వాదన/Claim: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీ.శ. 1500 నాటి విష్ణువు, శివ లింగం మరియు సుదర్శన చక్ర విగ్రహాల కనుగొనబడ్డాయనేది, వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. విష్ణు మరియు శివ లింగం విగ్రహాలు ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణ నదిపై వంతెన నిర్మాణ సమయంలో కనుగొనబడ్డాయి, సంభాల్ మసీదు సర్వే సమయంలో కాదు.
రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీస్తుశకం 1500 నాటి పురాతన హిందూ విగ్రహాలు కనుగొనబడినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.పోస్ట్ ఇక్కడ ఉంది:
HUGE: EVIDENCE of Harihar Mandir have surfaced during Survey of Sambhal Masjid🤯
~ 1500 Years old Lord Vishnu’s Idol, Sudarshan Chakra of stone, Engravings, Govt Gazette, Map of Mandir & much more!🔥
Pay the price for every SIN. Babri, Gyanvapi, Sambhal & many more to come!🚩 pic.twitter.com/XL85j37Xnv
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) December 1, 2024
పోస్ట్‌లోని నాలుగు చిత్రాలలో రెండు విష్ణువు విగ్రహాలు, ఒక శివలింగం మరియు ఒక సుదర్శన చక్రం ఉన్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఒక మసీదు సర్వేపై సంభాల్ హింసాత్మక ఘర్షణల సందర్భంలో ఈ వాదన/దావా చేయబడింది జరిగింది.
ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
వాస్తవ పరిశీలన
మేము మొదట Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాలను పరిశీలించగా, ఆ చిత్రాలు సంభాల్ ప్రాంతం నుండి కాకుండా ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలోని చిత్రాలని ఫలితాలు వెల్లండించాయి.ఫిబ్రవరి 2024లో ఈ విగ్రహాలు వెలికితీసినప్పుడు ప్రచురించబడిన నివేదికలు ఇక్కడ ఉన్నాయి.
కర్నాటకలోని రాయచూర్ జిల్లాలోని దేవసుగూర్ గ్రామ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ సమయంలో విష్ణువు మరియు శివలింగం యొక్క విగ్రహాలను కనుగొన్నారు. ఫిబ్రవరి 2024లో సుమన్ టీవీ ద్వారా తెలుగులో ప్రసారమైన ఈ ఘటనకు సంబంధించిన వార్తా క్లిప్ ఇక్కడ ఉంది:
అందువలన,ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మసీదులో సర్వే నిర్వహించగా విగ్రహాలు దొరికాయన్న వాదన అవాస్తవం.సంభాల్ మసీదులో ఇప్పటివరకు హిందూ దేవతల విగ్రహాలను కనుగొన్నట్లు ఎటువంటి వార్తలు కానీ ఆధారాలు కానీ లేవు.కాబట్టి,ఈ వాదన/దావా వాదన తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన