వాదన/Claim:శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన కర్ణాటక SSLC ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నం నిర్ణయించబడిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. పీ.యూ.సీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు మార్చి 1వ తేదీన ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం మరియు పీ.యూ.సీ పరీక్ష ఉదయం నిర్వహించబడుతుందని ఐఎన్‌సి కర్ణాటక పేర్కొంది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు
కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (కెఎస్‌ఇఎబి) ఫిబ్రవరి 2న 10వ తరగతి ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన వెంటనే, శుక్రవారం మధ్యాహ్నం పరీక్షను నిర్వహించడంపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీనిని మైనారిటీల మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వ చర్యగా పేర్కొంది.
Karnataka state 10th standard exam time table released. All the exams in the morning session but for Friday. Why?
Oh.. time for Namaz? pic.twitter.com/zi5daLIoyr— Chakravarty Sulibele (@astitvam) February 4, 2024
అందులో ఒక ట్వీట్ ఇలా ఉంది: “కర్ణాటక రాష్ట్ర 10వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేయబడింది. అన్ని పరీక్షలు ఉదయం షెడ్యూల్ చేయబడగా, కానీ శుక్రవారం మాత్రం.ఎందుకు? ఓహ్.. నమాజ్ టైం ?” చక్రవర్తి సూలిబెలే ట్వీట్‌కి ఒక్కరోజులోనే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఒకే ట్వీట్ ఇక్కడ మరియు ఇక్కడ విభిన్న శీర్షికలతో(క్యాప్షన్స్తో)షేర్ చేయబడింది.
FACT CHECK
Digiteye India బృందం వాస్తవ పరిశీలన చేయడం కోసం షెడ్యూల్ కొరకు వెతకగా,ఈ విషయంపై ఐఎన్‌సి కర్ణాటక ప్రతిస్పందన ఈ విధంగా ఉంది: “మార్చి 1వ తేదీన, అదే రోజు పీయూసీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం నిర్వహించబడుతుంది.తర్వాతి రోజుల్లో పీయూసీ పరీక్షలు లేకపోవడంతో ఉదయం నుంచే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు (SSLC exam) ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల కొరత మరియు గందరగోళాన్ని నివారించడానికి, ఈ క్రింది విధానం అమలులో ఉంది…”
ಕ್ಯಾಕರಿಸಿ ಉಗಿರಿ ಬೋಳಿ ಮಗನಿಗೆ. ಒದ್ದು ಒಳಗಾಕಿ ಹಂಗೆ. 🤢
pic.twitter.com/zPKJXCH7L9— Mal-Lee | ಮಲ್ಲಿ (@MallikarjunaNH) February 6, 2024
కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ వాదనలపై స్పందిస్తూ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చడం కోసం పరీక్ష సమయాలు సర్దుబాటు చేయబడిందని పేర్కొన్నారు. 12వ తరగతి (పి.యు.సి) పరీక్ష మార్చి 1, 2024న ఉదయం షెడ్యూల్ చేయగా, 10వ(SSLC) పరీక్ష మధ్యాహ్నంకి షెడ్యూల్ చేయబడింది.
10వ పరీక్షల షెడ్యూల్‌ను మరింతగా పరిశీలిస్తే, మహా శివరాత్రి (హిందూ పండుగ) పండుగ మార్చి 8వ తేదీన రావడంతో ఆ రోజు ఏ పరీక్షా షెడ్యూల్ చేయబడలేదని స్పష్టమవుతుంది.
మైనారిటీ విద్యార్థుల నమాజ్ కోసం పరీక్ష షెడ్యూల్‌ను మధ్యాహ్నం ఉంచారనే ఆరోపణలను తోసిపుచ్చుతూ పి.యు.సి పరీక్ష టైమ్‌టేబుల్ మార్చి 15 శుక్రవారం మరియు మార్చి 22 శుక్రవారం ఉదయం (మొదటి అర్ధభాగంలో) షెడ్యూల్ చేయబడింది.
కాబట్టి, శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన SSLC పరీక్ష సమయాన్ని సర్దుబాటు చేశారనే వాదన అబద్ధం.
మరి కొన్ని Fact Checks:
లేదు, “డీ.ఎం.కే ఓట్ల కోసం హిందువులను అడుక్కోదు” అని స్టాలిన్ ఎప్పుడూ చెప్పలేదు; వాస్తవ పరిశీలన