ఈ వీడియోలో చూపినట్టు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాని మోదీని ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రశ్నిస్తున్నారా ?వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆపరేషన్ సిందూర్‌లో సైనిక/యుద్ధ నష్టాలపై ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారనేది వాదన/దావా.

నిర్ధారణ /Conclusion : వాదనలో తప్పుగా చూపించడం జరిగింది . ఇది నవంబర్ 19,2025న జరిగిన శ్రీ సత్యసాయి బాబా యొక్క శతాబ్ది జన్మదినోత్సవ వేడుకల్లో ఐశ్వర్య రాయ్ చేసిన ప్రసంగం యొక్క ప్రామాణికమైన ఫుటేజ్‌లోని కొంత భాగంలో AI వాయిస్‌ని ఉపయోగించి సృష్టించబడిన డీప్‌ఫేక్ వీడియో. 

రేటింగ్ /Rating: తప్పుగా చూపించడం —

*******************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వైరల్ వీడియో క్లిప్‌ను అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.”ఆపరేషన్ సిందూర్” సమయంలో భారతదేశం ఎదుర్కొన్న సైనిక ఎదురుదెబ్బల గురించి బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాని మోదీని నేరుగా ప్రశ్నిస్తున్నట్లు చూపించే 29 సెకన్ల వీడియో క్లిప్‌ను కూడా పోస్ట్ తో జతచేసి షేర్ చేయబడింది. దిగువ పోస్ట్‌ను చూడవచ్చు.

ఆ క్లిప్‌లో ఐశ్వర్య ఇలా అడుగుతున్నట్లు చూడవచ్చు, “నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడగాలనుకుంటున్నాను, మనం పాకిస్తాన్ చేతిలో ఆరు జెట్ విమానాలను ఎందుకు కోల్పోయాము? పాకిస్తాన్ చేతిలో నాలుగు రాఫెల్ విమానాలను ఎందుకు కోల్పోయాము? పాకిస్తాన్ చేతిలో రెండు S-400 క్షిపణిలను ఎందుకు కోల్పోయాము? పాకిస్తాన్ చేతిలో మూడు వందల మంది సైనికులను ఎందుకు కోల్పోయాము? కాశ్మీర్‌ మరియు రాజస్థాన్‌ సరిహద్దులోని మన ముఖ్యమైన భాగాలను పాకిస్తాన్‌కు ఎందుకు కోల్పోయాము?” ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సినిమా పరిశ్రమ రాజకీయాల్లో జోక్యం చేసుకోదని మాకు తెలుసు, కానీ ఇది దేశం తెలుసుకోవాల్సిన విషయం, ఇది మీరు మాకు చెప్పాలి. (sic)”

మరొక వినియోగదారు నుండి ఇలాంటి పోస్ట్‌నే  ఇక్కడ చూడండి.

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలను పంచుకున్నారు, వాటిని ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన

ఈ వాదనను తనిఖీ చేయాలని DigitEYE India బృందం నిర్ణయించి, పరిశీలించగా ఇది పూర్తిగా అబద్ధమని తేలింది. ఆడియో AI ద్వారా మార్చబడింది మరియు ఈవెంట్ యొక్క ప్రామాణిక ఫుటేజ్‌లో అలాంటి పంక్తులు కానీ ప్రశ్నలు కానీ లేవు. అంతేకాకుండా, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అలాంటి ప్రశ్నలు అడిగినట్లు మీడియా సంస్థల నివేదికలు కూడా లేవు.

దావా చేయబడిన వీడియోలో నుంచి వివిధ కీఫ్రేమ్‌ల యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, శ్రీ సత్యసాయి హిందీ యూట్యూబ్ ఛానెల్‌ వారు అప్‌లోడ్ చేసిన ఈ ఈవెంట్ యొక్క అసలు వీడియోను కనుగొన్నము. “శతాబ్ది సమరోహము: గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రశాంతి నిలయానికి సందర్శన | నవంబర్ 19, 2025.”అన్న శీర్షికతో వీడియో అప్-లోడ్ చేయబడింది.

ఈ వీడియోలో ఐశ్వర్య రాయ్ ని వేదికపైకి ఆహ్వానించడం చూడవచ్చు. ఆమె దాదాపు 10 నిమిషాలు (టైమ్‌స్టాంప్ 2:05:18 నుండి 2:14:01 వరకు) ప్రసంగించారు.

తన ప్రసంగంలో, ఐశ్వర్య బాబా పట్ల భక్తిని వ్యక్తం చేస్తూ , ఆయన జన్మించి శతాబ్దం గడిచినా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూన్న ఆయన బోధనల గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమె ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు నిజమైన నాయకత్వం అంటే ‘మానవ సేవే మాధవ సేవ’ అనే బాబా ఆలోచనను అందరికి గుర్తు చేసారు.ఆపరేషన్ సిందూర్ గురించి కాదు కదా ఆమె వేరే ఏ ఇతర ప్రశ్నల‌ను కూడా ప్రధానమంత్రి మోదీని అడగలేదు. పూర్తి వీడియో‌ను క్రింద చూడవచ్చు.

(సౌజన్యం :శ్రీ సత్యసాయి హిందీ యూట్యూబ్ ఛానెల్‌)

ఆమె ప్రసంగం యొక్క వీడియోలోని కొంత భాగాన్ని ANI వార్తలు అప్‌లోడ్ చేశాయి, దానిని ఇక్కడ చూడవచ్చు. (సౌజన్యం :ANI)

ఐశ్వర్య ఈ కార్యక్రమంలో చేసిన ప్రసంగం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదిక రాసింది. అందులో ఐశ్వర్య ఇలా మాట్లాడారని పేర్కొన్నారు … “ఒకే కులం ఉంది, అది మానవత్వ కులం. ఒకే మతం ఉంది, అది ప్రేమ మతం. ఒకే భాష ఉంది, అది మనసులోని భాష, మరియు ఒకే దేవుడు ఉన్నాడు,ఆయన సర్వవ్యాప్తి చెంది ఉన్నాడు.”
బాల వికాస్ నుండి విశ్వవిద్యాలయాల వరకు విలువలతో కూడిన ఉచిత సాయి విద్యా వ్యవస్థను, ఉచిత ప్రపంచ స్థాయి సంరక్షణను అందించే సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులను, అనేక కార్యక్రమాల గురించి ఆమె మాట్లాడారని నివేదిక పేర్కొంది. వీడియోలో కూడా చూడవచ్చు. దిగువ నివేదికలోని కొంత భాగాన్ని చూడవచ్చు.-

చివరగా, క్లెయిమ్‌లో షేర్ చేయబడిన వీడియో నుండి కొంత ఆడియో భాగాన్ని DigitEYE India బృందం తీసుకొని , దానిని ‘Resemble AI‘ యొక్క ఆడియో డిటెక్షన్ టూల్ లో అప్-లోడ్ చేసి పరిశీలించి చూడగా, అది నకిలీదని, AI ద్వారా రూపొందించబడిందని తేలింది.దిగువ టూల్ ఫలితాలను చూడవచ్చు –

కాబట్టి, ఆ వాదన తప్పు.

******************************************************

మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు

ప్రధాని మోదీ ర్యాలీకి హాజరయ్యే విద్యార్థులకు ‘దేవ్ భూమి’ ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం 50 బోనస్ మార్కులు ఇస్తుందా? వాస్తవ పరిశీలన

ప్రభుత్వ సేవలలో అవినీతిని నివేదించడానికి PMO ఇండియా 9851145045 హాట్‌లైన్‌ను పౌరుల కోసం ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.