Tag Archives: fire

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

ఆల్కహాల్ కలిగి ఉన్నహ్యాండ్ శానిటైజర్‌లను చేతులకు రాసుకుని తర్వాత నిప్పు లేదా స్టవ్ దగ్గరికి వెళ్లవద్దని సూచిస్తూ సోషల్ మీడియాలో ఒక వైరల్ సందేశం కనిపించింది.
హిందీలో సందేశం ఇలా ఉంది: “ఒక మహిళ శానిటైజర్ చేతులకు రాసుకుని వంట చేయడానికి వంటగదికి వెళ్లింది. ఆమె స్టవ్ ఆన్ చేసిన క్షణంలో, శానిటైజర్‌లో ఆల్కహాల్ ఉండటంతో ఆమె చేతులకు మంటలు అంటుకున్నాయి.”

ఒక మహిళ తీవ్రంగా కాలిపోయిన చేతులను చూపుతున్న చిత్రం షేర్ చేస్తు “దయచేసి ఆల్కహాల్ కలిగి ఉన్న హ్యాండ్ శానిటైజర్‌లను చేతికి రాసుకున్న తర్వాత స్టవ్/ఫైర్ దగ్గరికి వెళ్లవద్దు.”అని సందేశం/message పెట్టరు.

వైరల్ అవుతున్న చిత్రం శానిటైజర్‌ వల్ల కాలిన చిత్రం కాదు. అది వేరొక చిత్రం.
‘Google రివర్స్ ఇమేజ్’ఉపయోగించి పరిశీలించినప్పుడు, ఇది స్కిన్ గ్రాఫ్ట్‌ల(skin grafts) కోసం తీసిన బాధితుడి యొక్క చేతుల చిత్రం.ఒకవేళ చేతులు నిజంగా కాలితే, అంచులు అంత స్పష్టంగా(ఎవరో కట్ చేసినట్టు) కనపడవు. స్కిన్ గ్రాఫ్టింగ్(skin grafting) ప్రక్రియాలో, వైద్యులు శరీరంలోని ఒక భాగం నుండి చర్మాన్ని తీసివేసి, మరొక భాగంలో మార్పిడి చేస్తారు.

అందువల్ల, వైరల్ అవుతున్న చిత్రం హ్యాండ్ శానిటైజర్‌ను చేతికి రాసుకున్న వెంటనే నిప్పు వెలిగించేటప్పుడు చేతులకు మంటలు అంటుకున్న మహిళది కాదని స్పష్టమైంది.

శానిటైజర్‌ల గురించి తెలుసుకుందాము.  ఆల్కహాల్ కంటెంట్ శానిటైజర్‌ ద్రవంలో కేవలం ఒక మిల్లీలీటర్ (అనుమతించబడిన మోతదు) మాత్రమే ఉంటుంది,ఇది చేతులకు రాసుకున్న 10 సెకన్లలో ఆవిరైపోతుంది.
నాణ్యమైన శానిటైజర్‌ని రాసుకుంటే ఎటువంటి మంటను కలిగించదు, ఎందుకంటె రాసుకున్న సెకన్లలో అది ఆవిరైపోతుంది.

అయినప్పటికీ, కొన్ని ఇంట్లో తయారుచేసిన శానిటైజర్లు అగ్నికి కారణమైన సంఘటనల కొన్ని వెలుగులోకి వచ్చాయి.న్యూజెర్సీలోని ఒక బాలుడు స్థానిక 7-ఎలెవెన్ స్టోర్ యజమాని తయారు చేసిన స్ప్రే శానిటైజర్‌ను ఉపయోగించి కాలిన గాయాలకు గురైన సంఘటన జరిగింది. స్టోర్ యజమాని (శానిటోజర్ తయారీలో పూర్తి పరిజ్ఞానం లేకుండా)అందుబాటులో ఉన్న ఫోమింగ్ శానిటైజర్‌లో నీటిని కలిపి తయారుచేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ముందే అప్పటికే స్టోర్‌లో 14 స్ప్రే బాటిళ్లను విక్రయించినట్లు సమాచారం.

Claim/వాదన: శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check
నిర్ధారణ: నాణ్యమైన శానిటైజర్‌ని రాసుకుంటే ఎటువంటి మంట కలిగించదు, ఎందుకంటె రాసుకున్న సెకన్లలో అది ఆవిరైపోతుంది.
Rating Misrepresentation:

ఇది కూడా చూడండి:Rs.2000 note banned from Dec 31? Fact check?