భారతదేశం ఇప్పటికే  దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : భారతదేశం పీర్-టు-పీర్ (P2P-సహచరుడు నుంచి మరొక సహచరుడుకు) ఇంధన/విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందని , దీని ద్వారా పైకప్పు సౌరశక్తి  ఏర్పాటున్న గృహాలు మిగులు విద్యుత్తును నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీలు కల్పిస్తుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion : ఈ వాదన తప్పుదారి పట్టించేది. ఇది REC లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఇండియా ఎనర్జీ స్టాక్ (IES)యొక్క పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఈ నెల చివర్లో ఫిబ్రవరి 2026 లో ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రారంభించబడుతుంది.  ప్రస్తుతం అందుబాటులో లేదు.

రేటింగ్/Rating : తప్పుదారి పట్టించేది 


భారతదేశం పీర్ టు పీర్(సహచరుడు నుంచి సహచరుడుకు)ఇంధన/విద్యుత్ ట్రేడింగ్‌ను ఎలా ప్రారంభించిందనే దాని గురించి అనేక మంది వినియోగదారులు సోషల్ మీడియాలో ఒక వాదనను షేర్ చేసారు. X ఖాతా ‘మేఘ్‌అప్‌డేట్స్’ అటువంటి వాదననే ఈ శీర్షికతో షేర్ చేసారు : “బిగ్! భారతదేశం పీర్-టు-పీర్ ఎనర్జీ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తుంది.పైకప్పు సౌరశక్తి ఏర్పాటున్న ఇళ్ళు ఇప్పుడు ఉన్న డిస్కామ్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి యాప్‌ల ద్వారా ఇతర వినియోగదారులకు నేరుగా మిగులు విద్యుత్తును అమ్మవచ్చు”.
ఈ వైరల్ పోస్ట్ ద్వారా ఇప్పటికే ఈ సేవ అందుబాటులో ఉందని మరియు దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉందని సూచిస్తుంది .దిగువన ఉన్న పోస్ట్‌ను వీక్షించండి –

జతచేయబడిన వీడియో P2P ట్రేడింగ్ ఎలా పని చేస్తుంది, వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మరియు ఇండియా ఎనర్జీ స్టాక్ గురించి వివరిస్తుంది.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా,ఇది తప్పుదారి పట్టించేది అని కనుగొంది. ఇది REC లిమిటెడ్ నేతృత్వంలోని ఇండియా ఎనర్జీ స్టాక్ యొక్క ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇది ఫిబ్రవరి 2026 తరువాత ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాలలో ప్రారంభించబడుతుంది, ప్రస్తుతం అందుబాటులో లేదు.

మరింత తెలుసుకోవడానికి మేము మొదట “భారతదేశం పీర్ టు పీర్ ఎనర్జీ ట్రేడింగ్‌ను ప్రారంభించింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, “వినియోగదారులు తమలో తాము విద్యుత్తును నేరుగా కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి వీలు కల్పించే ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని” TOI ప్రచురించిన నివేదికను కనుగొన్నము.”REC లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న IESలో P2P ట్రేడింగ్ ఒక భాగం” అని నివేదిక పేర్కొంది మరియు ఫిబ్రవరి 2026లో జరిగే IndiaAI సమ్మిట్ సందర్భంగా ఇది ప్రారంభించబడే అవకాశం ఉంది. దిగువ నివేదిక నుండి కొంత భాగాన్ని చూడవచ్చు:

కొనుగోలుదారుకు స్మార్ట్ విద్యుత్ మీటర్ అవసరమని మరియు ఈ పద్దతిని వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా మిగులు సౌర విద్యుత్తును కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి వీలుంటుందని, నివేదిక పేర్కొంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తరువాతి కాలంలో ఢిల్లీ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రారంభించబడుతుంది. ఇది BSES, టాటా పవర్-DDL మరియు PVVNLతో సహా ప్రతి డిస్కామ్ ప్రాంతంలో దాదాపు 1,000 మంది వినియోగదారులతో ప్రారంభమవుతుంది.

బిజినెస్ వరల్డ్ యొక్క మరొక నివేదిక ప్రకారం, “అర్హత కలిగిన వినియోగదారులు మొబైల్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి మిగులు/అదనపు పునరుత్పాదక సౌర విద్యుత్ శక్తి కొనుగోలు చేయడం, విక్రయించడం” వంటివి చేసుకొనవచ్చును. ఈ P2P పద్ధతి లావాదేవీలు ప్రస్తుతం ఉన్న బిల్లింగ్ వ్యవస్థలను భర్తీ చేయవని, కానీ “రెండు పార్టీలకు సాధారణ డిస్కామ్ బిల్లులలో సర్దుబాట్లుగా ప్రతిబింబిస్తాయని” నివేదిక పేర్కొంది.
P2P ట్రేడింగ్ “ఈ నెల చివర్లో జరిగే IndiaAI సమ్మిట్ సమయంలో అధికారికంగా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.” దిగువ నివేదిక నుండి కొంత భాగాన్ని చూడవచ్చు:

ఎకనామిక్ టైమ్స్ వంటి ఇతర నివేదికలు కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం దక్షిణ, నైరుతి, పశ్చిమ, ఉత్తర ఢిల్లీలతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ఉంటాయని పేర్కొంది. సౌర విద్యుత్తు 135.8 GW సౌర సామర్థ్యన్నీ కలిగి ఉంటుంది మరియు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద 20.8 లక్షలకు పైగా  పైకప్పు సౌరశక్తి యంత్ర పరికరాలను అమర్చే అవకాశం ఉంటుంది. మిగులు సౌరశక్తితో డబ్బు ఆర్జించడం, కొనుగోలుదారులకు ఖర్చులను తగ్గించడం, గ్రిడ్ నష్టాలను తగ్గించడం మరియు 2030 నాటికి 500 GW శిలాజేతర(non-fossil) లక్ష్యానికి మద్దతు ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం.

అందువల్ల, ఈ వాదన ప్రాజెక్ట్ ప్రారంభ తేదీ విషయంలో తప్పుదారి పట్టించేదిగా ఉంది మరియు ఇంకా విడుదల కాలేదు లేదా దేశవ్యాప్తంగా అందుబాటులోను లేదు.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

యూరప్‌లోని ఒక చర్చిని నిజంగా నరసింహ దేవాలయంగా మార్చారా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.