ఈ వీడియోలో చూపినట్టు  డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ III నుండి నైట్ హుడ్ ని తిరస్కరించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వైరల్ క్లిప్‌లో డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ III నుండి నైట్‌హుడ్‌ను తిరస్కరించి, ఆ తర్వాత ఆయనను కొట్టారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ వాదన పూర్తిగా తప్పు. డేవిడ్ బెక్‌హామ్ నైట్ హుడ్ ని తిరస్కరించలేదు మరియు కింగ్ చార్లెస్ III ని కూడా కొట్టలేదు.ఈ క్లిప్ AI ని ఉపయోగించి మార్చబడింది . బెక్‌హామ్, క్రీడలు మరియు దాతృత్వానికి చేసిన సేవలకు గాను కింగ్ చార్లెస్ నుండి నైట్ హుడ్ అందుకున్నారు.
రేటింగ్/Rating: పూర్తిగా తప్పు — Five rating 

**********************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

వైరల్ క్లిప్‌లో డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ III నుండి నైట్‌హుడ్‌ను తిరస్కరించి, ఆ తర్వాతఆయనను పిడికిలితో కొట్టారనే ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘MemerunnerGPT’ అనే X వినియోగదారుడు ” డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ నుండి నైట్ హుడ్ ని నిరాకరిస్తున్నారు!” అనే శీర్షికతో ఒక దావాను షేర్ చేసారు.

14 సెకన్ల నిడివి గల వీడియోలో విండ్సర్ కోటలో డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ III ముందు మోకరిల్లి, ఆపై రాజును గుద్దడం మరియు పతకాన్ని విసరడం చూడవచ్చు. పోస్ట్‌ను క్రింద చూడవచ్చు.

 

ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే షేర్ చేశారు, వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన

DigitEYE ఇండియా Team ఈ వాదనను దర్యాప్తు చేయాలని నిర్ణయించుకొని పరిశీలించగా ,అది పూర్తిగా తప్పు /అబద్ధమని తేలింది. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడింది మరియు డేవిడ్ బెక్‌హామ్ కింగ్ చార్లెస్ III నుండి నైట్ హుడ్ ని తిరస్కరించలేదు మరియు ఆయనను కొట్టలేదు. అసలైన ఫుటేజ్ మరియు అనేక నివేదికలు అతను నవంబర్ 4, 2025న విండ్సర్ కాజిల్‌లో నైట్ హుడ్ గౌరవాన్ని అందుకున్నారని నిర్ధారించాయి.

మేము మొదట “డేవిడ్ బెక్‌హామ్ నైట్ హుడ్ ని తిరస్కరించారు”అనే పదంతో వెబ్ లో అన్వేషించగా, ఎటువంటి విశ్వసనీయ నివేదికలు లభించలేదు.మరోవైపు, BBC ప్రచురించిన నివేదికలలో డేవిడ్ బెక్‌హామ్‌ను కింగ్ చార్లెస్ III నైట్‌హుడ్ అందుకున్నట్లు నిర్ధారించాయి. ఈ సంవత్సరం మొదట్లో కింగ్ చార్లెస్ పుట్టినరోజు ‘గౌరవ జాబితా’లో పేరు ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి మంగళవారం బెర్క్‌షైర్‌లో జరిగిన కార్యక్రమంలో రాజు నైట్ హుడ్ గౌరవాన్ని/ బిరుదును ప్రదానం చేశారని “, నివేదిక పేర్కొంది.

నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు :

ఆ తర్వాత, మేము డేవిడ్ బెక్‌హామ్ నైట్ హుడ్ అందుకున్న మూల వీడియో ఫుటేజ్ కోసం అన్వేషించగా,  ఇంగ్లీష్ బ్రాడ్‌కాస్ట్ కంపెనీ ఈ గౌరవ ప్రధాన కార్యక్రమం యొక్క ఫుటేజీని వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసారని కనుగొన్నము.  కింగ్ చార్లెస్ III కత్తితో భుజాలను తట్టడాన్ని మరియు బెక్‌హామ్ ఆనందంతో లేచి ఎర్ర రిబ్బన్‌ను స్వీకరించడాన్ని మనం వీడియో క్లిప్ లో చూడవచ్చు.

news.com.au వంటి ఇతర ఛానెల్‌లు కూడా మరొక వీడియోని అప్‌లోడ్ చేశాయి, దానిని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, AI-డిటెక్షన్ టూల్‌లో వాదన/దావాలో ఉపయోగించిన క్లిప్ నుండి మేము వివిధ కీఫ్రేమ్‌లను తీసుకొని పరిశీలించగా, వీడియో AI ద్వారా పూర్తిగా మార్చబడిందని ఫలితాలు నిరూపించాయి.  ఫలితాలను క్రింద చూడవచ్చు –

కాబట్టి ఈ వాదన/దావా పూర్తిగా తప్పు.

*************************************

మరికొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

MTV ఇండియా డిసెంబర్ 2025 నాటికి అన్ని కార్యకలాపాలను మూసివేస్తుందా? వాస్తవ పరిశీలన

ట్రంప్ తన UK రాష్ట్ర పర్యటన సందర్భంగా స్టార్ వార్స్ లోని “ది ఇంపీరియల్ మార్చ్” అనే థీమ్ సాంగ్ కు సెల్యూట్ చేశారా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.