అమెరికా సుంకాలు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అమెరికా సుంకాలు, ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ ఉపసంహరించుకున్నదనేది వాదన/దావా.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. టిక్‌టాక్ ఇప్పటికీ భారతదేశంలో నిషేధించబడింది,  మరియు అప్స్/Appsపై నిషేధం ఉపసంహరించబడడం గురించి అధికారిక ప్రకటనలు లేవు.

రేటింగ్/Rating: తప్పుడు వాదన — Five rating

*****************************************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

ఇటీవల, చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో, దాదాపు ఐదేళ్ల తర్వాత భారతదేశంలో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయబడిందని పేర్కొన్నారు. జాతీయ భద్రత మరియు డేటా/సమాచారం గోప్యతా విషయంలో మరియు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య భారత ప్రభుత్వం జూన్ 2020లో ఈ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించింది.

X వినియోగదారుడు ‘FroIndiaToWorld’ దీని గురించి 22 ఆగస్టు 2025న పోస్ట్ చేసారు: “TikTok  ఐదు సంవత్సరాల నిషేధం తర్వాత మళ్లీ భారతదేశంలోకి తిరిగి వచ్చింది. ఇది వాస్తవానికి చైనాకు మాత్రమే విజయం. ఇది మళ్లీ జరగడం బాధాకరం. దిగువ పోస్ట్‌ను చూడవచ్చు –

మరొక  X  వినియోగదారుడు ‘chauhantwts’ వారి పోస్ట్‌లో “TikTok తిరిగి భారత్‌లోకి వచ్చింది. AliExpress భారతదేశంలోకి తిరిగి వచ్చింది. చైనాతో అన్ని ఎగుమతి-దిగుమతికి సంబంధించిన నిషేధాలు ఎత్తివేయబడ్డాయి. మన జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతున్నందున ఈ ‘అప్స్’పై నిషేధాలన్నీ విధించబడ్డాయి కదా?”

పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు .

ఇతర వినియోగదారులు కూడా అటువంటి వాదనలను/దావాలను (ఇక్కడ) మరియు (ఇక్కడ) పోస్ట్ చేసారు.

వాస్తవ పరిశీలన

DigitEYE India బృందం ఈ దావాను పరిశోధించాలని నిర్ణయించుకుని పరిశీలించగా, ఈ వాదనలు తప్పు అని కనుగొన్నారు. టిక్‌టాక్ వెబ్‌సైట్ భారతదేశంలో అందుబాటులో ఉన్నప్పటికీ, అధికారిక యాప్ ఇప్పటికీ నిషేధించబడింది మరియు వినియోగదారులు దానిని ఉపయోగించలేరు.

జూన్ 2020లో, ఘోరమైన గాల్వాన్ వ్యాలీ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు హతమైన సంఘటన తరువాత IT చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ ‘అప్స్’లను భారతదేశం నిషేధించింది.ఈ చర్య గూఢచర్యం కోసం వినియోగదారుడి డేటాను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించబడిన ‘అప్’లను లక్ష్యంగా చేసుకుంది, అయితే ఈ ‘అప్’ల జాబితా 200 వరకు విస్తరించింది.

అయితే, TOI నివేదిక ప్రకారం, భారత ప్రభుత్వం 2025 ఆగస్టు 23న వాదనలను శీఘ్రముగా తిరస్కరించింది, “భారత ప్రభుత్వం TikTok కోసం ఎటువంటి అన్‌బ్లాకింగ్/ఉపసంహరణ ఉత్తర్వును జారీ చేయలేదని,మరియు అటువంటి ప్రకటన లేదా వార్త ఏదైనా తప్పు మరియు తప్పుదారి పట్టించేదని స్పష్టం చేసింది.” దిగువ నివేదిక నుండి స్నిప్పెట్‌ను ఇక్కడ చూడవచ్చు:

23 ఆగస్టు 2025న ANI కూడా తన కథనంలో అధికారిక ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ట్వీట్ చేసింది. దిగువ ట్వీట్‌ను చూడవచ్చు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన నివేదికలో,”[టిక్‌టాక్ ప్రతినిధి ఒక ఇమెయిల్ ప్రకటనను’టెక్ క్రంచ్‌’సంస్థకు నివేదించిందని, అందులో: మేము భారతదేశంలో టిక్‌టాక్‌కి యాక్సెస్‌ను పునరుద్ధరించలేదు మరియు భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నామని” పేర్కొన్నారని,
అంతేగాక, టిక్‌టాక్‌కు సంబంధించి ప్రభుత్వం “అన్‌బ్లాక్ లేదా మరే చర్య చేపట్టలేదని” ఐటి చట్టం నిబంధనల ప్రకారం నిషేధం కొనసాగుతుందని ఐటి మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ధృవీకరించారు]” అని నివేదించింది.

దిగువ, నివేదిక నుండి స్నిప్పెట్‌ను  చూడవచ్చు:

భారతదేశంలో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేయబడలేదు. అధికారిక ప్రభుత్వ వర్గాలు మరియు ప్రకటనలు అప్/App ఇప్పటికీ నిషేధించబడిందని ధృవీకరిస్తున్నాయి.
కాబట్టి, ఈ వాదన తప్పు.

***************************************************************************

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు: :

నోబెల్ కమిటీ సభ్యుడు ‘అస్లే టోజే’ శాంతి బహుమతి కోసం భారత ప్రధాని మోడీని సమర్ధించారా? వాస్తవ పరిశీలన

‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి ఇటలీ వైదొలిగిందా? వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.