ఇప్పటి నుండి ప్రతి నెల అన్ని ఆదివారాలు మరియు శనివారాలు బ్యాంకులు మూసివేయబడతాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: నెలలో అన్ని శని,ఆదివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి, అవి వారానికి 5 రోజులు తెరిచి ఉంటాయనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.ఈ వాదన/దావాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారిక ప్రకటనలు చేయలేదు మరియు గతంలో కూడా ఇటువంటి నకిలీ వాదనలు వెలువడ్డాయి. 

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

***************************************************************************

సెప్టెంబరు 14, 2025న ‘Zee24Ghanta’అనే వినియోగదారుడు, ‘బ్యాంకులు ఇప్పుడు వారంలో ఐదు రోజుల పనిచేస్తాయని’ X లో బెంగాలీ శీర్షికతో పోస్ట్ చేసారు.

పోస్ట్ ఇక్కడ చూడవచ్చు: অবিশ্বাস্য! এবার থেকে ব্যাংক খোলা থাকবে সপ্তাহে ৫ দিন, দু’দিন ছুটি? জেনে নিন, উইক অফ নিয়ে আরবিআই রুল কী বলছে?

తెలుగు అనువాదం ఇలా ఉంది:

నమ్మశక్యంగా లేదు! ఇక నుంచి బ్యాంకులు వారానికి 5 రోజులు పనిచేస్తాయా, రెండు రోజులు సెలవులా ? వారపు సెలవు గురించి RBI నియమం ఏమి చెబుతుందో తెలుసుకోండి?

ఇది Zee News బెంగాలీ కధనాన్ని జత చేస్తూ, మరియు సందేశాన్ని విస్తరించడానికి #RBINewHolidayRule మరియు #banksremainclosedoneverySaturdaySunday వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించింది. దిగువ పోస్ట్‌ను చూడవచ్చు:

వారానికి ఐదు రోజుల పని కల్పించాలని బ్యాంకు ఉద్యోగులు ఎంత కాలంగా డిమాండ్ చేస్తున్నారో పోస్ట్‌లో లింక్ చేసిన కథనం పేర్కొంది.ఈ సమస్యపై ప్రభుత్వం అటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు మరొక నివేదిక పేర్కొంది. అయితే, కథనంలో ఎటువంటి విశ్వసనీయ వర్గాలు గురించి పేర్కొనబడలేదు, పూర్తిగా ఊహాగానాలపై ఆధారపడినవి.

వాస్తవ పరిశీలన

DigitEYE India బృందం ఈ దావాను పరిశోధించాలని నిర్ణయించుకుని పరిశీలించగా, ఇది తప్పుదారి పట్టించేదని కనుగొన్నారు. జత పరిచిన ఆర్టికల్ లింక్‌లో బలమైన ఆధారాలు లేదా ఈ విషయంపై RBI ద్వారా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు.

మేము మొదట Zee24 ఘంటా పోస్ట్‌లో జోడించిన కథనాన్ని ఇక్కడ పరిశీలించగా, RBI ధ్రువపరిచిన పత్రాలు, కోట్‌లు లేదా తేదీలను ఇవ్వకుండా “ఉద్యోగుల డిమాండ్‌లను చర్చించడానికి” లేదా “ప్రభుత్వం అటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి”వంటి పుకార్లతో కథనం వ్రాయబడింది.

కథనంలో కొంత భాగం కింద చూడవచ్చు:- అందులో “ప్రతినెలా రెండో, నాలుగో శనివారం బ్యాంకులు మూసివేయబడతాయని ఆర్‌బీఐ నిబంధన చెబుతోంది. ఇది చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రతి శనివారం బ్యాంకులు మూతపడతాయని వినికిడి” అని పేర్కొన్నారు.

మేము సెలవుల గురించి తెలుసుకోవడానికి RBI క్యాలెండర్‌ని పరిశీలించగా, అధికారిక RBI వెబ్‌సైట్‌లోని 2025 సెలవుల మ్యాట్రిక్స్ ప్రకారం అన్ని ఆదివారాలు మరియు నెలవారీ రెండవ/నాల్గవ శనివారాలు మాత్రమే బ్యాంకులు మూసివేయాలి అనే ఆదేశాలలు ఉన్నట్టు తెలుసుకున్నాము. RBI యొక్క 2015 పత్రికా ప్రకటనలో ఇది ఎటువంటి సవరణలు లేకుండా స్పష్టంగా పేర్కొనబడింది, వీటిని ఇక్కడ చూడవచ్చు.

బ్యాంకు సెలవుల గురించి మరింత పరిశీలించగా, మాకు తగిన ఫలితాలు లభించలేదు. కానీ, 2025 మార్చి 20న ప్రచురించబడిన ఎకనామిక్ టైమ్స్ కధనం “బ్యాంకులు ఇప్పుడు వారంలో ఐదు రోజుల పనిచేస్తాయని” అనే వాదన/ పుకార్లను తప్పుగా నిరూపించింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకినింగ్ యూనిట్ కూడా దీనిని పుకారుగా పేర్కొంది. పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.

ఇవి చాలా కాలంగా ఈ అంశంపై పుకార్లు మరియు ఊహాగానాలు మాత్రమే కానీ బ్యాంకు సమయాలను మరియు ఇతర ప్రక్రియలను నియంత్రించే సెంట్రల్ బ్యాంక్, RBI ద్వారా ఈ నిర్ణయం ఎప్పుడు అమలు చేయబడలేదు. ఇటువంటి వాదనలు తరచుగా చేయబడుతున్నాయి. మార్చి, ఏప్రిల్, 2025లో అవి కనిపించగా, మళ్ళి ఇప్పుడు సెప్టెంబరు, 2025లో కూడా ఇటువంటి వాదనలు కనిపిస్తున్నాయి.

అందువల్ల, ఈ దావా తప్పుదారి పట్టించేదిగా ఉంది.

******************************************************************

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడిందా? వాస్తవ పరిశీలన

అమెరికా సుంకాలు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.