెనింగ్ సౌండ్) చేశారనేది వాదన.
నిర్ధారణ/Conclusion : ఈ వాదన అవాస్తవం. పోస్ట్‌కు జతచేసిన వీడియో, అప్పటికే వైరల్ అయిన ఒక వీడియో క్లిప్ పైన PS2 స్టార్టప్ శబ్దాన్ని (chime) జోడించారు.PS2 స్టార్టప్ శబ్దాన్ని(ఓపెనింగ్ సౌండ్) సోనీ సౌండ్ డిజైనర్ తకాఫుమి ఫుజిసావా మరియు ఒక ప్రత్యేక బృందం రూపొందించారు..
రేటింగ్/Rating : అవాస్తవం ![]()
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి.
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.
******************************************************
ప్లేస్టేషన్ 2 ప్రారంభ శబ్దాన్ని(ఓపెనింగ్ సౌండ్) ఒక పియానోను కింద పడేయడం ద్వారా సృష్టించారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.X వినియోగదారు ‘mejoviralES’ ఒక పోస్ట్‌ను ఇలా షేర్ చేశారు: “ప్లేస్టేషన్ 2 ప్రారంభ శబ్దం(ఓపెనింగ్ సౌండ్), ఒక భవనం పైనుంచి విసిరిన పియానో నుండి వచ్చింది.” పోస్ట్‌కు జత చేసిన 14 సెకన్ల వీడియోలో, కొంతమంది వ్యక్తులు ఒక భవనం పైనుంచి పియానోను కిందకు విసిరేయడం వల్ల PS2 సౌండ్ రూపొందించినట్లు కనిపిస్తుంది. కింది పోస్ట్‌ను చూడవచ్చు :
El sonido de apertura de la PlayStation 2 proviene de un piano arrojado desde lo alto de un edificiopic.twitter.com/bVSUBfgh8f
— 𝐌𝐄𝐉𝐎𝐑𝐄𝐒 𝐕ϟ𝐑𝐀𝐋𝐄𝐒™ (@mejorviralES) April 14, 2026

ఇతర వినియోగదారులు ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
PlayStation 2’nin açılış sesi, bir binanın tepesinden aşağı atılan bir piyanodan geliyor. pic.twitter.com/RpwhD1Ohqq
— Dikkat Medya (@dikkatmedya) April 14, 2026
వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా,ఇది పూర్తిగా అబద్ధమని/అవాస్తవమని కనుగొంది.ఆ వీడియోలోని దృశ్యాలు ఎడిట్ చేయబడ్డాయి మరియు అవి PS2 ప్రారంభ ధ్వని (ఓపెనింగ్ సౌండ్) తయారీ ప్రక్రియ కాదు. వాస్తవానికి, PlayStation 2 (ఓపెనింగ్ సౌండ్)ని సోనీ సౌండ్ డిజైనర్ తకాఫుమి ఫుజిసావా మరియు ఒక ప్రత్యేక బృందం కలిసి రూపొందించారు.
వివరాలు :
నేపథ్యం/సందర్భం ఏమనగా, ఒకవేళ మీకు PlayStation 2 స్టార్టప్ సౌండ్(ఓపెనింగ్ సౌండ్), తెలియకపోయినా లేదా మర్చిపోయినా, సిస్టమ్ బూట్ అయ్యే ముందు వినిపించే ఆడియోను ఈ వీడియోలో ఇక్కడ చూడవచ్చు.
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి, మేము మొదట ఆ వీడియోలోని వివిధ కీలక దృశ్యాలపై (keyframes) ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ నిర్వహించగా సుమారు 3 నిమిషాల నిడివి గల ఆ ఫుటేజ్ యొక్క అసలు వెర్షన్‌ను కనుగొన్నము.
ఈ వీడియో క్లిప్ 2011 ఏప్రిల్ 23న అప్లోడ్ చేయబడినప్పటికీ, ఇది “MIT బేకర్ పియానో డ్రాప్ 2007” అని మరియు దీనిని క్లింటన్ బ్లాక్బర్న్ చిత్రీకరించారని వీడియో వివరణలో పేర్కొనబడింది.వీడియోలో 2:52 నిమిషాల వద్ద పియానోను విసిరినప్పుడు, అది కలప/చెక్క విరిగినప్పుడు వచ్చే సాధారణ శబ్దాన్ని మాత్రమే చేసింది . వాదన చేయబడినట్లుగా ,అక్కడ PS2 ప్రారంభ శబ్దం (ఓపెనింగ్ సౌండ్) వినిపించదు; దీనిని బట్టి ఆ వాదనలో ఎడిట్ చేసిన క్లిప్‌ను ఉపయోగించారని రుజువవుతోంది.
ఆ తర్వాత, ఆ శబ్దాన్ని రూపొందించిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి మేము “PS2 opening sound composer” అనే పదబంధంతో వెబ్‌లో అన్వేషించగా, ప్లేస్టేషన్ బ్లాగ్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం, ఆ విశిష్టమైన ప్లేస్టేషన్ స్టార్టప్ సౌండ్‌ను(ఓపెనింగ్ సౌండ్) తకాఫుమి ఫుజిసావా (Takafumi Fujisawa) రూపొందించారని తెలుకున్నాము. 1994లో ప్రోటోటైప్ తయారవుతున్న సమయంలో, ఆయన మోషన్ లోగోను తన సొంత సౌండ్ డిజైన్‌తో మిళితం చేయడం ద్వారా ఆ స్టార్టప్ సౌండ్‌ను(ఓపెనింగ్ సౌండ్) సృష్టించారు.
ప్లేస్టేషన్ 2 కోసం, ఫుజిసావా మరింత విస్తృతమైన సృజనాత్మక పాత్రలోకి మారారు. సౌండ్ టీమ్ “గణనీయంగా పెరిగిందని” చెబుతూ, దానితో తాను ఒక కాన్సెప్ట్‌ను రూపొందించి, టీమ్ పోటీని నిర్వహించానని తెలిపారు. ఆయన “చివరి రెండు ఎంపికలను ఖరారు చేసి”, పర్ఫెక్ట్ 4వ కార్డ్స్ వంటి సిగ్నేచర్ ఎలిమెంట్స్ ఎంచుకొని దాని గుర్తింపులో ప్రధానంగా ఉండేలా చూసుకున్నారు. “అంతరిక్షంలో తేలియాడే ఒక ఏకశిల వంటి” నేపద్యంతో /దృక్పథంతో, PS2 సౌండ్‌ను మరింత మినిమల్ మరియు ఫ్యూచరిస్టిక్ ఫీలింగ్‌తో “సరళమైన శక్తిని ” వ్యక్తీకరించేలా రూపొందించారు.

కాబట్టి, ఈ వాదన అవాస్తవం/అసత్యం.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన
భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

