ముంబై వర్షాలకు వాహనాలు కొట్టుకుపోతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది, నిజామా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబయి వీధులు వాహనాలతో కొట్టుకుపోతున్నట్లు వీడియో చూడవచ్చుననేది వాదన.

నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.ఆగస్టు 2020 నుండి పాత వీడియో ఇటీవలి వీడియోగా షేర్ చేయబడింది.

రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

ముంబైలో భారీ వర్షాలు,వరదలు వచ్చి వీధుల్లో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు ముంబయిలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా తయారైందని వీడియోతో చేసిన దావా చెబుతోంది.

ముంబైలో ప్రస్తుత భారీ వర్షాల కారణంగా, భారత వాతావరణ శాఖ (IMD) ముంబై నగరం మరియు దాని పరిసరాల్లో థానే, నవీ ముంబై, పన్వెల్ మరియు రత్నగిరి-సింధుదుర్గ్‌తో సహా “రెడ్ అలర్ట్” ప్రకటించింది.

FACT CHECK

Digiteye India బృందం కీలకఫ్రేమ్‌లను తీసుకొని,వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించినప్పుడు, 2020లో నగరంలో భారీగా వరదలు వచ్చినప్పుడు న్యూస్ టీవీ ఛానెల్‌లు ఇలాంటి వీడియోలను ప్రసారం చేశాయని కనుకొన్నాము.ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఒరిజినల్ వీడియోను ఇక్కడ చూడండి:

వాదన లో పేర్కొన్న వీడియో,దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలు వరదలను ఎదుర్కొన్నప్పుడు ఆగస్ట్ 2020 నాటి వీడియో అని వార్తా నివేదికలు ధృవీకరించాయి.నగరంలో గంటకు 70 కి.మీ వేగంతో గాలులు వీచాయని, వందలాది చెట్లు నేలకూలాయని, అనేక రహదారులు జలమయమయ్యాయని నివేదికలు తెలిపాయి.

కాబట్టి ఇటీవల షేర్ చేయబడిన వీడియో ఆగస్ట్ 2020 నాటిది, దీనిని ముంబైలోని కవాస్జీ పటేల్ ట్యాంక్ రోడ్‌లో చిత్రీకరించారు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*