ఒక వ్యక్తి ‘బొటనవేలును పైకి చూపుతున్న’గుర్తు 1 రూపాయి నాణెంపైన ముద్రించబడిందా? వాస్తవ పరిశీలన

సోషల్ మీడియాలో థంబ్స్ అప్ డిజైన్‌తో కూడిన భారతీయ 1 రూపాయి నాణెం చిత్రంతో ఉన్న ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. “భారతీయ 1 రూపాయి నాణెంపై ఒక వ్యక్తి థంబ్స్ ఇస్తు కనిపిస్తున్నాడు.”అనే వాదనతో చిత్రం షేర్ చేయబడుతోంది.

ఫేస్‌బుక్‌లో మరో వాదన ఇలా ఉంది: ఇతర దేశాలు ముఖ్యమైన వ్యక్తులు మరియు స్మారక చిహ్నాలు ఉపయోగిస్తారు కానీ భారతదేశం డిజైన్లను ఉపయోగిస్తుంది.

వాస్తవ పరిశీలన

మా వాట్సాప్ లో వాస్తవ పరిశీలన అభ్యర్ధనను అందుకున్నప్పుడు,మొదట మేము వాదనను మరియు RBI పేజీలో నాణెం యొక్క ప్రామాణికత పరిశీలించగా,ఆ నాణెం 2007 లో జారీ చేయబడిందని కనుగొన్నము.

భారతీయ శాస్త్రీయ నృత్యం అయిన భరతనాట్యంలోని హస్త ముద్ర భంగిమలను,నాణేలపై చూపించే ప్రయత్నం జరిగింది.

క్రింద చూపిన విధంగా, ఒక రూపాయి నాణెం మాత్రమే కాకుండా, RBI 2007 నుండి 2011 వరకు హస్త ముద్ర సిరీస్‌లో భాగంగా 2 రూపాయల నాణెం మరియు 50 పైసల నాణెంను విడుదల చేసింది.

థంబ్స్ అప్ గుర్తుతో పాటు, మిగిలిన రెండు గుర్తులు కూడా నృత్యం సమయంలో ఇతర కీలకమైన ముద్రలను లేదా భంగిమలను సూచిస్తాయి.
నిజానికి, 2007 నుండి 2011 వరకు 1 రూపాయి నాణేలపై ఉపయోగించిన థంబ్స్ అప్ డిజైన్ సంప్రదాయ/సాధారణ డిజైన్, అది ప్రత్యేక ఎడిషన్ కాదు.

కాబట్టి, ఈ వాదన తప్పు.

వాదన/Claim:భారతీయ 1 రూపాయి నాణెం మీద ఒక వ్యక్తి థంబ్స్ అప్ (బొటనవేలు పైకి ఎత్తి చూపటం) గుర్తుతో చూపిస్తున్న చిత్రం ఉందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.రూపాయి నాణెం,2007 నుండి 2011 వరకు RBI జారీ చేసిన హస్త ముద్ర సిరీస్‌లో భాగం, మరియు అస్పష్టమైన డిజైన్ కాదు.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.