Tag Archives: morbi bridge collapse

మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం రాహుల్ గాంధీ తెలంగాణలో ఆనందంగా డ్యాన్స్ చేశారా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు. వంతెన కూలిన దుర్ఘటనకు ముందు అప్‌లోడ్ చేసిన వీడియో.వంతెన సాయంత్రం కూలిపోగా, శ్రీ రాహుల్ గాంధీగారు ఉదయం ‘బతుకమ్మ నృత్యం’లో పాల్గొన్నారు.

రేటింగ్: తప్పుదారి పట్టించడం.

Fact Check వివరాలు:

గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కె.సి వేణుగోపాల్‌లు స్థానికులతో కలిసి సంతోషంగా డ్యాన్స్‌లు చేస్తున్నారనే వాదన(వీడియో) విస్తృతంగా షేర్ అవుతోంది.

ఒక కథనం ప్రకారం, గుజరాత్‌లో 150 మందికి పైగా మరణించిన దుర్ఘటనపై కాంగ్రెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, సంతాపం తెలిపే బదులు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో వారు నృత్యం చేశారు.ఇలాంటి అనేక పోస్ట్‌లు Xలో(గతంలో ట్విట్టర్‌) షేర్ చేయబడ్డాయి మరియు లక్షలకు పైగా రీట్వీట్‌లు వచ్చాయి.

FACT CHECK

మేము వీడియో యొక్క మూలాన్ని పరిశీలించినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా అక్టోబర్ 30న తెలంగాణ భారత్ జోడో యాత్రలోని కొన్ని సంఘటనలను(నాయకులు స్థానికులతో గ్రూప్ డ్యాన్స్‌చేస్తున్న వీడియో) తీసుకొని వీడియోని అప్‌లోడ్ చేసారు.

మోర్బిలో వంతెన కూలి కనీసం 141 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనకు ఈ వీడియోకు సంబంధం లేదు.

మరియు తెలంగాణ భారత్ జోడో యాత్ర సంఘటన అక్టోబర్ 30న ఉదయం జరిగింది, అయితే అదే రోజు అక్టోబర్ 30న సాయంత్రం సరిగ్గా 6:32 గంటలకు వంతెన కూలిపోయింది.

కాంగ్రెస్ @INC India వారు అప్లోడ్ చేసిన”శ్రీ రాహుల్ గాంధీ మరియు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఇతరులు చేస్తున్న ‘బతుకమ్మ నృత్యం’ యొక్క వీడియో పైన చూడొచ్చు.

వాస్తవం ఏమిటంటే, కాంగ్రెస్ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది మరియు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై రాజకీయ దుమారం చేయడానికి నిరాకరించారు. రాహుల్ గాంధీ వీడియో ఇక్కడ చూడండి: