సోషల్ మీడియాలో వినాయకుడి చిత్రాలతో కూడిన ఒక జత చెప్పుల చిత్రాన్ని చూపిస్తూ, ఈ చెప్పులను రూపొందించిన కంపెనీ మూసివేయబడే వరకు పాఠకులను దినిని వ్యాప్తిచేయమని కోరుతూ ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఇది జూన్ 12,2023న క్రింది విధంగా Facebookలో షేర్ చేయబడింది:
FACT CHECKరెండు దశాబ్దాల క్రితం ఇదే చిత్రం ప్రధాన వార్తల్లోకి వచ్చింది కాబట్టి, మేము దానిని తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో
చిత్రాన్ని పరిశీలించినమీదట అది పాత చిత్రమని, దానినే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్లీ ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నాము.
తదుపరి వార్తల పరిశీలనమీదట,అప్పటికే ఈ చిత్రం మీద అమెరికన్ హిందువులు వ్యతిరేకిస్తునట్లు అనేక వార్తలు వేలువడ్డాయి. అమెరికన్ హిందువులు 2003 సంవత్సరంలో అమెరికన్ ఈగిల్ ఔట్‌ఫిట్టర్స్ (American Eagle Outfitters) అనే కంపెనీ ఫ్లిప్-ఫ్లాప్‌లలో(చెప్పులలో) గణేశుడిని ఉపయోగించడంపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
యునైటెడ్ స్టేట్స్‌లోని హిందూ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో, కంపెనీ వాటిని మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది మరియు క్షమాపణలు చెప్పింది. అమెరికన్ ఈగిల్ అవుట్‌ఫిట్టర్స్(American Eagle Outfitters) యొక్క వైస్ ప్రెసిడెంట్ మరియు జనరల్ కౌన్సెల్ నీల్ బుల్మాన్ (Neil Bulman) జారీ చేసిన బహిరంగ క్షమాపణ క్రింద చూడవచ్చు.
ఈ సమస్య అనేక వార్తాపత్రికలలో విస్తృతంగా ప్రచురించబడింది.అయితే, 2015లో, ఈ చిత్రం మళ్లీ ట్విట్టర్‌లో క్రింది విధంగా షేర్ చేయబడింది:
@AEO you need to stop selling these flip flops. You have images of “HINDU GOD GANESHA”. pic.twitter.com/RWhYI5LZhu
— Big Bill (@BimalKatwala) June 8, 2015
ఇప్పుడు, రెండు దశాబ్దాల తరువాత, అదే చిత్రం హిందువుల మనోభావాలకు విరుద్ధమని తప్పుడు వాదనతో షేర్ చేయబడుతోంది. కాని ఈ సమస్య 2003కి సంబంధించినది మరియు ఇప్పటికే పరిష్కరించబడింది. కాబట్టి, కొత్త వాదన తప్పు. కించపరుస్తున్నదని
Claim/వాదన: A picture of sandals printed with Lord Ganesha’s images is being shared seeking closure of the company.
కంపెనీని మూసివేయాలని కోరుతూ గణేశుడి చిత్రాలతో ముద్రించిన చెప్పుల చిత్రం షేర్ చేయబడుతోంది.
నిర్ధారణ:ఈ సమస్య రెండు దశాబ్దాల నాటిది.యునైటెడ్ స్టేట్స్‌లోని హిందూ సంస్థల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో, కంపెనీ ఈ చెప్పులను మార్కెట్ నుండి ఉపసంహరించుకుంది మరియు క్షమాపణలు చెప్పింది.
Rating: Misrepresentation —