లండన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకలో ప్రజలు ప్రిన్స్ విలియం మరియు అతని కుటుంబాన్ని విస్మరించారా ? వాస్తవ పరిశీలిన

వాదన/Claim:లండన్‌లో జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ప్రజలు ప్రిన్స్ విలియం మరియు అతని కుటుంబాన్ని ఎలా విస్మరించారో ఈ వీడియో చూపిస్తుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించడం. ఈ వీడియో “టుగెదర్ ఎట్ క్రిస్మస్” కరోల్ సర్వీస్ కార్యక్రమానికి సంబంధించింది , దీనిని ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇది ఆహ్వానితులకే పరిమితమైన సమావేశం, బహిరంగ సమావేశం కాదు.

రేటింగ్/Rating : తప్పుగా చూపించడం —


లండన్‌లో జరిగిన ఒక క్రిస్మస్ వేడుకలో రాజకుటుంబాన్ని ప్రజలు ఎలా విస్మరించారనే దానికి సంబంధించిన ఒక వాదనను చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు .  X యూజర్ ‘kingkapoor72’ అటువంటి వాదననే ఈ విధంగా షేర్ చేసారు : “లండన్‌లో ఎవరూ బహిరంగ క్రిస్మస్ కార్యక్రమంలో రాజకుటుంబాన్ని చూడటానికి రాలేదు. బహుశా లండన్ ఇకపై బ్రిటన్ రాజ్యం కాకపోవచ్చు. సామూహిక వలసల వలన రాచరికం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు.”ఈ పోస్ట్‌ను సుమారు 158,000 మంది వీక్షించారు మరియు దానిని మీరు క్రింద చూడవచ్చు

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే షేర్ చేసారు , వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలిన

ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి,పరిశీలించగా, ఇది తప్పుగా చూపిస్తుందని అని తేలింది. వేల్స్ యువరాణి ప్రతి సంవత్సరం నిర్వహించే “టుగెదర్ ఎట్ క్రిస్మస్” కరోల్ సేవ కార్యక్రమం , 1,600 మంది కమ్యూనిటీ వీరులు, ఛారిటీ కార్మికులు మరియు కుటుంబాలను మాత్రమే ఆహ్వానించే సమావేశం, బహిరంగ ప్రదర్శన కాదు. ఈ వీడియో, వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజకుటుంబం సురక్షితంగా ప్రవేశిస్తున్న ఘటనను చూపిస్తుంది, ప్రజలు వారిని విస్మరిస్తున్నట్టు  కాదు.

వివరాలు :

మేము మొదట క్లిప్‌లో చూపబడిన వీడియో యొక్క కీఫ్రేమ్‌ల నుండి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా, 6 డిసెంబర్ 2025న ది డైలీ గార్డియన్ పోస్ట్ చేసిన ‘టుగెదర్ ఎట్ క్రిస్మస్’సేవ కార్యక్రమం కోసం UK రాజ కుటుంబం వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేకి చేరుకుంది ” అనే శీర్షికతో ఉన్న యూట్యూబ్ వీడియోను కనుగొన్నము.
యూట్యూబ్ వివరణలో ఇలా పేర్కొన్నారు :”‘టుగెదర్ ఎట్ క్రిస్మస్’ కరోల్ సేవ కోసం వేల్స్ యువరాజు మరియు యువరాణి జార్జ్, షార్లెట్ మరియు లూయిస్‌లతో కలిసి వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేకి చేరుకున్నారు, వీరిలో యూజీన్ లెవీ, కేట్ విన్స్లెట్ మరియు చివెటెల్ ఎజియోఫోర్ వంటి తారలు కూడా చేరారు.” దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్ మరియు వీడియోను కింద చూడవచ్చు:

(సౌజన్యం: ది డైలీ గార్డియన్)

తరువాత, వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరిగిన “టుగెదర్ ఎట్ క్రిస్మస్” కార్యక్రమం గురించి మరింత సమాచారం కోసం మేము నివేదికల కోసం అన్వేషించగా, ఇన్‌స్టైల్ ప్రచురించిన ఒక నివేదికను కనుగొన్నము. నివేదిక ప్రకారం, కేట్ మిడిల్టన్ కోవిడ్-19 మహమ్మారి సమయంలో “కమ్యూనిటీ వీరులను” సత్కరించడానికి మరియు ప్రోత్సహించడానికి తన మొదటి “టుగెదర్ ఎట్ క్రిస్మస్” కార్యక్రమాన్ని 2021లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మరియు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ నడుపుతున్న ఛారిటీ అయిన ‘ది రాయల్ ఫౌండేషన్’ మద్దతు ఇస్తుంది మరియు ముందుకు నడిపిస్తుంది.

“ఇప్పుడు దాని ఐదవ సంవత్సరంలో, “టుగెదర్ ఎట్ క్రిస్మస్” దాదాపు 1,600 మంది అతిథులను సెలవు సీజన్లో పాడటానికి, సంబరాలు చేసుకోవడానికి మరియు ఆనందించడానికి ఆహ్వానిస్తుంది.” ప్రతి సంవత్సరం “టుగెదర్ ఎట్ క్రిస్మస్” కార్యక్రమానికి ఒక కొత్త థీమ్ ఉంటుంది. దిగువ నివేదికలోని కొంత భాగాన్ని చూడవచ్చు –

(సౌజన్యం: ఇన్‌స్టైల్)

రాయల్ ఫౌండేషన్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ ప్రచురించిన మరో నివేదిక ప్రకారం, ఈ కార్యక్రమం “UK అంతటా నుంచి 1,600 మందికి పైగా జనాలను ప్రేమను పంచుకోవటానికి ఒకచోటకు చేర్చింది”, అని పేర్కొంది.

ఈ కార్యక్రమం ఇతరుల కోసం తమ సమయాన్ని స్వచ్ఛందంగా అందించే, తమ సమాజంలోని ప్రజలను ఒకచోట చేర్చే కార్యక్రమాలకు నాయకత్వం వహించే లేదా తమ చుట్టూ ఉన్నవారికి సహాయ హస్తం అందించే అనేక మంది వ్యక్తులను గుర్తించిందని మరియు ఈ కార్యక్రమంలో సంగీత ప్రదర్శనలు, పఠనాలు కూడా ఉన్నాయని నివేదిక పేర్కొంది. మరిన్ని వివరాలను రాయల్ ఫౌండేషన్‌లో ఇక్కడ చూడవచ్చు.

దిగువ నివేదికలోని కొంత భాగాన్ని చూడవచ్చు :

 

(సౌజన్యం : రాయల్ ఫౌండేషన్ )

కాబట్టి ఈ వాదనలో ” ప్రిన్స్ విలియం మరియు అతని కుటుంబాన్ని ప్రజలు విస్మరించారని” తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

ఈ వీడియోలో చూపినట్టు డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ III నుండి నైట్ హుడ్ ని తిరస్కరించారా? వాస్తవ పరిశీలన

MTV ఇండియా డిసెంబర్ 2025 నాటికి అన్ని కార్యకలాపాలను మూసివేస్తుందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.