వాదన/Claim:’భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారని వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఒరిజినల్ వీడియోలోని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని క్లిప్ చేసి, ఆయనను ప్రతికూలంగా చూపించేందుకు వీడియో సవరించబడింది.
రేటింగ్: పూర్తిగా తప్పు–
వాస్తవ పరిశీలన వివరాలు
‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరామ్’ అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
@AcharyaPramodk ji yeh sanathan virodhi ko, ram virodhi ko karara jawab dena chahiye. Bahuth ho gaya https://t.co/p10BKLFUfl
— Anilkumar Krishnapillai (@AnilkumarK5097) February 26, 2024
View this post on Instagram
FACT CHECK
Digiteye India బృందం (ఒరిజినల్)అసలు వీడియో కోసం పరిశీలించగా,రాహుల్ గాంధీ ఫిబ్రవరి 19, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒరిజినల్ వీడియో అందుబాటులో ఉంది మరియు షేర్ అవుతున్న వీడియో అతనిని ప్రతికూలంగా చూపించడానికి మార్చబడినట్లు తెలుస్తుంది.
ముఖ్యంగా వీడియోని 26:22 నుండి 26:29 వరకు మరియు 26:59 నుండి 27:10 వరకు చూస్తే కనక,నిరుద్యోగ సమస్యపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ వీడియోలో చూడవచ్చును.
“శ్రీ మల్లికార్జున్ ఖర్గే మరియు శ్రీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు” అనే శీర్షికతో ఉన్న వీడియోలో, అతను వాదనలో పేర్కొన్నట్లుగా ఈ మాటలు పదే పదే చెబుతున్నట్లు కనిపించదు.
పూర్తి వీడియోను జాగ్రత్తగా గమనిస్తే రాహుల్ గాంధీ మాటల సందర్భం స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ హిందీలో చెప్పిన ప్రసంగం అనువాద వెర్షన్ ఈ విధంగా ఉంది.
“రామమందిరం ప్రారంభోత్సవంలో మీరు దళితుడిని చూశారా, రైతును చూశారా? భారత రాష్ట్రపతిని లోపలికి అనుమతించలేదు, మీరు రైతును లేదా కూలీని చూశారా? కానీ మీరు అదానీని చూశారు, అంబానీని చూశారు, అమితాబ్ బచ్చన్‌ను చూశారు, మీ హిందుస్థాన్ ఉనికిలో లేదు.’భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీ రామ్’ అని చెప్పడమే మీ పని.వారి (అదానీ మరియు అంబానీ) పని డబ్బు లెక్కించడం, వారి పని ప్రైవేట్ విమానంలో ప్రయాణించడం, వారి పని సరదాగా గడపడం, మీ పని అక్కడ ఇక్కడ చూడటం, అక్కడ చూడండి సోదరా, పాకిస్తాన్, అక్కడ చూడు, అమితాబ్ బచ్చన్ కొత్త డ్యాన్స్ చేసాడు, చేస్తూనే ఉండు బ్రదర్, చేస్తూనే ఉండు… నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఆనందించండి, అందరూ ఆకలితో చనిపోతారు, అందరూ ఆకలితో చనిపోతారు, అందరికి సమయం వస్తుంది, ఎవరూ మిగలరు.. . అందరూ ఆకలితో చనిపోతారు.”
రాహుల్ గాంధీ ప్రసంగాన్నిఅసందర్భంగా చేసి, ‘భారత్ మాతాకీ జై’ మరియు ‘జై శ్రీరాం’ అని ప్రజలు చెబితే ఆకలితో చనిపోతారని చూపించడానికి వీడియోను సవరించబడింది. ఈ వాదన/దావా పూర్తిగా తప్పు.
వాదన/Claim:’భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారని వాదన.
Conclusion: నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఒరిజినల్ వీడియోలోని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని క్లిప్ చేసి, ఆయనను ప్రతికూలంగా చూపించేందుకు వీడియో సవరించబడింది.
రేటింగ్: పూర్తిగా తప్పు–
మరి కొన్ని Fact Checks:
కులం ఆధారిత జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీలన