ఒడిశాలో 8,000 మంది విద్యార్థులు కుర్చీలు,బల్లలు లేకుండానే పరీక్షలు రాయడానికి విమానాశ్రయ రన్‌వేపై కూర్చున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : ఒడిశాలో దాదాపు 8,000 మంది విద్యార్థులు బల్లలు,కుర్చీలు లేకుండానే పరీక్షలు రాయడానికి విమానాశ్రయా రన్‌వేపై కూర్చున్నారనేది వాదన.
నిర్ధారణ /Conclusion : ఈ వాదన నిజమే. ఈ సంఘటన వైరల్ పోస్ట్ వెలువడటానికి మూడు రోజుల ముందు, అంటే డిసెంబర్ 16, 2025న ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలోని జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగింది. 8,000 మందికి పైగా అభ్యర్థులు హోం గార్డ్ ఉద్యోగాల కోసం పోటీ పడ్డారు మరియు విశ్వసనీయ నివేదికలు కూడ ఈ విషయాన్ని ధృవీకరించాయి.
రేటింగ్ /Rating : ఈ వాదన నిజమే ![]()
******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి .
లేదా క్రింది వాస్తవ పరిశీలన కధనం చదవండి![]()
******************************************************
ఒడిశాలోని ఒక విమానాశ్రయ రన్‌వేపై బల్లలు,కుర్చీలు లేకుండా విద్యార్థులు పరీక్ష రాస్తున్న దృశ్యాల వీడియోను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసారు. X(ఎక్స్) యూజర్ ‘బెనారసియా’ డిసెంబర్ 19, 2025న, వేలాది మంది అభ్యర్థులు ఒక బహిరంగ రన్‌వేపై పలు వరుసలుగా కూర్చుని పరీక్ష రాస్తు కనిపిస్తున్న ఒక వీడియోను (ఒడిశా టీవీ (OTV)కి చెందిన వీడియో)షేర్ చేసారు.ఆ వీడియో క్యాప్షన్ ఇలా ఉంది: “ఒడిశాలో, 187 హోంగార్డు ఉద్యోగాల కోసం 8000(ఎనిమిది వేల)మందికి పైగా అభ్యర్థులు రావడంతో, విమానాశ్రయ రన్‌వే పరీక్షా కేంద్రంగా మారింది.” ఆ పోస్ట్‌ను కింద చూడవచ్చు–
In Odisha, Airstrip doubles up as examination hall as more than 8000 aspirants turn up for more than 187 homeguard vaccancies. pic.twitter.com/1XH78meDcN
— Piyush Rai (@Benarasiyaa) December 19, 2025

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
🚨 An airstrip in Odisha’s Sambalpur turns into an exam hall as 8,000 graduates appear for 187 government posts. pic.twitter.com/wLEhCNucdM
— Indian Tech & Infra (@IndianTechGuide) December 20, 2025
వాస్తవ పరిశీలన
ఈ వాదన/ఆరోపణపై విచారణ జరిపిన DigitEYE బృందం అది నిజమని కనుగొంది. 187 హోమ్ గార్డ్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్ష ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలోని జమాదర్‌పాలి ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగింది. ఈ విషయాన్ని అనేక మీడియా సంస్థలు ధృవీకరించాయి మరియు వీడియోలో ఆరోపించినట్లు ఇది వాస్తవంగా జరిగిన సంఘటన.
వివరాలు :
మొదటగా, ఆ దావా/వాదనలో షేర్ చేయబడిన వీడియో ఫుటేజీలోని వివిధ కీలక ఫ్రేమ్‌లను ఉపయోగించి మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, డిసెంబర్ 17, 2025న OTV (ఒడిశా టీవీ) అప్‌లోడ్ చేసిన పూర్తి యూట్యూబ్ వీడియోను కనుగొన్నము.”187 హోం గార్డ్ పోస్టుల కోసం 11,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడంతో ఎయిర్‌స్ట్రిప్ పరీక్షా కేంద్రంగా మారింది”, అనే శీర్షికతో వీడియో అప్-లోడ్ చేయబడింది. వీడియోను క్రింద చూడవచ్చు .

(సౌజన్యం: ఓటీవీ)
దీని తర్వాత, ఈ వాదన గురించి మరింత తెలుసుకోవడానికి మేము “అభ్యర్థులు ఎయిర్‌స్ట్రిప్‌పై హోం గార్డ్ పరీక్షకు హాజరయ్యారు” అనే పదంతో అంతర్జాలంలో అన్వేషించగా, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను ‘WION న్యూస్’ మరియు ‘ది లల్లన్‌టాప్’ కూడా ప్రసారం చేశాయని కనుగొన్నము. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
తరువాత, 187 హోంగార్డు పోస్టుల కోసం 11,000 మంది విద్యార్థులు పోటీ పడ్డారా లేక 8,000 మంది విద్యార్థులు పోటీ పడ్డారా అనే దానిపై, పాల్గొన్న వారి సంఖ్యను నిర్ధారించుకోవడానికి మేము ప్రయత్నించగా,“సంబల్‌పూర్ జిల్లా నలుమూలల నుండి 8,000 మందికి పైగా అభ్యర్థులు కేవలం 187 ఖాళీల కోసం పరీక్షకు హాజరయ్యారని” ఎన్‌డిటివి నివేదికను కనుగొన్నము. విద్యార్థుల సమూహాన్ని నియంత్రించడానికి “ముగ్గురు అదనపు సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్, 24 మంది ఇన్‌స్పెక్టర్లు, 86 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లతో పాటు 100 మందికి పైగా హోంగార్డులు మరియు ట్రాఫిక్ సిబ్బందిని” ఎలా మోహరించారో కూడా ఈ నివేదికలో పేర్కొనబడింది. నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన మరో నివేదిక కూడా 187 హోం గార్డు పోస్టుల కోసం 8,000 మంది దరఖాస్తుదారులు పోటీ పడ్డారని ధృవీకరించింది. “జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్ల కోసం సంబల్‌పూర్ పోలీసులు డిసెంబర్ 16న నిర్వహించిన ఈ పరీక్ష, పట్టణానికి సమీపంలోని జమాదర్‌పల్లి ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగింది.” లాజిస్టికల్ సవాళ్లను అధిగమించడానికి, “రన్‌వేపై రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని” ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది.
అందువల్ల, ఈ వాదన నిజమే.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
యూరప్‌లోని ఒక చర్చిని నిజంగా నరసింహ దేవాలయంగా మార్చారా? వాస్తవ పరిశీలన

