ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌ విషయంపై డానిష్ ప్రధాని, ఎంపీలు పార్లమెంట్లో నవ్వారా?వాస్తవ  పరిశీలన

వాదన/Claim : ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌ విషయంపై డానిష్ ప్రధాని మరియు పార్లమెంటు సభ్యులు నవ్వుతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో చూపబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion : ఈ వాదన అబద్ధం/తప్పు. ఈ వీడియో 2019 నాటిది మరియు డానిష్ ప్రధాని,డానిష్ పార్లమెంటు సభ్యుల నవ్వుతున్న సందర్భాన్ని చూపిన్తుంది కానీ ,ఇది డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి విషయంతో సంబంధం లేదు. వాస్తవ సందర్భం ఏమనగా, సర్కస్‌లలో అడవి జంతువులపై నిషేధం విధించిన తర్వాత, మిగిలిన నాలుగు సర్కస్ ఏనుగులను మరియు ఒక ఒంటెను అక్కడి నుంచి విరమించడానికి, వాటిని కొనుగోలు చేయాలని డానిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మరియు సభ సభ్యులు ఒంటె ఏనుగుకు తోడుగా ఉండవచ్చని చమత్కరించడంతో, సభ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. 2019 నుండి, డెన్మార్క్‌లో సర్కస్‌లో అడవి జంతువుల వాడకంపై అధికారికంగా నిషేధం అమలు చేయబడింది.

రేటింగ్ Rating : పూర్తిగా అబద్ధం– Five rating

******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి.

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.

******************************************************

ట్రంప్ నోబెల్ శాంతి డిమాండ్‌ విషయంపై డానిష్ పార్లమెంటు సభ్యులు నవ్వుతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో చూడవచ్చని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపించారు. ‘జైపూర్ డైలాగ్స్’ అనే ఓక  X యూజర్, డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్లపై డానిష్ పార్లమెంట్ నవ్వులతో నిండిపోయిందని చూపించే వీడియోను షేర్ చేశారు.
పోస్ట్ శీర్షిక ఇలా ఉంది: “ట్రంప్ నోబెల్ శాంతి డిమాండ్ పై డానిష్ పార్లమెంట్ నవ్వుతోంది😂.” ఈ పోస్ట్ ను 58,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు, క్రింద చూడవచ్చు

ఇతర వినియోగదారులు ఇలాంటి పోస్ట్‌లను ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

అదే ఫుటేజ్‌ను జనవరి 14, 2026న “అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌ల్యాండ్‌ను “కొనుగోలు చేస్తానని” ప్రకటించిన తర్వాత డానిష్ పార్లమెంట్ ప్రతిస్పందన” అనే వాదన /క్లెయిమ్‌తో షేర్ చేశారు. దిగువన ఉన్న పోస్ట్‌ను చూడవచ్చు.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా, అది అబద్ధమని తేలింది.ఈ క్లిప్ 2019 నాటిది మరియు మరొక సంఘటన గురించి సభ్యులు నవ్వుతున్న సందర్భాన్ని చూపిస్తుంది , దీనికి డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి ఎటువంటి సంబంధం లేదు. వాస్తవానికి, డానిష్ ప్రభుత్వం సర్కస్‌లలో అడవి జంతువులను నిషేధించిన తర్వాత నాలుగు సర్కస్ ఏనుగులను మరియు ఒక ఒంటెను కొనుగోలు చేసే విషయంపై పార్లమెంటరీ చర్చ జరుగుతున్న సమయంలో ఒంటె ఏనుగులలో ఒకదానికి తోడుగా ఉండవచ్చని ఒక తేలికపాటి వ్యాఖ్యతో, సభ ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది.

వివరాలు :

సందర్భం గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదట వీడియోలోని వివిధ కీఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా,
అక్టోబర్ 5, 2019న ప్రచురించబడిన CGTN న్యూస్ (వీడియోతో)నివేదికను గమనించాము : “డానిష్ ప్రధాని ఏనుగు మరియు ఒంటె కథ గురించి చెపుతూ ముసిముసిగా నవ్వారు. “ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్ నాలుగు సర్కస్ ఏనుగులు మరియు ఒంటె గురించి కథ చెబుతూ … డెన్మార్క్ ఒంటెను కూడా కొనుగోలు చేసింది ఎందుకంటే అది రిటైర్డ్ ఏనుగులలో ఒకదానికి ‘ప్రాణ స్నేహితుడు’ అని చెప్పడంతో హాలు నవ్వులతో నిండిపోయింది” అని నివేదిక పేర్కొంది .  నివేదికలోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు:

దీని గురించి తెలుసుకున్న తర్వాత, ఈ సంఘటన నిర్ధారణ కోసం మేము ఇతర క్లిప్‌లు మరియు నివేదికల కోసం అన్వేషించగా, 2019 అక్టోబర్ లో , యూరో న్యూస్ ప్రచురించిన కథనాన్ని గమనించాము : “వీడియో: సర్కస్ ఏనుగులపై ప్రకటన సమయంలో డానిష్ ప్రధాని చిన్నగా నవ్వుకున్నారు” క్రింద నివేదికను చూడవచ్చు :

(సౌజన్యం: euronews.com)

‘అక్టోబర్ 3, 2019 సభ ప్రారంభ చర్చ’ సమయంలో పార్లమెంటు సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి మెట్టే ఫ్రెడెరిక్సెన్ నవ్వుతున్న ఈ క్లిప్‌ను DR (డెన్మార్క్ రేడియో) కూడా షేర్ చేసింది. ఈ సంఘటన అక్టోబర్ 4, 2019న పోస్ట్ చేయబడిన ఒక నివేదికలో ఈ శిర్షిక తో ప్రచురించబడింది: “VIDEO: Mette Frederiksen får grineflip under åbningsdebat”. తెలుగులో అనువదించగా,: వీడియో: సభ ప్రారంభ చర్చ సమయంలో మెట్ ఫ్రెడెరిక్సెన్ పగలబడి నవ్వారు.”
నివేదిక నుండి కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు:

కాబట్టి, ఈ వాదన అబద్ధం/తప్పు, మరియు దీనికి డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌కు సంబంధం లేదు.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.