‘కల్వకుంట్ల కవిత’ సస్పెన్షన్‌పై సంబరాలు చేసుకుంటూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ‘కల్వకుంట్ల కవిత’ సస్పెన్షన్‌పై సంబరాలు చేసుకుంటూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు, మార్చి 2021న MLC ఎన్నికల్లో BRS సభ్యురాలి విజయాన్ని పురస్కరించుకుని ఫైర్ క్రాకర్స్ కాల్చడం వల్ల మంటలు సంభవించిన సంఘటన.
రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం–
****************************************************************************
‘కల్వకుంట్ల కవిత’ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు సంబరాలు జరుపుకుంటున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు నిప్పుపెట్టారని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు. ఒక X వినియోగదారుడు 2వ సెప్టెంబర్ 2025న వీడియో ఫుటేజ్‌తో కూడిన అటువంటి దావాను షేర్ చేసారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంటలు, పొగలు వెలువడుతున్న వీడియోను పోస్ట్ చేసారు. దిగువ చూడవచ్చు.-
BRS karyakartas set fire to #Telangana Bhavan celebrating Kalvakuntla Kavitha’s suspension from the party.#BRS #Kavitha #Hyderabad
— Bollaboina Manish yadav (@Manish765_INC) September 2, 2025
మరో X వినియోగదారుడు అదే వీడియో ఫుటేజీను తెలుగు క్యాప్షన్‌తో ఇలా షేర్ చేసారు:”కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంబరంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు నిప్పంటించారు.” పోస్ట్‌ను ఇక్కడ చూడండి.
*కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంబరంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు నిప్పంటించారు😂 pic.twitter.com/paSNJFiRp7
— Chaitanya Rao (@chaitanyarao50) September 2, 2025
FACT CHECK
DigitEYE India బృందం ఈ వాదనను పరిశీలించగా సస్పెన్షన్ వాదనలు వాస్తవమైనవని కనుగొన్నారు కాని, వీడియో నుండి వివిధ కీఫ్రేమ్‌లు తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 20 మార్చి 2021న జరిగిన వాస్తవ సంఘటనను ‘సియాసత్ డైలీ’ వాళ్ళు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోని మేము గమనించాము.
‘సియాసత్ డైలీ’దినపత్రిక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సభ్యురాలి విజయాన్ని పురస్కరించుకుని టపాకాయలు కాల్చడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని నివేదించింది. ఇతర వినియోగదారులు మరియు వార్తా సంస్థలు 20 మార్చి 2021న వీడియో ఫుటేజీని షేర్ చేసారు, వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ ఫలితాలను అనుసరించి, మేము “తెలంగాణ భవన్లో అగ్ని ప్రమాదం” అనే కీ వర్డ్ తో శోధన నిర్వహించగా, ప్రమాదాన్ని నిర్ధారిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా 2021 మార్చి 20న ప్రచురించిన నివేదికను కనుగొన్నము.
అందులో అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని ఇలా వివరించింది. “మహబూబ్‌నగర్-రంగారెడ్డి ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో గెలుపొందిన సురభి వాణీ దేవి విజయాన్ని పురస్కరించుకుని శనివారం పార్టీ క్యాడర్ క్రాకర్స్ పేల్చడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగింది.”
నివేదిక నుండి స్నిప్పెట్‌ను దిగువ చూడవచ్చు –
సెప్టెంబరు 2025లో తెలంగాణ భవన్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల వార్తల కోసం వెతకగా, ఎలాంటి ఫలితాలు లేదా అలాంటి సంఘటన నివేదికలు లభించలేదు. అందువల్ల, ఈ దావాలో తప్పుగా చూపించే ప్రయత్నం జరిగింది.
**********************************************************************************
Read More :
Has India revoked ban on Tiktok Amid US tariffs, PM Modi’s China visit? Fact Check