భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును.

“దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ఒక జిల్లా పేరు మార్చాలని ఆదేశించారు.అల్ మిన్‌హాద్ మరియు దాని చుట్టుపక్కల 84 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు ఇప్పుడు భారతదేశం మరియు హిందువులు మానవాళికి అందించిన సహకారాన్ని గౌరవించేందుకు “హింద్ సిటీ”గా పిలువబడతాయి.

ఇలాంటి వాదనలతో సోషల్ మీడియాలో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

దుబాయ్ నుండి వచ్చిన వార్తల ప్రకారం,షేక్ తన భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం జిల్లా పేరును మార్చినట్లు దుబాయ్ ‘ప్రభుత్వ మీడియా కార్యాలయం’ పేర్కొంది. వాదన/దావా ప్రకారం భారతదేశం వలన కాదు. క్రింది విధంగా ప్రకటించారు:

 

“ప్రధాన మంత్రి మరియు దుబాయ్ అధినేత హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అతని భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం అల్ మిన్‌హాద్ ప్రాంతాన్ని ‘హింద్ సిటీ’గా మార్చారు” అని షేక్ మీడియా కార్యాలయం వార్తా సంస్థలకు తెలిపింది.’హింద్’ అనేది అరబిక్ పేరు,మరియు ఈ ప్రాంతం యొక్క పురాతన నాగరికతలో దాని మూలాలను కలిగి ఉంది,” అని వివరణను ఇచ్చింది.

భారతదేశం గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా నిజమైన ప్రకటన క్రింది విధంగా ఉంది:

కావున, అల్ మిన్‌హాద్ జిల్లా పేరును ‘హింద్ సిటీ’గా మార్చడంలో భారతదేశ ప్రస్తావన కానీ సంబంధం కానీ లేదు. ఈ దావా/వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

Claim: భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్ ‘అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారు.
Conclusion: భారతదేశ గౌరవార్థం కాకుండా షేక్ భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం అల్ మిన్‌హాద్ ప్రాంతాన్ని ‘హింద్ సిటీ’గా మార్చబడింది”.
Rating: Misleading —

మరి కొన్ని Fact checks:

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్