‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి ఇటలీ వైదొలిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి ఇటలీ వైదొలగిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఇటలీ ‘పారిస్ ఒప్పందం’ నుండి వైదొలిగిందనడానికి విశ్వసనీయమైన సమాచారం ఏది లేదు.ఇటలీ  ఇప్పటికీ అందులో భాగమే.

రేటింగ్/Rating: తప్పుడు వాదన- Five rating

**********************************************************

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడండి

లేదా వాస్తవ పరిశీలన కధనం చదవండి
******************************************************

2015లో సంతకం చేయబడిన ప్రపంచ వాతావరణ మార్పు కోసం అయిన ఒప్పందం ‘పారిస్ ఒప్పందం’లో ఇటలీ ఇకపై భాగం కాదని పేర్కొంటూ సోషల్ మీడియాలో వివిధ పోస్టులు వెలువడ్డాయి. జూలై 9, 2025న చాలా మంది X వినియోగదారులు సోషల్ మీడియాలో ఈ దావా చేసారు.

ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోన్ ఫోటోను పోస్ట్ చేస్తూ, “అమెరికా సంయుక్త రాష్ట్రాల తర్వాత, ఇటలీ ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి వైదొలగుతోంది” అనే శీర్షికతో పోస్ట్ చేయబడింది. ఈ పోస్ట్ దాదాపు 3,380 వీక్షణలను(Views) పొందింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక వినియోగదారుడు,“బ్రేకింగ్ న్యూస్. అమెరికాని అనుసరిస్తూ ఇటలీ ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి వైదొలగనుంది”, అంటూ ఇలాంటి వాదననే షేర్ చేశారు. పోస్ట్ లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Ryan Robbins (@ryandrobbins)

వాస్తవ పరిశీలన

డిసెంబర్ 12, 2015న UN వాతావరణ మార్పు సమావేశం (COP21) సమయంలో ఆమోదించబడిన పారిస్ ఒప్పందం, గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, దానిని 1.5°Cకి పరిమితం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

పారిస్ ఒప్పందంలో ఇటలీ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి విశ్వసనీయ వార్తల నివేదికలు మరియు అధికారిక ప్రకటనలను తెలుసుకోడానికి DigitEYE బృందం వెబ్‌లో పరిశీలించగా, యూరోన్యూస్‌ వార్తా సంస్థ ద్వారా ఇటలీ ఇప్పటికీ కూడా ‘పారిస్ వాతావరణ ఒప్పందం’లో భాగమని నిర్ధారించే వార్తాను మేము గమనించాము.

యూరోన్యూస్ నివేదిక లింక్‌ను ఇక్కడ చూడండి.

(గమనిక: నిబంధనలను ఉల్లంఘించినందుకు పైన పేర్కొన్న ఖాతా జూలై 18, 2025న నిలిపివేయబడింది.)

పారిస్ ఒప్పందంపై ఇటలీ ప్రస్తుత సభ్యత్వం మరియు ధృవీకరణ స్థితిని నిర్ధారించడానికి మేము అధికారిక ఐక్యరాజ్యసమితి ఒప్పంద సేకరణ పోర్టల్‌ను మరింత పరిశీలన చేయగా ఉపసంహరణకు సంబంధించిన రికార్డులు ఏవి లేవని కనుగొన్నాము.ఐక్యరాజ్యసమితి ఒప్పంద సేకరణ వెబ్‌సైట్ లింక్‌ను ఇక్కడ చూడండి.

ఇటలీ సంతకం తేదీ 22 ఏప్రిల్ 2016 మరియు ధృవీకరణ తేదీ 11 నవంబర్ 2016 అని నిరూపించే ఇటీవలి నవీకరణలు కింద టేబుల్ లో చూడవచ్చు.

సిగ్నేచర్“, ‘పారిస్ ఒప్పందం’పై వివిధ దేశాలు చేసిన ఒప్పందం మరియు దాని లక్ష్యాలకు వారి నిబద్ధతను సూచిస్తుంది, వీటిలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం మరియు వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా ఉండటం వంటివి ఉన్నాయి.

పారిస్ ఒప్పందంలోని ఆర్టికల్ XXVII-7-d లోనిరాటిఫికేషన్అనేది ఒప్పందం యొక్క నిబంధనలకు కట్టుబడి ఉండటానికి ఒక దేశం తన సమ్మతిని వ్యక్తపరచడానికి చేసే అధికారిక చట్టపరమైన చర్యను సూచిస్తుంది.

 

ఒప్పంద సూచన XXVII-7-d (పారిస్ ఒప్పందం) ను పరిశీలించినప్పుడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాత్రమే ఒప్పందం నుండి ఉపసంహరణకు దరఖాస్తు చేసింది (ఇక్కడ చూడవచ్చు)ఇటలీ ఒప్పందం నుండి వైదొలిగిన ప్రస్తావన ఎక్కడా లేదు. క్రింద ఉన్న చిత్రంలో గమనించవచ్చు.

2025 లో అమెరికా ఉపసంహరణకు దారితీసిన అన్ని చర్యలకు సంబంధించిన చిత్రం క్రింద చూడవచ్చు.

అదనంగా, భారతదేశం తన సంతకం తేదీని ఏప్రిల్ 22, 2016న మరియు ధృవీకరణ తేదీని అక్టోబర్ 2, 2016న చేసిన సందర్భాలను  క్రింద చూడవచ్చు.

ఇటలీ యొక్క ఏ అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూపారిస్ ఒప్పందం నుండి వైదొలగుతున్నట్లు ప్రకటించిన అధికారిక రికార్డులు లేదా ప్రకటనలు లేవు. ఇటలీ సంతకందారుగా(సిగ్నటోరీ) మరియు ప్రస్తుత భాగస్వామిగా కొనసాగుతోంది, అధికారికంగా ఉపసంహరించుకునే సూచనలు ఏవి లేవు.

కాబట్టి, ఈ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం 3 రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ చేతిలో కోల్పోయిందని జైశంకర్ ఒప్పుకున్నారా? వాస్తవ పరిశీలన

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించుకుందా? వాస్తవ పరిశీలన

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.