Tag Archives: cancer study

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!”

అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది.
ట్విట్టర్‌ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం పాటు ఇదే విధమైన వాదన ఉంది.ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

పైనాపిల్ కాండంలో అధిక స్థాయిలో “bromelain/బ్రోమెలైన్” అనే ఎంజైమ్ ఉంటుంది – ఇది ప్రభావవంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, కండరాల ఉపశమనం మరియు జీర్ణక్రియకు సహాయం చేస్తుంది మరియు ఇది ట్యూమర్ కణాల పెరుగుదలకు ఆటంకం కలిగించే రసాయనాలు కూడా ఉండటం వలన, క్యాన్సర్‌ను నిరోధించడానికి పైనాపిల్‌ను మంచి ఆహారంగా చెప్పవచ్చును. pic.twitter.com/oJxcEE321Z
— Compounding Pharmacy (@abccompounding) February 15, 2023

FACT CHECK

మా బృందం దీనిని స్వీకరించి, ఈ claim/వాదన కొత్తది కాదని, 2021 నుండి షేర్ అవుతోంది అని తెలుసుకుంది.ముఖ్యంగా, PubMed వెబ్‌సైట్‌లో  పరిశోధన నివేదిక ప్రచురించబడిన తర్వాత ఈ వాదన/దావా చేయబడింది.

ఇటలీలోని నేపుల్స్‌లోని నేపుల్స్ ఫెడెరికో II విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ విభాగానికి సంబంధించిన ‘బార్బరా రొమానో(Barbara Romano )’ మరియు ఇతరులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్‌ కణాలను నిరోధించడానికి పైనాపిల్‌ కాండంలో కనిపించే కొన్ని ఎంజైమ్‌ల నాణ్యతపై ల్యాబ్ పరీక్షలు నిర్వహించి, పై నివేదికను ప్రచురించింది.
“bromelain/బ్రోమెలైన్”మరియు “N-acetylcysteine/ఎన్-ఎసిటైల్‌సిస్టీన్” కలయిక జీర్ణశయాంతర (జిఐ) క్యాన్సర్ కణాల మనుగడ మరియు విస్తరణ యొక్క నిరోధాన్ని పెంచుతుంది” అని అధ్యయనంలో తేలింది.

అయితే ఈ అధ్యయనం ఇంకా ఖచ్చితమైనా నిర్దారణ చేయలేదు మరియు మరింత పరిశీనలన అవసరం. ఇండోనేషియా క్యాన్సర్ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అరు విసాక్సోనో సుడోయో(Dr Aru Wisaksono Sudoyo) ఆగస్టు 6, 2021న AFPకి చెప్పారు.ఈ దశలో అటువంటి వాదన/దావాను ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము. క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేసే గుణాల కోసం “bromelain/బ్రోమెలైన్” అధ్యయనం చేయబడిందని, అయితే ఇప్పటివరకు ఎటువంటి గట్టి ఆధారం లేదని ఆయన పేర్కొన్నారు.ప్రయోగశాలలో పని చేసేది నిజ జీవితంలో ప్రభావవంతంగా ఉండకపోవచ్చు” అని ఆయన హెచ్చరించారు.

న్యూయార్క్ నగరానికి చెందిన క్యాన్సర్ నిపుణుడు మరియు “Beyond the Magic Bullet: The Anti-Cancer Cocktail” పుస్తక రచయిత,డాక్టర్ రేమండ్ చాంగ్(Dr Raymond Chang)కూడా క్యాన్సర్ కణాలపై పైనాపిల్ యొక్క ప్రభావం అనే పరిశోధన ఇప్పటికీ టెస్ట్ ట్యూబ్ అధ్యయనాలపై ఆధారపడి ఉందనే వాస్తవాన్ని పునరుద్ఘాటించారు.

మనం ప్రయోగశాలలో చేసే ప్రయోగాలు మరియు క్లినికల్ రియాలిటీ మధ్య తేడా గురించి తెలుసుకోవాలి అని చాంగ్ చెప్పారు. “చాలా సహజమైన వస్తువులు ఒక కృత్రిమ ప్రయోగశాల వాతావరణంలో క్యాన్సర్ కణాలను చంపుతాయి,కానీ మనుషులపై నిజంగా ప్రయోగించినప్పుడు అవి పని చేయవు.”

ఇప్పటికీ క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫలితాలు మిశ్రమంగా ఉండి,ల్యాబ్ అధ్యయనాలు కూడా ప్రాథమికంగా ఉన్నాయి.మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) విస్తృత స్థాయిలో చేపట్టే వరకు, వేడి నీటిలో ఉన్న పైనాపిల్ క్యాన్సర్‌ను నయం చేయగలదని ఖచ్చితంగా నిర్ధారించలేము.

Claim/వాదన:పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ను నయం చేస్తుంది.

నిర్ధారణ:పరిశోధన ఫలితాలు ఇప్పటికీ ల్యాబ్ దశలోనే ఉన్నాయి మరియు మానవ ట్రయల్స్ (మనుషులపై ప్రయోగము) పెండింగ్‌లో ఉన్నాయి,కాబట్టి దీనిని ఖచ్చితంగా నిజమని నిర్ధారించలేము.

Rating: Misleading —