ట్రంప్ ఆరోగ్యం విషమంగా ఉందా, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని ఆయన వైద్య బృందం వెల్లడించారనేది దావా/వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు దావా/వాదన. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది మరియు ఆయనే స్వయంగా విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేశారు.
రేటింగ్/Rating: పూర్తిగా తప్పు —
****************************************************************************
ఆగస్ట్ చివరి వారం మరియు సెప్టెంబర్ నెల 2025న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మరియు ఆయన కోమాలోకి వెళ్లారని చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.అలాగే ఆసుపత్రిలోని ఐ.సియు గదిలో బెడ్ మీద ట్రంప్ ఉన్నారంటూ చిత్రాలను కూడా షేర్ చేసారు.
ఒక X వినియోగదారు, “ట్రంప్ మరణ వార్త వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ఇది #ట్రంప్ యొక్క ప్రస్తుత ICU గది యొక్క మొదటి CCTV చిత్రాల ఫుటేజ్” అని పేర్కొంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. పోస్ట్ ఇక్కడ చూడవచ్చు:
🇺🇲🔥 First CCTV images footage of #Trump‘s current ICU room amid spreading news of his death. pic.twitter.com/Z3nCsUTXsi
— African Resistance (@Africarevolt) August 30, 2025
మరొక సోషల్ మీడియా వినియోగదారుడు ఇదే వాదన/దావాను పోస్ట్ చేయగా, దీనికి 80,000 కంటే ఎక్కువ వీక్షణలు వచ్చాయి. క్యాప్షన్ ఇలా ఉంది: “బ్రేకింగ్ న్యూస్: అధ్యక్షుడు ట్రంప్ వైద్య బృందం అతని పరిస్థితి విషమంగా ఉందని మరియు ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నారని తెలిపారు.” దిగువ పోస్ట్‌ను చూడవచ్చు:
Breaking news:
President Trump’s medical team says he is in critical condition and is now in a coma. pic.twitter.com/gnJIkP8OAL— Middle East Spectator (@Middle_East_S) August 30, 2025
మరికొందరు ఫేస్బుక్లో కూడా ఇలాంటి దావా/వాదనలనే షేర్ చేసారు.ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
వాస్తవ పరిశీలన
వాదన యొక్క ప్రామాణికత/వాస్తవికతను తెలుసుకోవడానికి DigitEYE India బృందం నిర్ణయించుకుని, Googleలో పరిశీలించగా, అది తప్పుడు దావా/వాదనగా కనుకగొన్నరు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా మరియు యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన తాను ఆరోగ్యంగానే ఉన్నానని పత్రికలకు స్వయంగా స్పష్టం చేశారు, మరియు చిత్రాలు/ వాదనలు నకిలీవని అభివర్ణించారు.
ట్రంప్ సెప్టెంబర్ 2, 2025న విలేకరుల సమావేశా ఏర్పాటులో, తాను ఇంటర్వ్యూలు నిర్వహించానని, గోల్ఫ్ ఆడానని, ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశానని, తన మరణం లేదా కోమా పుకార్లను నేరుగా ఖండిస్తూ పేర్కొన్నారు. ఆయన ఈ పుకార్లన్నింటినీ “ఫేక్” అని కొట్టిపారేశారు, మరియు వారాంతంలో తాను “చాలా ఆక్టివ్ గా” ఉన్నానని ధృవీకరించారు.
‘ది వైట్ హౌస్’ ద్వారా అప్-లోడ్ చేయబడిన క్రింద వీడియోలో– టైమ్‌స్టాంప్ 14.50 వద్ద, ప్రెస్ నుండి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యం మరియు వారాంతంలో ఆయన చేసిన వివిధ కార్యకలాపాల గురించి వివరించడం చూడవచ్చు.
President Trump dismissed recent rumors about his health, attributing them to media speculation, and noted that he held an extended press conference to address the issue.#NYI pic.twitter.com/NlPEfRUO1o
— NewYork-i (@Newyork__i) September 6, 2025
ఈ సంఘటన గురించి రాయిటర్స్ తన నివేదికలో “అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సోషల్ మీడియాలో తాను అనారోగ్యంతో ఉన్నానంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు” అని పేర్కొంది. దిగువ నివేదిక యొక్క స్నిప్పెట్‌ను చూడవచ్చు:
CNN యొక్క మరొక నివేదికలో “ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు”అని ట్రంప్ యొక్క ప్రెస్ సెక్రటరీ, కరోలిన్ లీవిట్ చేసిన ప్రకటనను ప్రచురించింది. దిగువ నివేదిక యొక్క స్నిప్పెట్‌ను చూడవచ్చ:
ఇతర మీడియా సంస్థలు కూడా ఈ దావా తప్పని నిరూపించాయి. ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అందువలన, ఈ దావా తప్పు.
******************************************************************************
Read More :
Has India revoked ban on Tiktok Amid US tariffs, PM Modi’s China visit? Fact Check