టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించి,ముఖ్య వార్తగా వెలువడుతున్న సమయంలో, కుక్కపిల్లల తల్లి ఆత్రుతగా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతు,అతను కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూ ఒక వీడియో వైరల్ అయ్యింది. తాజా భూకంప ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో జరిగిన వాదనను మరియు వీడియోను చూడండి.
టర్కీలో భూకంపంలో శిథిలాలు క్రింద చిక్కుకున్నఈ కుక్కపిల్లల్ని 7 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి! #Turkey_earthquake #earthquaketurkey #HelpTurkey #Turcja #Turquie #Turquia #Turchia #earthquakeinsyria #Syria #depremzede #AhbapDernegi #earthquake #earthquakes. pic.twitter.com/rcIamjvxkx
— Abdul Ahad (@OneAahad) February 14, 2023
ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది. “టర్కీ భూకంపం” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఉన్న క్యాప్షన్, ఇది టర్కీ నుండి తీసుకోబడింది అని సూచించింది. ఈ వైరల్ వీడియోకి ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో వేల సంఖ్యలో లైక్‌లు మరియు రీట్వీట్‌లు వచ్చాయి.
FACT CHECK
వీడియోలో శీతాకాలపు దుస్తులు ధరించకుండా ఉన్న వ్యక్తిని చూసి ‘DigitEye India బృందం’, Youtube మరియు Google రివర్స్ ఇమేజ్నలో వీడియో యొక్క మూలాన్ని పరిశీలించి, వాస్తవాని తెలుసుకున్నారు. నిజానికీ ఇది 2019లో భారతదేశం నుంచీ అప్‌లోడ్ చేయబడిన వీడియో అని, అది రాజస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోవడంతో ఒక వ్యక్తి కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూన్న వీడియో.
ఆ వ్యక్తి వేసుకున్నా టీ-షర్ట్ వెనకల “AnimalAid Unlimited” అని కనిపిస్తుంది, ఇది ఉదయపూర్‌లోని వీధి జంతువులను రక్షించే మరియు సహాయం చేసే ఒక NGO.వాస్తవానికి ఈ వీడియోను NGO వారి యూట్యూబ్ ఛానెల్‌లో ఆగస్టు 8,2019న షేర్ చేసింది. భారీ వర్షాల కారణంగా కుప్పకూలిన ఇంటి శిథిలాల కింద తన కుక్కపిల్లలు చిక్కుకోవడంతో ఏడుస్తున్న తల్లి కుక్క గురించి NGOకి సమాచారం అందినట్లు వివరించారు.వెంటనే, NGO సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ఈ అసలు వీడియో(original video)లో చూపిన విధంగా కుక్కపిల్లలను రక్షించారు.
అందువల్ల, టర్కీ భూకంపం సహాయక చర్యల భాగంగా తీసిన వీడియో అనే వాదన తప్పు.
వాదన/Claim:ఇటీవలి టర్కీ భూకంపం విపత్తు సమయంలో కుక్కపిల్లలను రక్షించినట్లు వీడియో చూపిస్తుంది.
నిర్ధారణ: భారతదేశం నుంచీ అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో. టర్కీ భూకంపం సమయంలోనిది కాదు.
Rating: Misrepresentation —
[మరి కొన్ని FACT CHECKS చూడండి:
No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]
Did Turkey release stamp on Modi after India’s help in earthquake relief operations? Fact Check]