ఆధార్ కార్డు ఉన్న భారతీయ పౌరులకు ప్రధాని మోదీ ఉచిత స్ప్లెండర్ బైక్ పథకాన్ని ప్రకటించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఆధార్ కార్డు ఉన్న భారతీయ పౌరులకు ఉచిత స్ప్లెండర్ బైక్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారనేది వాదన.
నిర్ధారణ /Conclusion: ఈ వాదన పూర్తిగా తప్పు. అలాంటి ఉచిత స్ప్లెండర్ బైక్ పథకం ఏదీ ప్రకటించబడలేదు మరియు ఈ వాదన పూర్తిగా కల్పితం. వీడియో యొక్క ఆడియోను AI ఉపయోగించి రూపొందించారు .
రేటింగ్ /Rating: తప్పుడు వాదన– ![]()
*******************************************************
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి
లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************
ఆధార్ కార్డు ఉన్న భారతీయ పౌరులందరికీ ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత స్ప్లెండర్ బైక్ పథకాన్ని ప్రకటించారని అనేక మంది వినియోగదారులు సోషల్ మీడియాలో ఒక రీల్‌ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ‘bikebazzarupdate’, ఆఫర్ పొందడానికి 4 మంది స్నేహితులతో దీన్ని షేర్ చేయమని, ఇచ్చిన ఖాతాను అనుసరిస్తూ వారి వివరాలను షేర్ చేయాలనీ ప్రజలను కోరుతున్నట్లు ఉన్న ఒక రీల్‌ను షేర్ చేసారు. క్రింద పోస్ట్‌ను చూడండి –

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి రీల్‌నే షేర్ చేశారు, ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఇది పెద్ద వార్త అని పేర్కొంటూ, ప్రజలు తమ రీల్‌ను లైక్ చేయాలని,ఆఫర్‌ను పొందడానికి వారు తమ రాష్ట్రాన్ని పేర్కొనాలని మరియు గూగుల్‌లో ‘లోన్ మైతహుకో’ వెబ్‌సైట్‌ను పరిశీలించి వారి వివరాలను షేర్ చేయాలని కోరారు. క్రింద ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను చూడవచ్చు :
View this post on Instagram

వాస్తవ పరిశీలన
ఈ వాదనను దర్యాప్తు చేయాలని DigitEye బృందం నిర్ణయించి, పరిశీలించగా ఇది పూర్తిగా తప్పని /అబద్ధమని తేలింది. ఉచిత స్ప్లెండర్ బైక్ పథకం గురించి విశ్వసనీయ మీడియా వర్గాల నుంచి నివేదికలు గాని లేదా ప్రభుత్వ ప్రకటనలు గాని లేవు. ఆడియో, AIని ఉపయోగించి మార్చబడింది.
ఈ వాదన గురించి తెలుసుకోవడానికి మేము మొదట “ఉచిత స్ప్లెండర్ బైక్ పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ” అనే పదంతో వెబ్ లో అన్వేషించగా , ఏ మీడియా సంస్థలు ధృవీకరించిన నివేదికలు గాని ప్రధాన మంత్రి కార్యాలయ వెబ్‌సైట్‌లో గాని ఎటువంటి అధికారిక ప్రకటనలు లభించలేదు.
వాదనలో కనిపించిన బ్యాంక్ ఖాతా సక్రమంగా లేకపోవడం మరియు ఇతర అనేక అసమానతలను మేము గమనించాము. మేము వాదనలో చూపబడిన చిత్రం యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, 6 సంవత్సరాల క్రితం ‘PMO ఇండియా’ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన వీడియో లభించింది, ఇది మోడీ కిసాన్ పథకాన్ని ప్రకటిస్తున్న సమయంలోని వీడియో. వాదనలో చూపబడిన వీడియో,ఈ వీడియోతో సరిగ్గా సరిపోలింది.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019లో జరిగిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని చూపిస్తున్న అసలైన వీడియోను కింద చూడవచ్చు.
2019లో జరిగిన వేరే సంఘటన నుండి మోడీ చిత్రాన్ని తీసుకొని, ఆడియోను తారుమారు చేసి, తత్ద్వారా, నకిలీ వాదనను ఎలా రూపొందించారో క్రింద చూడవచ్చు.

అదేవిధంగా, మరొక సంఘటన నుండి మోడీ చిత్రాన్ని తీసుకొని రెండవ వాదన చేయబడింది. కింద చూడవచ్చు (సౌజన్యం:DDNewsLive)

చివరగా, అనేక ఆడియో మరియు లిప్-సింక్ అసమానతలను కనుగొన్న తర్వాత, మేము రీల్ నుండి ఆడియోను తీసుకొని AI ఆడియో డిటెక్టర్‌లో పరిశీలించగా,ఈ ఆడియో AI ద్వారా రూపొందించబడి ఉంటుందని, అందులో 1% మాత్రమే వాస్తవమైనదని ఫలితాలు వెల్లడించాయి. దిగువ ఫలితాలను చూడవచ్చు:

కాబట్టి, ఆ వాదన పూర్తిగా తప్పు.
******************************************************
మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు

