బోద్‌గయా కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీహార్‌లోని బోధ్‌గయాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ భారత జాతీయ గీతాన్ని ఎలా అగౌరవపరిచారో ఈ వీడియోలో చూడవచ్చుననేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.తప్పుడు కథనాన్ని చూపించడానికి వీడియో ట్రిమ్ చేయబడింది. జాతీయ గీతం పూర్తిగా అందరు కలిసి పాడేలా (కోరస్ లో) చూసేందుకే స్వరాజ్ జోక్యం చేసుకున్నట్లు పూర్తి వీడియోలో తెలుస్తుంది.
రేటింగ్/Rating: తప్పుగా చూపించడం —
ఇటీవల పలువురు సోషల్ మీడియా వినియోగదారులు బిజెపి నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు ‘బన్సూరి స్వరాజ్’ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారని ఆరోపిస్తూ ఒక క్లిపోస్టును షేర్ చేసారు.X వినియోగదారు ‘NCMIndiaa’ బోధ్ గయాలో జరిగిన ఒక కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలతో బన్సూరి స్వరాజ్ వేదికపై ఉన్న31 సెకన్ల వీడియోతో ఈ దావాని షేర్ చేసారు.
వీడియోలో, ఆమె జాతీయ గీతం మధ్యలో ముందుకు సాగి, క్లుప్తంగా మాట్లాడడం, “జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971″లోని సెక్షన్ 3 కింద అవమానకరమైన వాదనలకు దారి తీసింది.పోస్ట్ ఈ ఘటన “శిక్షించదగినది” అంటూ పేర్కొంది, మరియు 10,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. పోస్ట్ ఇక్కడ చూడవచ్చు
BJP Leader and Member of Parliament @BansuriSwaraj at Gaya, Bihar. Such disrespect of the National Anthem is a punishable offense under section 3 of THE PREVENTION OF INSULTS TO NATIONAL HONOUR ACT, 1971pic.twitter.com/vJqyPPkxHV
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) September 17, 2025
అదేవిధంగా, మరొక X వినియోగదారు ‘ssrajputINC’ అదే దావాను హిందీలో ఇలా షేర్ చేసారు:
“राष्ट्रगान की बेइज्जती करती हुई भाजपा सांसद बांसुरी स्वराज! इन्हें देशद्रोह में जेल भेजिये मोदी जी!वरना माना जायेंगे आप देश में दो संविधान चलाते है एक आम इंसान के लिये दूसरा भाजपा वालो के लिये?”
తెలుగు అనువాదం ఇలా ఉంది:”బిజెపి ఎంపి బన్సూరి స్వరాజ్ జాతీయ గీతాన్ని అవమానించారు! ఆమెను దేశద్రోహ నేరం కింద జైలుకు పంపండి, మోడీ జీ!
లేకపోతే, మీరు దేశంలో రెండు రాజ్యాంగాలను నడుపుతున్నారని భావించవచ్చు, ఒకటి సామాన్యుల కోసం, మరొకటి బిజెపి ప్రజల కోసం?” ఈ క్రింది పోస్ట్‌ను చూడండి:
राष्ट्रगान की बेइज्जती करती हुई भाजपा सांसद बांसुरी स्वराज!
इन्हें देशद्रोह में जेल भेजिये मोदी जी!
वरना माना जायेंगे आप देश में दो संविधान चलाते है एक आम इंसान के लिये दूसरा भाजपा वालो के लिये? pic.twitter.com/NYAkwZiMnS— Surendra Rajput (@ssrajputINC) September 17, 2025
ఇతర వినియోగదారులు కూడా ఇలాంటి వాదనలనే షేర్ చేసుకున్నారు , వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వాస్తవ పరిశీలన
DigitEYE India బృందం ఈ దావాను తనిఖీ చేయాలని నిర్ణయించుకుని పరిశీలించగ, ఇది తప్పుదారి పట్టించేదిగా ఉందని కనుగొన్నారు.తప్పుడు వాదన సృష్టించడానికి అనుకూలంగా ఉన్న వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ఎంపిక చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది.జాతీయ గీతం అందరు సక్రమంగా మరియు కలిసి పాడేలా (కోరస్ లో) చూసేందుకే స్వరాజ్ జోక్యం చేసుకున్నట్లు పూర్తి వీడియో చూస్తే తెలుస్తుంది.
బృందం బీహార్‌లోని బోధ్‌గయాలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారా లేదా అని వార్తా నివేదికలని పరిశీలించగా, 2025 సెప్టెంబర్ 13న పాట్నా ప్రెస్ ప్రచురించిన ఒక నివేదికలో “బోద్‌గయాలో బీజేపీ ‘యువమోర్చా యువ శంఖనాద్‘ ర్యాలీలో జముయి ఎమ్మెల్యే మరియు మాజీ షూటర్ శ్రేయాసి సింగ్‌తో కలిసి బాన్సురి ప్రసంగిస్తారు” అని పేర్కొనటం గమనించాము.
ముందుగా మేము బీహార్‌లోని బోధ్‌గయాలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారా లేదా అని వార్తా నివేదికలని పరిశీలించగా, 2025 సెప్టెంబర్ 13న పాట్నా ప్రెస్ ప్రచురించిన ఒక నివేదికలో “బోద్‌గయాలో బీజేపీ ‘యువమోర్చా యువ శంఖనాద్‘ ర్యాలీలో జముయి ఎమ్మెల్యే మరియు మాజీ షూటర్ శ్రేయాసి సింగ్‌తో కలిసి బాన్సురి ప్రసంగిస్తారు” అని పేర్కొనటం గమనించాము. నివేదికలోని కొంత భాగాన్ని క్రింద చూడవచ్చు:
తదుపరి మేము అధికారిక ప్రతిస్పందన కోసం శోధించినప్పుడు, మాకు బన్సూరి స్వరాజ్ అధికారిక X పోస్ట్ లభించింది. 17 సెప్టెంబర్, 2025న ఆమె 1:17 సెకన్ల నిడివి గల పూర్తి వీడియోను వివరణతో విడుదల చేసారు. పోస్ట్ ఈ విధంగా ఉంది: सोशल मीडिया पर अधूरा वीडियो फैलाया जा रहा है। सच्चाई ये है कि मैंने आग्रह किया था कि राष्ट्रगान पूरा और सही ढंग से गाया जाए। यह पूरा वीडियो है जहाँ हमने गर्व और सम्मान के साथ पूरा राष्ट्रगान गाया।”
“సోషల్ మీడియాలో అసంపూర్ణ వీడియో ప్రచారం అవుతోంది, నిజం ఏమిటంటే జాతీయ గీతాన్ని పూర్తిగా మరియు సరిగ్గా ఆలపించాలని నేను పట్టుబట్టాను.మేము గౌరవంగా పూర్తి జాతీయ గీతాన్ని పాడిన పూర్తి వీడియో ఇది.
ఆమె అధికారిక పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు:
सोशल मीडिया पर अधूरा वीडियो फैलाया जा रहा है। सच्चाई ये है कि मैंने आग्रह किया था कि राष्ट्रगान पूरा और सही ढंग से गाया जाए। यह पूरा वीडियो है जहाँ हमने गर्व और सम्मान के साथ पूरा राष्ट्रगान गाया। 🇮🇳@BJP4India @BJP4Delhi pic.twitter.com/SQ7nmFuwW4
— Bansuri Swaraj (@BansuriSwaraj) September 17, 2025
స్వరాజ్ స్వయంగా పోస్ట్ చేసిన పూర్తి వీడియోలో, కోరస్ లేదా సమన్వయము లోపించటం చూసిన ఆమె“దయచేసి గౌరవప్రదంగా జాతీయ గీతాన్ని పూర్తిగా మరియు సరిగ్గా కలిసి పాడండి” అని ఆమె చెప్పడం చూడవచ్చు.ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆమె అందరితో కలిసి పాడారు.
స్వరాజ్ మైక్రోఫోన్‌ని సమీపించే సమయంలోని వీడియో క్లిప్‌ని ఆకస్మికంగా ముగిస్తూ ఆమె జాతీయ గీతాన్ని గౌరవించడం లేదని వాదన చేయబడింది.కానీ జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడ్డు కోరస్ మరియు సమన్వయం లోపంచిందని స్వరాజ్ గమనించినట్లు పూర్తి క్లిప్ వెల్లడించింది.మైక్‌లో ఆమె అభ్యర్థన తర్వాత, బృందం జాతీయ గీతాన్ని పునఃప్రారంభించి సమన్వయంతో పాడి పూర్తి చేసారు.
కాబట్టి ఈ వాదనలో, తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు::
ట్రంప్ ఆరోగ్యం విషమంగా ఉందా, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారా? వాస్తవ పరిశీలన