బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:హిందూ దుకాణా యజమానుల కాషాయ రంగు సైన్ బోర్డులను కర్ణాటక ప్రభుత్వం తొలగిస్తోందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. BBMP ఫిబ్రవరి 28, 2024 గడువుతో బెంగళూరులో 60% కన్నడ సైన్‌బోర్డ్‌ల నియమాన్ని అమలు చేసింది, తర్వాత దీన్ని రెండు వారాలు పొడిగించారు.

రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం–

వాస్తవ పరిశీలన వివిరాలు

“కర్ణాటకలో మీ దుకాణానికి,ఇంటికి, “కర్ణాటకలో మీ దుకాణానికి,ఇంటికి, పరిసర ప్రాంతాలకి, దేవాలయానికి కాషాయ రంగు ఉపయోగించరాదు” అని హిందీలో ఉన్న సందేశంతో కూడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

మే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు కనిపిస్తున్నాయి.

See the video here:

కొంతమంది మునిసిపల్ కార్మికులు ఒక దుకాణం ముందు కాషాయ రంగులో ఉన్న ఇంగ్లీష్ సైన్ బోర్డును మరియు దాని ప్రక్కన ఉన్న మరొక భవనం నుండి తొలగిస్తున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చును.

వీడియో ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే సైన్ బోర్డులపై కన్నడలో 60:40 నిబంధనను కొనసాగించాలని ఆదేశాలను అమలు చేసింది మరియు వాణిజ్య సంస్థలకు దానికి కట్టుబడి ఉండాలని కోరింది.ఈ చర్యలో భాగంగా ఇంగ్లీషులో ఉన్న సైన్ బోర్డులను తొలగించేందుకు పలువురు మున్సిపల్ కార్మికులు రంగంలోకి దిగారు. సైన్‌బోర్డ్ రంగుకు నిబంధనకు ఎలాంటి సంబంధం లేదు.

బెంగళూరు పౌర సంస్థ — బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) — ఫిబ్రవరి 28 గడువుతో 60:40 నిబంధనను అమలు చేయని దుకాణాలు/వ్యాపారులు మరియు భవనాలపై చర్యను ప్రారంభించింది,కానీ తర్వాత గడువు మరో రెండు వారాలు పొడిగించబడింది.

కాషాయ రంగు బోర్డ్‌ ఉన్న దుకాణం యజమాని మంజునాథ్ రావు, కన్నడ భాషా నియమాలకు కట్టుబడి ఉండనందుకు తన దుకాణం సైన్‌బోర్డ్‌ను తొలగించారని, మతపరమైన కారణం ఏది లేదని వార్తా సంస్థ AFPకి తెలిపారు. కాబట్టి, బెంగళూరులో కాషాయ రంగులో ఉన్న సైన్‌బోర్డ్‌లను తొలగిస్తున్నారనే వాదన అవాస్తవం.

మరి కొన్ని Fact  Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

2 thoughts on “బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.