ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన

వాదన /Claim : 54 సంవత్సరాల తర్వాత తొలిసారిగా 2026 ఫిబ్రవరి 08న నాసా మానవులను చంద్రునిపైకి పంపుతుందనేది వాదన .

నిర్ధారణ /Conclusion : తప్పుదారి పట్టించే వాదన. ఆర్టెమిస్ II నలుగురు వ్యోమగాములను చంద్రుని చుట్టూ తీసుకువెళ్లి తిరిగి వెనక్కి వస్తుంది, కానీ వారిని చంద్రునిపైకి దింపదు. ఫిబ్రవరి 8 ముందుగా అనుకున్న తేదీ, కానీ NASA వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా అది ఏప్రిల్ 2026కి మార్చబడింది. 

 రేటింగ్ /Rating : తప్పుదారి పట్టించేది

**********************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

54 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా NASA చంద్రునిపైకి మానవులను పంపబోతోందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. X యూజర్ ‘forallcurious’ “బ్రేకింగ్: NASA ఫిబ్రవరి 08న, 54 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మానవులను చంద్రునిపైకి పంపనుంది” అనే క్యాప్షన్‌తో అలాంటి వాదనను/దావాను షేర్ చేశారు. ప్రయాణించబోతున్న నలుగురు వ్యోమగాముల చిత్రం పోస్ట్‌కు జతచేయబడింది.పోస్ట్ ను కింద చూడవచ్చు :

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను దర్యాప్తు చేయాలని బృందం నిర్ణయించి,పరిశీలించగా,ఇది తప్పుదారి పట్టించే వాదన అని కనుగొంది. ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా నలుగురు వ్యోమగాములను ఫ్లైబై(ఫ్లై-బై )లో చంద్రునిపై దింపకుండా,చంద్రుని చుట్టూ తీసుకువెళ్లి తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రణాళిక సిద్ధంచేయబడింది. ఒకప్పుడు ఫిబ్రవరి 8ని ప్రయోగించే తేదీగా నిర్ణయించినప్పటికీ, NASA వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా షెడ్యూల్ ఏప్రిల్ 2026కి మార్చబడింది.

 వివరాలు:

మరింత తెలుసుకోవడానికి మేము మొదట “54 సంవత్సరాల తర్వాత NASA మూన్ మిషన్” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, ఆర్టెమిస్ II రాకెట్ గురించి మరింత సమాచారాన్ని అందజేసే NASA అధికారిక పేజీ ని గమనించాము.NASA అధికారికంగా ఆర్టెమిస్ IIని వారి వెబ్‌సైట్‌లో “క్రూయిడ్ లూనార్ ఫ్లైబై/”Crewed Lunar Flyby””గా అభివర్ణించింది మరియు ల్యాండింగ్ మిషన్(వ్యోమగాములను చంద్రునిపై దింపే ప్రక్రియ ) కాదు.

దీని తర్వాత, ఆర్టెమిస్ II గురించి మరొక పేజీని చూడగా, “మిషన్ టైప్” విభాగం/ట్యాబ్ కింద, నాసా దీనిని “క్రూయిడ్ లూనార్ ఫ్లైబై/”Crewed Lunar Flyby”” అని పేర్కొంది. అంతేకాకుండా, వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన షెడ్యూల్ తేదీ ఏప్రిల్ 2026, క్లెయిమ్‌లో/వాదనలో పేర్కొన్నట్లుగా ఫిబ్రవరి 8, 2026 కాదు. NASA వెబ్ సైట్లోని కొంత భాగాన్ని కింద చూడవచ్చు:

ఇంకా, మేము ‘ఆర్టెమిస్ క్రూ‘ కు సంబంధించిన సమాచారం పరిశీలించగా , రీడ్ వైజ్‌మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్ మరియు జెరెమీ హాన్సెన్ అనే నలుగురు వ్యోమగాములను తీసుకువెళుతుందని తెలుసుకున్నాము. వార్తా స్పష్టంగా “ఆర్టెమిస్ IIలో చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసే వ్యోమగాములు” అని పేర్కొంది, మరియు చంద్రునిపై దిగడం గురించి కాదు.

ఆర్టెమిస్ 2 అనేది ఓరియన్, SLS మరియు భవిష్యత్ లో ల్యాండింగ్‌లకు అవసరమైన మిషన్ కార్యకలాపాలను నిర్ధారించడానికి రూపొందించబడిన “క్రూయిడ్ లూనార్ ఫ్లైబై”.  2022లో ఆర్టెమిస్ 1 వ్యోమగాములు లేకుండా ఓరియన్‌ను చంద్రుని చుట్టూ విజయవంతంగా చుట్టినప్పటికీ , ఆర్టెమిస్ 2 ప్రోగ్రాం కింద, మానవులు అంతరిక్ష నౌకలో ప్రయాణించి భూమి దిగువ కక్ష్యను దాటి ప్రయాణించడం 50 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి. ఈ మిషన్ సమయంలో, వ్యోమగాములు చంద్రుని దాటి వేల మైళ్ళు ప్రయాణించి, డీప్-స్పేస్ రేడియేషన్‌ అనుభవం పొందుతారు మరియు వాస్తవ విమాన పరిస్థితులలో లైఫ్-సపోర్ట్, నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థలను పరీక్షిస్తారు.

ఆర్టెమిస్ 2 వ్యోమగాములను చంద్రునిపై దింపదు. బదులుగా, దశాబ్దం తరువాత చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను ఉంచే లక్ష్యంతో, భవిష్యత్తులో చేపట్టే ఆర్టెమిస్ మిషన్ల పురోగతికి ఒక కీలకమైన మెట్టులా పనిచేస్తుంది.

ఫిబ్రవరి 3, 2026న ప్రచురించబడిన మరో NCB వార్తా నివేదిక, ఫిబ్రవరి 2న పూర్తయిన వెట్-డ్రెస్ రిహార్సల్ పలు సమస్యలను ఎదురుకొందని రాసింది.వాటిలో కొన్ని “లిక్విడ్ హైడ్రోజన్ లీక్ రేటులో పెరుగుదల… కమ్యూనికేషన్ ఛానెల్‌లలో అనేక ఆడియో సమస్యలు” లాంచ్‌ను/ప్రయోగాన్నీ ఆలస్యం చేశాయి.
“మార్చి 6 నుండి మార్చి 9 వరకు మరియు మార్చి 11 న ప్రయోగానికి అనూకూలమైన తేదిలని మరియు అవసరమైతే ఏప్రిల్‌లో అదనపు తేదీలు అందుబాటులో పెట్టుకుంటామని ” NASA పేర్కొందని కూడా నివేదిక తెలిపింది .

రాయిటర్స్ మరియు ది గార్డియన్ నివేదికలు కూడా ప్రయోగ ప్రక్రీయను మార్చికి వాయిదా వేసినట్లు నిర్ధారించాయి.

చివరగా, NASA డిసెంబర్ 11, 1972న అపోలో 17 మిషన్ సమయంలో మానవులను చంద్రునిపైకి దింపింది. ఆర్టెమిస్ II భూమి దిగువ కక్ష్యను దాటి సిబ్బందితో వెళ్లే మొదటి విమానం(ప్రయోగము ) అవుతుంది, కానీ ఇది మానవులను చంద్రుని ఉపరితలంపైకి దింపదు

కాబట్టి, ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా ఉంది.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.