దేశం విడిచిపెట్టడానికి ముందు మాల్యా ఎవరిని కలిశారు?

ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ప్రస్తుతం UKలో నివసిస్తున్నారు.

“మాల్య భారత్ను విడిచిపెట్టడానికి ముందు, ఆయన బిజెపి సీనియర్ నాయకులను కలుసుకున్నారు, వాటిని నేను బహిర్గతం చేయను,” అని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ ఆరోపణకు బిజెపి ఇంకా స్పందించలేదు.

Twisted Facts?

భారత సిబిఐ అధికారులు విజయ మాల్యాను తిరిగి భారత్ తీసుకొని రావాలని అనేక ప్రయత్నాలు చేస్తస్తున్నారు, కానీ లండన్ కోర్టులో విజయ్ మాల్యా వేసిన పిటిషన్ ప్రకారము ఇండియా లో ఉన్నటువంటి జైలు అతని ఆరోగ్యానికి అనుకూలంగా లేవని విచారిస్తున్నారు. దీనికి సి.బి.ఐ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో నంబర్ 12 వీడియోలు తీసి కోర్టులో దాఖలు చేశారు. ఈ వీడియో ఒక టెలివిజన్, వ్యక్తిగత టాయిలెట్, పరుపు మరియు సూర్యకాంతి పుష్కలంగా అందుబాటులోఉంటుందని చూపిస్తుంది. కేసు సెప్టెంబర్ 12 న కోర్టులో విచారణకు వస్తుంది.

దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ, భారత జైళ్లలో “కష్టమైన స్థలాలు” ఉన్నాయని, కానీ విజయ్ మాల్య వంటి పారిపోయిన వారిని భిన్నంగా చూడరాదని రాహుల్ గాంధీ అన్నారు.

Vijay Mallya

“భారతీయ జైళ్లలో చాలామంది మర్యాదగా ఉన్నారు, మాల్య ఆందోళన చెందుతున్నారు, భారతీయులకు న్యాయం జరగాలి,” అని ఆయన చెప్పారు. పారిపోయిన వారిని భిన్నంగా చూడరాదని, ఇలా చేయటం మిగిలినవారిలో వ్యతిరేకతను పెంపొందిస్తుందని ఆయన అన్నారు.

మోడీ ప్రభుత్వం భారత బ్యాంకుల మోసం చేసిన విజయ్ మాల్యా, ఫ్యుజిటివ్ జ్యుయర్స్ నిరావ్ మోడీ, మెహ్జల్ చోక్సి వంటి వ్యక్తులకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది natural justice వ్యతిరేకమని కూడా ఆయన పేర్కొన్నారు.

Congress man?

కానీ విజయమాల్య మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చాలామంది మిత్రులతో కలిసి రాజ్యసభ మెంబర్ గా చాలా సంవత్సరాలు ఉండినారు. అంతేకాకుండా విజయ్ మాల్యా పూర్వికులు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఉన్నతస్థాయిలో సంబంధాలు పెట్టుకున్నారు. ఇది రాహుల్ గాంధీ మర్చిపోయారా?

ముఖ్యంగా విజయ్ మాల్యా కేసు భారత ప్రభుత్వానికి ఒక గుణపాఠం లాంటి లాంటిది. సరైన రూల్స్ లేనిచో ఎటువంటి వారైనా ఇండియా వదిలి పోయే మార్గాలున్నాయి కాబట్టి అన్ని పార్టీలు దీనికి సంబంధించిన శాసనాలు రూపొందించడానికి ఇదే కరెక్ట్ సమయం.

ఇకపోతే విజయ మాల్యాను తీసుకురావడానికి సీబీఐ చేస్తున్న ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగాలి, లేనిచో ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పార్టీ అయినా విజయమాల్య కేసు ఉమ్మడిగా సమీక్షించాలి కానీ పొలిటికల్ గా మార్చకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*