వాదన/Claim: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. భారత ప్రభుత్వ(PIB) అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మరియు దావా తప్పు అని స్పష్టం చేసింది.
రేటింగ్/Rating:తప్పుదారి పట్టించే వాదన. —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.
లేదా దిగువ కథనాన్ని చదవండి.
***********************************************************************
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్ని భారతీయ భాషల్లో వైరల్ పోస్ట్ షేర్ అవుతోంది. క్యాబినెట్ ఆమోదించిన విధంగా పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెరిగినట్లు దావా/వాదన పేర్కొంది.
Retirement Age Increase 2024 रिटायरमेंट आयु में 2 वर्ष की बढ़ोतरी, कैबिनेट बैठक में मिली मंजूरी pic.twitter.com/DXZP4JLEhJ
— Niyam Upniyam (@NiyamUpniyam) November 15, 2024
దేశంలోని యువ ఉద్యోగార్ధులపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇక్కడ షేర్ చేయబడింది.
माना कि रिटायरमेंट आयु में दो वर्ष की बढ़ोत्तरी से लाखों कर्मचारियों को फायदा होगा
पर हम युवाओं का क्या जो पहले से बेरोजगार है
उन पर तो बुरा असर होगा न
पहले से भर्तियां ऐसे ही न के बराबर है
इससे तो दो साल तक नई भर्तियां आनी भी कम हो जायेगी
बाकी मौजूदा कर्मचारियों में प्रमोशन… pic.twitter.com/xYU0hwM6J2— Archana Patel (@archanapatel__) November 17, 2024
హిందీ పోస్ట్ యొక్క తెలుగు అనువాదం: “పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే నిరుద్యోగులుగా ఉన్న యువత సంగతేంటి? అది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే రిక్రూట్మెంట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీని వల్ల రెండేళ్లపాటు కొత్త రిక్రూట్మెంట్లు కూడా తగ్గుతాయి మరియు మిగిలిన ఉద్యోగులకు కూడా ప్రమోషన్లలో జాప్యం జరుగుతుంది.”
పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉంది.
వాస్తవ పరిశీలన
భారత ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ప్రకటన జారీ చేసిందా అని పరిశీలించగా,ఇటీవలి రోజుల్లో భారత ప్రభుత్వం నుండి అలాంటి ప్రకటన ఏది లేదని కనుగొన్నాము.
ఈ వాదన వలన, ఉద్యోగంలో కొనసాగడానికి లేదా ప్రమోషన్ అవకాశల్లో తగ్గుదల లాంటి ప్రభావం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చూపుతుంది కాబట్టి,ఇది వార్తల్లో ముఖ్యాంశాలుగా ఉండేది. కానీ అలాంటి ప్రకటనేమీ చేయలేదు.
మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడానికి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.
सोशल मीडिया पर वायरल हो रहे खबरों में दावा किया जा रहा है कि भारत सरकार ने केंद्रीय कर्मचारियों की रिटायरमेंट आयु में 2 साल की वृद्धि करने का निर्णय लिया है#PIBFactCheck
❌ यह दावा फर्जी है
✅ भारत सरकार ने ऐसा कोई निर्णय नहीं लिया है
⚠️ बिना सत्यता जांचे खबरें साझा न करें pic.twitter.com/KahXlVIrAF
— PIB Fact Check (@PIBFactCheck) November 19, 2024
తదుపరి పరిశోధనలో, 2023 ఆగస్టులో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ఏదీ తన పరిశీలనలో లేదని ప్రభుత్వం లోక్సభలో ధృవీకరించిందని , మరియు కేసుల వారీగా పరిగణించబడే మినహాయింపులను పరిశీలిస్తుందని కనుగొన్నాము.
అందువల్ల, వాదన/దావా తప్పు మరియు తప్పుదారి పట్టించే విధంగా ఉంది..
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన