వాదన/Claim: స్టాలిన్ ఈ విధంగా పేర్కొన్నారు: “మా విజయం పూర్తిగా హిందూ ఓట్లపై ఆధారపడి ఉందనుకుంటే,మేము ఓడిపోయినా కూడా పట్టించుకోము.అంతేకాని,హిందువులను ఓట్లు అడుక్కునే స్థాయికి డీ.ఎం.కే (DMK) దిగజారదు.”
నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తా నివేదికను ‘న్యూస్7 తమిళ్’ ప్రసారం చేయలేదు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు
డీఎంకే అధినేత స్టాలిన్ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ అవుతోంది.పోస్ట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి చిత్రంతో పాటు వార్తా నివేదిక యొక్క స్క్రీన్ షాట్ ఉంది.
న్యూస్7 తమిళ్ లోగోతో స్క్రీన్ షాట్ చూడవచ్చు.స్టాలిన్ ఉద్దేశపూర్వకంగా చెప్పినట్లు పోస్ట్ పేర్కొంది: “మా విజయం పూర్తిగా హిందూ ఓట్లపై ఆధారపడి ఉందనుకుంటే,మేము ఓడిపోయినా కూడా పట్టించుకోము.అంతేకాని,హిందువులను ఓట్లు అడుక్కునే స్థాయికి డీ.ఎం.కే (DMK) దిగజారదు.”
పోస్ట్ ఇక్కడ చూడండి:
ఇది Facebookలో ఇక్కడ షేర్ చేయబడింది.
FACT CHECK
ఒక రాజకీయ నాయకుడి నుండి ఇలాంటి వ్యాఖ్యల సంభవం కావేమో అన్న కోణంలో నుండి అలోచించి బృందం ఈ పోస్ట్ వాస్తవ పరిశీలనకు పూనుకుంది.ముందుగా, మేము ఇతర TV ఛానెల్ వార్తా నివేదికల కోసం పరిశీలించినప్పుడు, ఇది ఎక్కడ కూడా ప్రసారం చేయబడలేదు.ఇతర సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా లేదా Google News కూడా అటువంటి నివేదికను దొరకలేదు.
మేము చిత్రం నుండి కీ ఫ్రేమ్‌ని పరిశీలిస్తున్నపుడు, తేదీని(ఫిబ్రవరి 15, 2019, 02:00 PM)గమనించి,అప్పుడు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాదు, డీఎంకేకు చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలుసుకున్నాము.
వాస్తవానికి, జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కనిపించిన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి యొక్క ప్రకటన మరియు క్లెయిమ్ లో చూపబడిన అదే తేదీ,సమయాన్ని కలిగి ఉన్న “న్యూస్ 7 తమిళ్” యొక్క 2019 నివేదికను మేము గమనించాము.పాత చిత్రం మార్చబడింది కానీ తేదీని మార్చలేదు,కాబట్టి ఇది మార్చబడిన చిత్రం అనే వాస్తవాన్ని తెలియజేస్తుంది.
మే 7, 2021న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు.డీ.ఎం.కే (DMK)హిందువులకు వ్యతిరేకం కాదని స్టాలిన్ ప్రతి సారి స్పష్టం చేశారు.అక్టోబర్ 2023లో సనాతన ధర్మంపై ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినప్పుడు, హిందూ మతంపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని స్టాలిన్ డీ.ఎం.కే (DMK) నాయకులందరినీ బహిరంగంగా కోరారు.
కాబట్టి, ఈ 2019 వీడియోలోని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి చిత్రంపై స్టాలిన్ చిత్రంను సూపర్ ఇంపోసు(Superimpose) చేసి క్లెయిమ్ లోని చిత్రంగా మార్చబడింది.
మరి కొన్ని Fact Checks:
నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన
తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను తయారు చేసిందా? వాస్తవ పరిశీలన
2 comments
Pingback: ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా కర్ణాటక SSLC పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం నిర్
Pingback: LATEST FACT CHECKS in TELUGU | DigitEye India