ఇండోనేషియా జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు 31 చైనా నౌకలను ఇండోనేషియా ధ్వంసం చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : “ఇండోనేషియా జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు 31 చైనా నౌకలను ఇండోనేషియా ఎలా ధ్వంసం చేసిందో ఈ వీడియో చూపిస్తుంది ” అనేది వాదన.
నిర్ధారణ/Conclusion : ఈ వాదన పూర్తిగా అవాస్తవం/తప్పు .ఈ వీడియో ఫుటేజ్ ఫిబ్రవరి 2016 నాటిది, అప్పుడు వియత్నాం మరియు మలేషియా వంటి దేశాలకు చెందిన 31 అక్రమ చేపల వేట పడవలను ఇండోనేషియా ముంచివేసింది. పోంటియానాక్, బిటుంగ్, తహునా మరియు బెలవాన్ దీవులలో కూడా అనేక పడవలను ధ్వంసం చేశారు, అయితే వాటిలో చైనాకు చెందిన పడవలు లేవు . ఈ చర్య అక్రమ చేపల వేటకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో ఒక భాగం.
రేటింగ్ /Rating : పూర్తిగా తప్పు — ![]()
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి .
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి.![]()
******************************************************
ఇండోనేషియా జలాల్లో చట్టవిరుద్ధంగా చేపలు పడుతున్న 31 చైనీస్ పడవలను ఇండోనేషియా ముంచివేసిందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. డిసెంబర్ 16, 2025న, X యూజర్ ‘NguyenThih36’ సముద్రంలో పడవలు పేలిపోతున్న వీడియోతో పాటు, ఇండోనేషియా తన జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న చైనీస్ నౌకలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు.”చైనా గనుక మా జలాల్లో మా ప్రజలను వేధించడానికి సాహసిస్తే, దానికి కూడా మా ప్రతిఫలమే ఎదురవుతుందని,అందుకు సిద్ధంగా ఉండాలని”ఆ పోస్ట్‌లో హెచ్చరించారు. ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు :
#Indonesia destroyed Chinese vessels for illegally fishing in Indonesian waters.
Now, China must realize that “OUR actions will be the consequence of CHINA’s actions.” If China dares to harass our people in our waters, it should be prepared for similar treatment. pic.twitter.com/SieThyAqoS
— Nguyen Thi hong (@NguyenThih36) December 16, 2025

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు,
వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని బృందం నిర్ణయించి, పరిశీలించగా అది తప్పు అని తేలింది. ఈ వీడియోఫుటేజ్ ఫిబ్రవరి 2016 నాటిది, ఇక్కడ వియత్నాం మరియు మలేషియా నుండి వచ్చిన 31 అక్రమ ఫిషింగ్ పడవలను ఇండోనేషియా ముంచివేసింది.ఇందులో చైనాకు సంబంధించిన
పడవలు ఏవీ లేవు మరియు ఎటువంటి విశ్వసనీయ నివేదికలు ఈ వాదన/దావా గురించి ప్రస్తావించలేదు.
వివరాలు:
ఈ వాదన గురించి తెలుసుకోవడానికి మేము మొదట “ఇండోనేషియా 31 అక్రమ చైనీస్ ఫిషింగ్ బోట్లను ముంచివేసింది” అనే పదబంధంతో అంతర్జాలంలో అన్వేషించగా, దీనిని ధృవీకరించే ఎటువంటి నివేదిక లేదా విశ్వసనీయ ఆధారాలు మాకు దొరకలేదు. సెంబర్ 2025లో చైనా మత్స్యకారులపై/చైనీస్ పడవలపై ఇండోనేషియా ఏమైనా చర్యలు తీసుకుందా అనే దానిపై శోధించినప్పుడు ఎటువంటి విశ్వసనీయ నివేదికలు లభించలేదు.
తరువాత, వీడియో యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి మేము దాని వివిధ కీఫ్రేమ్‌ల నుండి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా AP ఆర్కైవ్ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోను కనుగొన్నము. “ఇండోనేషియా 31 అక్రమ ఫిషింగ్ బోట్లను కూల్చివేసింది”అనే శీర్షికతో ఫిబ్రవరి 22న
, వీడియో అప్-లోడ్ చేయబడింది.దీని స్క్రీన్‌షాట్‌ను కింద చూడవచ్చు.

(వీడియో సౌజన్యం: AP ఆర్కైవ్ )
ఇది కాకుండా, ఫిబ్రవరి 22, 2016న TRT వరల్డ్ మరియు గ్లోబల్ న్యూస్ వారు ఇదే వీడియోను అప్-లోడ్ చేయడం గమనించాము.
ఆ వీడియోలో, “ఇండోనేషియా సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ 31 అక్రమ చేపల వేట పడవలను ధ్వంసం చేసింది. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా మరియు మయన్మార్ దేశాలకు చెందిన ఈ నౌకలను దేశవ్యాప్తంగా ఐదు వేర్వేరు ప్రదేశాలలో పేల్చివేశారు. ఈ చర్య అక్రమ చేపల వేటకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో భాగం.” అంటూ యాంకర్ చెప్పడం చూడవచ్చు
:
\
((వీడియో సౌజన్యం: టిఆర్‌టి వరల్డ్)
చైనా పడవలపై ఇండోనేషియా జరిపిన దాడి విషయానికి వస్తే, వివాదాస్పద జలాల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇండోనేషియా నిజంగానే ఒక చైనా మత్స్యకార పడవపై దాడి చేసిందని 2016 జూన్ 20న బీబీసీ న్యూస్ నివేదించింది. ఇరుపక్షాలు తమ చర్యలను సమర్థించుకున్నాయి మరియు “ఆ మత్స్యకారులను ఇండోనేషియా అధికారులు ఇంకా నిర్బంధంలో ఉంచారా లేదా అనేది స్పష్టంగా లేదని ” ఆ నివేదిక పేర్కొంది.అయితే, ప్రస్తుత దావా/వాదనకి ఇది ఒక భిన్నమైన సంఘటన మరియు ఈ ఆరోపణలో పేర్కొన్నట్లుగా 31 చైనా పడవలను గురించి ప్రస్తావన లేదు.
అందువల్ల, ఈ వాదన తప్పు.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

