ఈ వీడియోలో చూపినట్లు  ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యువతితో విదేశాలకు వెళ్లడం వెళ్తున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వైరల్ వీడియోలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలలో ఒక యువతితో కనిపించారనేది వాదన.

నిర్ధారణ /Conclusion: ఈ వాదన తప్పుగా చూపించబడింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ తన మేనకోడలు మిరాయా వాద్రాతో(ప్రియాంక గాంధీ వాద్రా కుమార్తె ) ఉన్నారనేది వాస్తవం.

రేటింగ్ /Rating: తప్పుగా చూపించడం —

******************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి.

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి .

******************************************************

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక విదేశీ అమ్మాయితో విదేశాల్లో ఉన్నారని క్లెయిమ్/దావా చేస్తూ చాలా మంది వినియోగదారులు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. X యూజర్ ‘ArunKoslii’ ఈ విధంగా పోస్ట్‌ను షేర్ చేశారు:कांग्रेस के 56 साल के झंडनायक किसी 9जवान महिला के साथ देखे गये है विदेश में.
తెలుగులోకి అనువదించగా : “కాంగ్రెస్ పార్టీ జెండా మోసే 56 ఏళ్ల వ్యక్తి విదేశాలలో ఒక యువతితో కనిపించారు .” ఈ పోస్ట్ దాదాపు 1.2 మిలియన్ల వీక్షణలను(views) పొందింది, ఇక్కడ చూడవచ్చు:

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే షేర్ చేసారు , వాటిని ఇక్కడ చూడవచ్చు.

FACT CHECK

ఈ వాదనను దర్యాప్తు చేయాలని బృందం నిర్ణయించి పరిశీలించగా,ఇది తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందని తేలింది. వీడియోలో ఉన్న మహిళ ప్రియాంక గాంధీ వాద్రా కుమార్తె మిరాయా వాద్రా.ఆమె రాహుల్ గాంధీ మేనకోడలు, దావా చేయబడినట్టు వేరే  యువతీ కాదు.

వీడియోలో ఉన్న మహిళను గుర్తించడానికి,  DigitEye బృందం  వివిధ కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించగా, ప్రియాంక గాంధీ వాద్రా కుమార్తె అయిన మిరాయ వాద్రా అని మరియు ఆమె యొక్క అనేక ఇతర చిత్రాలను కూడ ఫలితాలు వెల్లడించాయి. కింద చూడవచ్చు:

ఇంకా, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైనా అధికారిక వివరణ కోసం అన్వేషించగా, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు సుప్రియా భరద్వాజ్ X లో దీని గురించి ఈ విధంగా స్పష్టం చేసారు :नेता विपक्ष  @RahulGandhi जी का अपनी भांजी के साथ का सितंबर 2025 का वीडियो चला कर सार्वजनिक तौर पर अपशब्द कहना, बहुत घटिया सोच को दिखाता है. संस्कारों का ढोल पीटने वालों, कहाँ हैं तुम्हारे अपने संस्कार ???
తెలుగులోకి అనువదించగా: ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన మేనకోడలితో ఉన్న సెప్టెంబర్ 2025 వీడియోను ప్లే చేయడం మరియు దాని గురించి బహిరంగంగా అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం చాలా చౌకబారు మనస్తత్వాన్ని చూపిస్తుంది. విలువల గురించి గొప్పలు చెప్పుకునే వారు, మీ సొంత విలువలు ఎక్కడ?” పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు:

AICC – కమ్యూనికేషన్ జాతీయ కార్యదర్శి రుచిరా చతుర్వేది కూడా తన X ఖాతాలో దీని గురించి ఇలా పోస్ట్ చేశారు: “Love, affection, relationships and connections—where do the Sanghis even understand them? That’s why these @RahulGandhi and his niece Miraya’s September 2025 video is being circulated to spread fake news and hatred. Their mentality is just trash.

తెలుగులోకి అనువదించగా: “ప్రేమ, ఆప్యాయత, సంబంధాలు మరియు కనెక్షన్లు – వీటి గురించి సంఘీలు ఎక్కడ అర్థం చేసుకుంటారు? అందుకే రాహుల్ గాంధీ మరియు అతని మేనకోడలు మిరాయ యొక్క సెప్టెంబర్ 2025 పాత వీడియోను ‘నకిలీ వార్తలు మరియు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి’ ప్రసారం చేస్తున్నారు. వారిది కేవలం చెత్త మనస్తత్వం. క్రింద పోస్టును చూడవచ్చు :

జూన్ 2024లో, భారత జాతీయ కాంగ్రెస్ మీడియా & ప్రచార విభాగం ఛైర్మన్ పవన్ ఖేరా దీనిపై స్పష్టత ఇస్తూ ఒక ట్వీట్ పోస్ట్ చేశారు, “రాహుల్ గాంధీ తన మేనకోడలు స్నాతకోత్సవానికి హాజరు కావడానికి లండన్ వెళ్లారు మరియు త్వరలో తిరిగి వస్తారు” అని పేర్కొన్నారు. పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు:

కాబట్టి, వాదన/దావాలో, తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.

******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు

ఆధార్ కార్డు ఉన్న భారతీయ పౌరులకు ప్రధాని మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ పథకాన్ని ప్రకటించారా? వాస్తవ పరిశీలన

ఇప్పటి నుండి ప్రతి నెల అన్ని ఆదివారాలు మరియు శనివారాలు బ్యాంకులు మూసివేయబడతాయా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.