భారతీయ-అమెరికన్ గణాంకవేత్త సి. రాధాకృష్ణరావుకు ‘గణాంకాల’ (స్టాటిస్టిక్స్) విభాగంలో నోబెల్ బహుమతి లభించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:భారతీయ-అమెరికన్ గణాంకవేత్త సి. రాధాకృష్ణరావుకు 102 సంవత్సరాల వయస్సులో ‘గణాంకాల’ విభాగంలో నోబెల్ బహుమతి లభించిదనేది వాదన.
నిర్ధారణ :Conclusion: తప్పుగా చూపించబడింది . ‘గణాంకాల’ విభాగంలో నోబెల్ బహుమతి లేనందున సి. రాధాకృష్ణరావుకు నోబెల్ బహుమతి రాలేదు.
అయితే, అతనికి 2023లో ‘గణాంకాలలో అంతర్జాతీయ బహుమతి లభించింది,ఇది నోబెల్ బహుమతికి సమానమైనదిగా మరియు ఆ రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది.
రేటింగ్/Rating: తప్పుగా చూపించబడింది –– ![]()
భారతీయ-అమెరికన్ గణాంకవేత్త సి. రాధాకృష్ణరావుకు 102 సంవత్సరాల వయస్సులో “గణాంకాలలో నోబెల్ బహుమతి” లభించిందని అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.ఫేస్బుక్ యూజర్ ‘జయదేబా సాహూ’ నోబెల్ బహుమతికి వయస్సుతో సంబంధం లేదని చెబుతూ ఇలా రాశారు: “102 సంవత్సరాల వయసులో, మంచి ఆరోగ్యంగా ఉన్న స్థితిలో నోబెల్ అందుకోవడం, బహుశా ఇది మొదటి ఉదాహరణ కావచ్చు.” దిగువ పోస్ట్‌ను చూడవచ్చు:
Sri C. Radhakrishna Rao, retired at the age of sixty and went to live with his daughter in America along with his…
Posted by Jayadeba Sahoo on Monday, October 13, 2025

ఇతర వినియోగదారులు కూడా ఇదే దావాను ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేసారు.
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం ఈ వాదనను పరిశీలించాలని ప్రయత్నించగా ఇది తప్పుదారి పట్టించేది అని కనుగొంది. నోబెల్ బహుమతులు ‘గణాంకాల’ విభాగంలో ఇవ్వబడవు.నోబెల్ బహుమతులు ఆరు విభాగాలలో ఇవ్వబడతాయి: భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం లేదా వైద్యం, సాహిత్యం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రాలు. సి. రాధాకృష్ణరావు 102 సంవత్సరాల వయస్సులో, 2023లో గణాంకాలలో అంతర్జాతీయ బహుమతిని అందుకున్నారు.
ఈ వాదన గురించి తెలుసుకోవడానికి మేము మొదట “సి. రాధాకృష్ణ రావు గణాంకాలలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు” అనే పదంతో వెబ్‌లో పరిశీలించగా ,”గణాంకాల రంగానికి ఆయన చేసిన గణనీయమైన కృషికి గాను, 2023 సంవత్సరానికి అంతర్జాతీయ గణాంకాల బహుమతిని ఆయన అందుకుంటారు. ఈ బహుమతిని నోబెల్ బహుమతికి సమానమైనదిగా పరిగణిస్తారు” అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 12, 2023న ప్రచురించిన ఒక నివేదికను మేము గమనించాము.
నివేదికలోని కొంత విభాగాన్ని క్రింద చూడవచ్చు-

నోబెల్ బహుమతి యొక్క వివిధ విభాగల గురించి మరింత సమాచారం చూడగా, నోబెల్ ఫౌండేషన్ ‘గణాంకాల’ విభాగంలో బహుమతిని ఇవ్వదని తెలుసుకున్నాము ;
భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం లేదా వైద్యం, సాహిత్యం, శాంతి మరియు ఆర్థిక శాస్త్రం అనే ఆరు విభాగాలకుమాత్రమే బహుమతిని అందచేస్తుంది.
అధికారిక నోబెల్ బహుమతి వెబ్సైట్లో వివిధ బహుమతి విభాగాల స్క్రీన్‌షాట్‌ను క్రింద చూడవచ్చు:

“సైన్స్, టెక్నాలజీ మరియు మానవ సంక్షేమాన్ని అభివృద్ధి చేయడానికి గణాంకాలను ఉపయోగించి ఘనమైన విజయాలు సాధించినందుకు” ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక వ్యక్తికి లేదా బృందానికి అంతర్జాతీయ గణాంకాల బహుమతిని(International Prize in Statistics) ప్రదానం చేస్తారు.ఇది 2016 లో స్థాపించబడింది.
2023 అంతర్జాతీయ గణాంకాల బహుమతిని సి. రాధాకృష్ణరావుకు ప్రదానం చేశారు, ఇది అధికారిక ‘అంతర్జాతీయ గణాంకాల బహుమతి వెబ్సైట్’లో నమోదు చేసి భద్ర పరచబడింది. దిగువ నివేదికలోని కొంత విభాగాన్ని చూడవచ్చు-

కాబట్టి ఈ వాదన తప్పుగా చూపించబడింది.
*******************************************************
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check

