జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలు రోడ్డు టోల్ ఛార్జీలు చెల్లించాలా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: జూలై 15, 2025 నుండి, భారతదేశంలో ద్విచక్ర వాహనాలు ఇకపై హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్-ఫ్రీ రైడ్ చేయబడవనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. భారత జాతీయ రహదారి అథారిటీ ఈ దావాను ఖండించింది మరియు ఇది ఫేక్ న్యూస్ అని పేర్కొంది. రవాణా మంత్రి కూడా X ప్లాట్‌ఫారమ్‌లో దీనిని తిరస్కరిస్తూ ప్రకటన విడుదల చేశారు.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన –

**************************************************************

See the complete Fact check details in video

Or Read the Fact Check

****************************************************************

మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్‌ల కోసం ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ సిస్టమ్ ఈ ఏడాది జూలై మధ్యలో ప్రారంభమవుతుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ వాదనలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన:

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మరియు NHAI యొక్క అధికారిక వెబ్‌సైట్‌లను, వాదనలోని ప్రామాణికత కోసం పరిశీలించినప్పుడు, ద్విచక్ర వాహనాలకు సంబంధించిన టోల్ ఛార్జీలపై ఎలాంటి గమనిక కానీ ప్రస్తావన కానీ లేదు.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అటువంటి వాదనలను తోసిపుచ్చుతూ, దిగువ చూపిన విధంగా ఆయన హిందీలో వివరణను X.comలో పోస్ట్ చేసినట్లు తదుపరి పరిశీలనలో వెల్లడైంది.

పై హిందీ పోస్ట్ యొక్క తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది: “ముఖ్యమైనది: ద్విచక్ర వాహనాలపై టోల్ ట్యాక్స్ విధించడంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి.అలాంటి నిర్ణయమేదీ ప్రతిపాదించబడలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్‌పై మినహాయింపు యధావిధిగా కొనసాగుతుంది. సంచలనం సృష్టించేందుకు వాస్తవాన్ని తెలుసుకోకుండా తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచారం చేయడం, నిజమైన పత్రికా రంగం లక్షణం కాదు. నేను దీనిని ఖండిస్తున్నాను.”

ఇక్కడ చూపిన విధంగా NHAI  కుడా స్ఫష్టం చేసింది:

NHAI అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ధృవీకరించింది మరియు వినియోగదారులు అటువంటి వైరల్ వాదనలను విశ్వసించే ముందు అధికారిక వర్గాలతో ధృవీకరించుకోవలసిందిగా ఒక సూచనను జారీ చేసింది.

PIB ఫాక్ట్ చెక్ యూనిట్(PIB fact Check unit) కూడా ఈ వాదన ఫేక్ అని పేర్కొంది.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

భారతదేశం టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి నుండి GPS ఆధారిత టోల్ చెల్లింపుకు మారబోతోందా?వాస్తవ పరిశీలన

క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమా? వాస్తవ పరిశీలన

 

1 thought on “జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలు రోడ్డు టోల్ ఛార్జీలు చెల్లించాలా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.