టెలికాం శాఖ తమ నోటీసులో మొబైల్ టవర్ ఏర్పాటు కోసం నిజంగా ₹2,500 అడుగుతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) జారీ చేసిన ఒక నోటీసు, గ్రహీత ఉన్న ప్రాంగణంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ, ఒప్పంద రుసుముగా ₹2,500 కోరుతున్నారనేది వాదన.
నిర్ధారణ /Conclusion : ఆ వాదన పూర్తిగా అబద్దం. ఆ నిరభ్యంతర పత్రం(No objection certificate) నకిలీది మరియు డబ్బు వసూలు చేయడానికి ఉపయోగించే మోసాలలో ఒక రకం .టెలికమ్యూనికేషన్ల శాఖ అటువంటి నోటీసును ఏదీ జారీ చేయలేదు మరియు ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని ఖండించాయి.
రేటింగ్ Rating : పూర్తిగా అబద్దం ![]()
టెలికమ్యూనికేషన్ల శాఖ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దాని ప్రకారం,మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేస్తామని,దానికి సంబంధించి ఒప్పంద రుసుముగా ₹2,500 చెల్లించాలని పేర్కొంది.
గ్రహీత యొక్క ప్రాంగణంలో బీఎస్ఎన్ఎల్ 5జీ మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంటు, స్థల ఎంపికకు వారిని అభినందిస్తు మరియు తదుపరి ప్రక్రియ కోసం ‘ఒప్పంద రుసుము’గా ₹2,500 చెల్లించాలని నోటీసులో డిమాండ్ చేస్తున్నట్లు ఉంది.
ఈ నోటీసు భారత దూరసంచార మంత్రిత్వ శాఖ వంటి సంస్థలను ప్రస్తావిస్తు, మరియు “టెలికాం చట్టం 2017″ను ఉటంకిస్తూ ముద్రలు మరియు సంతకాలను కలిగి ఉంది. దిగువన ఉన్న నోటీసును చూడవచ్చు .

వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని బృందం నిర్ణయించి,పరిశీలించగా ఇది తప్పు అని తేలింది. ఈ నోటీసు నకిలీదని మరియు ప్రభుత్వ అధికారిక వర్గాలు, ఈ వాదనను తప్పుగా ధ్రువీకరించాయి . అంతేకాకుండా, ఇటువంటి మోసాలను పోలీసులకు నివేదించాలని DoT, ప్రభుత్వ ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఆ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి మేము మొదటగా “టెలికమ్యూనికేషన్ల శాఖ ద్వారా టవర్ ఏర్పాటుకు సంబంధించి ₹2,500 నోటీసు జారీ చేయబడింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా,మొబైల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన మోసాల గురించి తెలిపే ఒక ప్రభుత్వ ప్రకటనను గమనించాము.
“మొబైల్ టవర్ల ఏర్పాటు పేరుతో కొన్ని మోసపూరిత కంపెనీలు/ ఏజెన్సీలు/ వ్యక్తులు సాధారణ ప్రజలను ఎలా మోసం చేసి, నెలవారీ అద్దె భారీగా ఇస్తామని హామీ ఇచ్చి డబ్బు వసూలు చేస్తున్నారో” అని అడ్వైజరీ పేర్కొంది. అంతేకాకుండా, అడ్వైజరీలోని పాయింట్ 1 స్పష్టంగా “మొబైల్ టవర్ల సంస్థాపన కోసం ప్రాంగణాన్ని లీజుకు/అద్దెకు ఇచ్చే ప్రక్రియలో DOT/TRAI ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనదు” అని పేర్కొంది. దీని స్క్రీన్‌షాట్‌ను క్రింద చూడవచ్చు –

దీని తరువాత, ఇదే విషయంపై DoT జారీ చేసిన మరో పబ్లిక్ నోటీసును మేము కనుగొన్నము. ఈ నోటీసులో స్కామర్లు(మోసగాళ్లు) “సెక్యూరిటీ డిపాజిట్/దరఖాస్తు రుసుములు/రిజిస్ట్రేషన్ రుసుములు/స్టాంప్ డ్యూటీ రూపంలో ప్రజలను డబ్బును డిపాజిట్(జమ చేయమని) చేయమని అడుగుతున్నారు…” అనే విషయం గురించి ప్రస్తావించబడింది . ఆ నోటీసు ప్రజలను హెచ్చరిస్తూ, ఒకవేళ ఏదైనా కంపెనీ అలాంటి ముందస్తు రుసుమును అడిగితే, “ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మరియు స్థానిక పోలీసు అధికారులను సంప్రదించాలని దీని ద్వారా సూచించడమైనది” అని పేర్కొంది. ఆ నోటీసుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు .

డిసెంబర్ 6, 2025న, ఫ్రీ ప్రెస్ జర్నల్ కూడా DoT జారీ చేసిన మోసపూరిత కార్యకలాపాల మరియి ఇలాంటి హెచ్చరికల గురించి నివేదించింది. అదేవిధంగా, ఎకనామిక్ టైమ్స్ అక్టోబర్ 2, 2025న ప్రచురించిన వారి నివేదికలో TRAI పేరుతో 5G మొబైల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించి నకిలీ మరియు మోసపూరిత లేఖలు ఎలా పంపిణీ చేయబడ్డాయో ప్రచురించింది.
సెప్టెంబర్ 4, 2024న, న్యూస్ఆన్ఎయిర్ కూడా మొబైల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ఇలాంటి మోసపూరిత పథకం గురించి ప్రచురించింది.
PIB యొక్క ఫ్యాక్ట్ చెక్ యూనిట్ జనవరి 11, 2026 న, X పోస్ట్‌లో కింది విధంగా ఈ వాదనను అధికారికంగా తోసిపుచ్చింది.
మొబైల్ టవర్ ఏర్పాటు మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
“టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) జారీ చేసిన ఒక నోటీసు, గ్రహీత ఉన్న ప్రాంగణంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ, ఒప్పంద రుసుముగా ₹2,500 కోరుతున్నారనేది” నకిలీ నోటీసు.
DoT_India అటువంటి సర్టిఫికేట్‌ను ఏదీ జారీ చేయలేదంటూ, సరైన సమాచారంతో అప్డేట్గా ఉండండి మరియు తప్పుడు సమాచారాన్ని నమ్మ వద్దంటూ X లో పోస్ట్ చేసింది.
🚨Be wary of mobile tower installation frauds🚨
A #FAKE NOC allegedly issued by Dept Of Telecommunications claims to install mobile tower at recipient’s location & seeks ₹2,500 as agreement fees#PIBFactCheck:
❌@DoT_India has issued NO such certificate
🚨 Stay informed and… pic.twitter.com/mtDfowg3u6
— PIB Fact Check (@PIBFactCheck) January 11, 2026
అందువల్ల, ఆ దావా/నోటీసు అబద్ధం. ఇందులో నిజం లేదు.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

