మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: కోచినియల్ కీటకాల నుండి తీసిన రంగుతో లిప్‌స్టిక్ తయారీ ప్రక్రియను ఈ వీడియో చూపిస్తుంది.ఇది నిజమా?

నిర్ధారణ/Conclusion: ఇది నిజం. కొన్ని లిప్‌స్టిక్‌ కంపెనీలు కోచినియల్ కీటకాల నుండి తయారైన రంగును ఉపయోగిస్తాయి.

రేటింగ్: వాస్తవమే–

పూర్తి వాస్తవ పరిశీలన వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

కోచినియల్ కీటకాలతో తయారు చేసిన రంగును ఉపయోగించి ‘లిప్‌స్టిక్’ తయారీ ప్రక్రియను తెలిపే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.Digiteye India టీమ్ తమ Whatsapp టిప్‌లైన్‌లో ఈ వీడియోలోని వాస్తవాన్ని పరిశీలించమని అభ్యర్ధనని అందుకుంది.

మేము YouTubeలో మరింత పరిశీలించినప్పుడు, లిప్‌స్టిక్‌ను ఎలా తయారు చేస్తారో చూపించే ఇలాంటి అనేకమైన వాదనలను/క్లెయిమ్‌లను గమనించాము.

FACT-CHECK:

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు మరియు బాలికలు రోజూ లిప్‌స్టిక్‌ను ఉపయోగిస్తున్నందున Digiteye India బృందం ఈ అభ్యర్థనను స్వీకరించింది. వాస్తవానికి, ప్రతి తయారీదారుడు రంగును తయారు చేయడానికి జంతువులు లేదా కీటకాల ఉపఉత్పత్తులను ఉపయోగించి తమ ఉత్పత్తులను తయారుచేయడం గురించి బహిరంగంగా అంగీకరించారు.

కోచినియల్ బగ్ ప్రాథమికంగా మెక్సికో మరియు నైరుతి యునైటెడ్ స్టేట్స్(ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల)కి చెందినది,ఈ కీటకం కాక్టిపై నివసిస్తుంది,మొక్కల తేమ మరియు పోషకాలను తింటుంది.ఈ కీటకాలు ప్రిక్లీ పియర్ కాక్టి యొక్క ప్యాడ్‌లపై కనిపిస్తాయి, వాటిని మొక్కల నుండి బ్రష్ చేయడం ద్వారా సేకరించి,ఆ తర్వాత ఎండబెట్టడం జరుగుతుంది.

ఆడ కోచినియల్ బగ్‌లను సేకరించి, ఎండలో ఎండబెట్టి, చితకొట్టి, ఆపై ఒక ఆమ్ల ఆల్కహాల్‌తో కలిపి క్రిమ్సన్, పింక్, ఎరుపు, ఊదా లేదా లేత గులాబీ వంటి మిరుమిట్లు గొలిపే రంగులు తయారు చేస్తారు. ఈ కీటకం కార్మినిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం వలన, ఇది ఇతర కీటకాలచే వేటాడకుండా దోహదపడుతుంది.

ఎండిన కీటకాల మొత్తం బరువులో సాధారణంగా 17-24 శాతం బరువు ఉండే కార్మినిక్ యాసిడ్‌ను శరీరం మరియు గుడ్ల నుండి సేకరించి, అల్యూమినియం లేదా కాల్షియం లవణాలతో కలిపి కార్మైన్ డైని (carmine dye)తయారు చేయవచ్చు. నేడు, కార్మైన్ డై ప్రధానంగా ఆహారంలో మరియు లిప్‌స్టిక్‌లలో (E120 లేదా సహజ ఎరుపు 4) రంగు కొరకు ఉపయోగించబడుతుంది.

మరియు కార్మినిక్ యాసిడ్ (C22H20O13) అనేది ఈ కోకినియల్ కీటకాలలో సహజంగా సంభవించే ఎరుపు రంగు గ్లూకోసిడల్ హైడ్రాక్సీయంత్రపూరిన్.
ఈ దావాను PETA (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్) సౌందర్య సాధనాలపై తన నివేదికలో ఈ దావాను బలపరిచింది.”మేకప్ ఔత్సాహికులు: మీ ముఖంపై డెడ్ బగ్స్‌ను పూయడం ఆపండి” అనే శీర్షికతో కలిగి ఉంది.

BBC సైన్స్ ఫోకస్ కూడా లిప్‌స్టిక్‌లలో కోచినియల్ బగ్స్ డై వాడకాన్ని ధృవీకరిస్తుంది.

కోచినియల్ బగ్స్ డైని ఉపయోగించి లిప్‌స్టిక్ తయారీ ప్రక్రియను చూపించే అనేక వీడియోలు అందుబాటులో ఉన్నాయి. మీరు క్రింద కొన్ని వీడియోలను చూడవచ్చు:

ఎరుపు రంగు సింథటిక్ డై నుండి కూడా వస్తుంది (బొగ్గు/తారు/పెట్రోలియం ఉపఉత్పత్తుల నుండి తయారు చేయబడింది) కానీ వినియోగదారు ఉత్పత్తులలో కృత్రిమ రంగుల వాడకంపై పరిమితి ఉన్నందున, తయారీదారులు/అనేక అగ్ర బ్రాండ్‌లు తమ లేబుల్‌లపై “కోచినియల్”ని సహజమైన డై అని పేర్కొంటూ తమ ఉత్పత్తులలో దాన్ని ఉపయోగిస్తున్నారు.

ఆహార ఉత్పత్తులు లేదా లిప్‌స్టిక్‌ లేబుల్ పై “కార్మైన్(రంగు సంకలితం లేదా రంగు E120) , CI 75470,” “కొచినియల్ ఎక్స్‌ట్రాక్ట్,” “క్రిమ్సన్ లేక్,” “సహజ ఎరుపు 4,” లేదా “కార్మైన్” అని పేర్కొన్నట్లయితే ఉత్పత్తి ఎండిన మరియు ఉడికించిన కోచినియల్ కీటకాలను కలిగి ఉందని అర్ధం.
ఎరుపు రంగు లిప్‌స్టిక్‌లో, ఇది తప్పనిసరి. అందువలన, కొన్ని లిప్‌స్టిక్‌లలో కోచినియల్ కీటకాల/బగ్‌ల నుండి తయారైన రంగు ఉంటుందనే వాదన నిజం. వినియోగదారులు ఉత్పత్తి లేబుల్‌లను నిశితంగా పరిశీలించి నిర్ధారించుకోవాలి.

మరి కొన్ని “వాస్తవ పరిశీలన” కధనాలు:

ఈ చిత్రం రాజస్థాన్‌లోని 5000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని చూపుతుందా? వాస్తవ పరిశీలన

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*