మోడీ ప్రభుత్వం వ్యవసాయ నీటి వినియోగంపై పన్ను విధించాలని యోచిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మోడీ ప్రభుత్వం వ్యవసాయ నీటి వినియోగంపై పన్ను విధించాలని యోచిస్తున్నదనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.కేంద్ర జలశక్తి మంత్రి ఆ వాదనను పూర్తిగా ఖండిస్తూ, వ్యవసాయ నీటి వినియోగ విషయం రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోకి వస్తుందని మరియు రాష్ట్ర జాబితా కిందకు వస్తుందని స్పష్టం చేసారు.

రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన–

*********************************************************

వ్యవసాయ అవసరాల కోసం నీటి వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించాలనే ఆలోచనలో ఉందని ఒక వాదన సోషల్ మీడియాలో
విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

వాదన ఈ విధంగా ఉంది: “మోడీ ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ నీటిపై పన్ను విధించాలని యోచిస్తోంది. వారు ఇప్పటికే వ్యవసాయ చట్టాలతో(black farm laws) రైతులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు మరి ఇప్పుడు వారి పారిశ్రామిక స్నేహితుల ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు వారి నుండి డబ్బులు దండుకుంటున్నారు.”  వాదనకు మద్దతుగా ఈ పోస్ట్‌లో విజువల్స్/దృశ్యాలు కూడా ఉన్నాయి.

క్రింద చూపిన విధంగా మరొక నివేదిక కూడా ఇదే విషయాన్ని పేర్కొంది:

వాస్తవ పరిశీలన

వాస్తవాన్ని తెలియజేయమని వాట్సాప్ లో అభ్యర్థన రాగ, Digiteye India బృందం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆ వాదనకు మద్దతిస్తున్న ప్రామాణికమైన ఆధారము కోసం పరిశీలించగా, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కనుగొన్నారు. ఈ వార్తా పై మరింత సమాచారం కోసం వెతకగా, ఒక ప్రధాన వార్తాపత్రికలో తప్పుదారి పట్టించే విధంగా ఉన్న శీర్షిక, సోషల్ మీడియాలో ఈ వాదనను షేర్ చేయడానికి దారితీసిందని తేలింది.

వాస్తవానికి, ఆ కథనం కోసం గూగుల్ వార్తా పేజీలో శోధించగా, అది కేంద్ర జల వనరుల మంత్రి (జల్ శక్తి) సి.ఆర్ పాటిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వార్తకు దారితీసింది, అక్కడ ఆయన ఈ పుకారును పూర్తిగా ఖండించారు.

రైతులకు సరఫరా చేసే నీటిపై పన్ను విధించే ప్రణాళికలు కేంద్రానికి ఉన్నాయా అని ఒక విలేకరి అడిగినప్పుడు, మంత్రిపుకార్లను పూర్తిగా ఖండిస్తూ, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోకి వస్తుందని మరియు ఇది రాష్ట్రానికి సంభందించిన విషయం అని మీడియాకు చెప్పారు. (రాష్ట్ర జాబితా (జాబితా II) భారత రాజ్యాంగంలోని 17వ ఎంట్రీ).
క్రింద చూపిన విధంగా PIB కూడా ఆ దావాను పరిశీలించి, ఇది తప్పుడు వాదనని నిర్ధారించింది.

వార్షిక భూగర్భ జలాల వెలికితీత(Annual Groundwater Extraction) నివేదిక ప్రకారం, మొత్తం 239.16 బిలియన్ క్యూబిక్ మీటర్ల (BCM) నీటిలో వ్యవసాయ రంగం 87% వాటాను కలిగి ఉంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో విచక్షణారహితంగా తవ్వి భూగర్భ జలాలు వెలికితీయడం వల్ల అవి వేగంగా క్షీణించాయని పేర్కొంది. అయితే, వ్యవసాయ నీటి వినియోగంపై కేంద్రం పన్ను విధించాలని యోచిస్తోందనే వాదన అవాస్తవం మరియు తప్పుడు వాదన.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలు రోడ్డు టోల్ ఛార్జీలు చెల్లించాలా? వాస్తవ పరిశీలన

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం171 కూలిపోయిన కొన్ని గంటల తర్వాత, విమానం లోపలి దృశ్యాలు కలిగి ఉన్న వీడియో వైరల్ అవుతోంది.వాస్తవ పరిశీలన

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.