ఫిలిప్పీన్స్‌లో ధ్వంసం చేయబడిన చర్చి యొక్క పాత వీడియో గాజా నగరంలో జరిగిన కొత్త సంఘటనగా చూపించబడింది; Fact Check

ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం వార్తల్లో ముఖ్యంశాలుగా రావడంతో,అనేక వీడియోలు మరియు తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు పాలస్తీనియన్లు ఇప్పుడు చర్చిలపై దాడి చేస్తున్నారనే కథనం ఇక్కడ ఉంది.500 మందికి పైగా మరణించిన గాజా నగరంలోని బాప్టిస్ట్ హాస్పిటల్‌పై బాంబు దాడి జరిగిన తరువాత ఇది జరిగింది.

ఆయుధాలు ధరించిన వ్యక్తులు చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో,గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చిని హమాస్ సమూహం ధ్వంసం చేసినట్లు చూపుతుంది అనేది ఒక వాదన.చర్చిపై దాడి అనే సంఘటనపై అనేక మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించే వాదనలు, కౌంటర్‌క్లెయిమ్‌లు అతి వేగంగా వైరల్‌గా మారాయి.

వాదన/దావా ఈ విధంగా ఉంది:  “#హమాస్ టెర్రరిస్టులు #గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చ్‌ను ధ్వంసం చేసి, జీసస్ విగ్రహాన్ని తన్నుతున్నారు, ఇది వారి భూమిని తిరిగి పొందేందుకు వారి పోరాటమా లేదా ఈ ప్రపంచంలోని ప్రతి ఇతర మతానికి వ్యతిరేకంగా జిహాదా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.”

FACT CHECK

ముందుగా, మేము In-Vid టూల్‌ని ఉపయోగించి వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో మూలం(ఆధారము)కోసం వెతకగా,Youtubeలో 6 ఏళ్ల ఒరిజినల్ వీడియోని (అసలు వీడియో)కనుగొన్నాము.

2017లో ఫిలిప్పీన్స్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చర్చి భవనానికి నిప్పంటించిన ఘటనకు సంబంధించిన అసలైన వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఇది స్థానిక మీడియాలో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా నివేదించబడింది.

కాబట్టి, వాదన/దావా పూర్తిగా తప్పు.

వాదన/Claim: “హమాస్ ఉగ్రవాదులు గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చిని ధ్వంసం చేయడం మరియు యేసు విగ్రహాన్ని తన్నడం” చూపిస్తున్న వీడియో క్లిప్.

నిర్ధారణ/Conclusion:వాదన పూర్తిగా తప్పు.ఫిలిప్పీన్స్‌కు చెందిన 2017 పాత వీడియో ఇప్పుడు నగరంలో జరిగిన కొత్త సంఘటనగా చూపించబడింది.

Rating: Totally False —

[మరి కొన్ని Fact Checks: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

విండ్ టర్బైన్ల కారణంగా మిలియన్ల కొద్ది పక్షులు చనిపోతున్నాయా; ఏది నిజం [FACT CHECK]]

 

One thought on “ఫిలిప్పీన్స్‌లో ధ్వంసం చేయబడిన చర్చి యొక్క పాత వీడియో గాజా నగరంలో జరిగిన కొత్త సంఘటనగా చూపించబడింది; Fact Check

  1. Pingback: మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి? - Digiteye Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *