50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి.

ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్విట్టర్‌లోని సందేశాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

FACT CHECK

ఈ సమస్య పై తీవ్ర వివాదం చెలరేగడం వలన, 50 సంవత్సరాల సరఫరా తర్వాత TTD ఎందుకు నందిని నెయ్యి సరఫరాను నిలిపివేసిందనే దానిపై వాస్తవాలను Digiteye India పరిశీలన చేసింది. టీటీడీకి నందిని నెయ్యి 50 ఏళ్లుగా నిరంతరాయంగా సరఫరా కావడం లేదని పరిశోధనలో వెల్లడైంది. 2019లోనే KMF యొక్క టెండర్ తిరస్కరించబడింది మరియు తమిళనాడు పాల బ్రాండ్ ఆవిన్‌కి ఆ కాంట్రాక్టు ఇవ్వబడింది. ప్రతి ఆరు నెలలకోసారి బిడ్డింగ్/టెండర్ జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి లడ్డూలలో నందిని నెయ్యి మాయమైందన్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ” గత 20 ఏళ్లుగా కూడా KMF నెయ్యి సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదన్నారు.అందువల్ల, 50 సంవత్సరాల వరకు “అంతరాయం లేకుండా” KMF సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదు. టెండర్, వాస్తవానికి, తక్కువ బిడ్డర్‌కు వెళుతుంది, అయితే మార్చి 2023లో కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన తాజా టెండర్‌లో KMF పాల్గొనలేదని TTD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) స్పష్టం చేశారు.

కాబట్టి KMF “ఇప్పుడు” కాంట్రాక్ట్ పొందలేదనే వాదన నిజం కాదు.

అంతేకాకుండా, వార్తల్లో పేర్కొన్నట్లుగా నెయ్యి సేకరణ కేవలం ఒక సరఫరాదారుకు మాత్రమే పరిమితం కాదు. భారీ మొత్తంలో నెయ్యి అవసరం కావున ఒక సరఫరాదారు సరఫరా చెయ్యడం కష్టం. నందినితో పాటు ఆవిన్ వంటి ఇతర నెయ్యి బ్రాండ్‌లు కూడా గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కర్ణాటక ప్రభుత్వ వివరణ:

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై వెంటనే స్పందిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంకి (టిటిడి) కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నుండి నందిని నెయ్యి సరఫరా బిజెపి హయాంలోనే ఆగిపోయిందని అన్నారు, మరియు టిటిడికి నందిని నెయ్యి సరఫరాను నిలిపివేయడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న “హిందూ వ్యతిరేక” విధానానికి ఫలితం అని బిజెపి చేసిన ఆరోపణను కూడా ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిపివేయడం ఈరోజు నిన్న జరిగిన విషయం కాదని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి సరఫరా నిలిచిపోయిదని ట్వీట్ చేశారు:”ಆಂಧ್ರಪ್ರದೇಶದ ತಿರುಪತಿಗೆ ನಂದಿನಿ ತುಪ್ಪ ಪೂರೈಕೆ ಸ್ಥಗಿತಗೊಂಡಿರುವುದು ಇಂದು, ನಿನ್ನೆಯ ವಿಚಾರವಲ್ಲ. ಕಳೆದ ಒಂದೂವರೆ ವರ್ಷದ ಹಿಂದೆಯೇ @BJP4Karnataka ಸರ್ಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ತಿರುಪತಿಗೆ ತುಪ್ಪ ಪೂರೈಕೆಯನ್ನು ಸ್ಥಗಿತಗೊಳಿಸಲಾಗಿದೆ.” [ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నందిని నెయ్యి సరఫరా ఈరోజూ, నిన్నా ఆగలేదు, గత ఏడాదిన్నర క్రితం ఆగిపోయింది @BJP4Karnataka Govt.”] ఒరిజినల్ ట్వీట్ ఇక్కడ చూడండి:

ఇదే విషయాన్ని KMF అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భీమా నాయక్  స్పష్టం చేశారు. KMF ప్రధాన సరఫరాదారు కాదని, వరుసగా మూడవ స్థానంలో ఉందని, L1 మరియు L2 బిడ్డర్‌ల తర్వాతనే సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రసిద్ధిచెందిన GI-ట్యాగ్ చేయబడిన లడ్డూలను తయారు చేయడానికి 1,400 టన్నుల నెయ్యిని సరఫరా చేయడానికి ప్రతి ఆరు నెలలకోసారి TTD టెండర్‌ను ఆహ్వానిస్తుంది, అందువల్ల డిమాండ్‌ను KMF మాత్రమే చెయ్యలేదు.

‘కేఎంఎఫ్ (KMF)2005 నుంచి 2020 వరకు తిరుపతికి నందిని నెయ్యి సరఫరా చేసింది… డిమాండ్‌లో 45 శాతం మాత్రమే మేం సరఫరా చేస్తాము.. 2020 నుంచి ఎల్‌3 సరఫరాదారులం.ఎల్1, ఎల్2 బిడ్డర్ల సరఫరా చేసిన తర్వాత మేము సరఫరా చేస్తాము. 2021లో 2022 లో TTD వారు సరఫరా కోసం లేఖ రాశారు, తదనుగూనంగా KMF 345 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేసింది,” అని నాయక్ మీడియాకు తెలిపారు. కాబట్టి, తిరుపతి లడ్డు ఇప్పుడు మాత్రమే నందిని నెయ్యి  లేకుండా తయారవుతుందనే వాదన కూడా తప్పు.

Claim/వాదన: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నందిని అంశాన్ని రాజకీయం చేసి అమూల్‌పై దుష్ప్రచారం చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం KMF బిడ్‌ను TTD తిరస్కరించింది.

నిర్ధారణ: KMF అంతకుముందు కూడా బిడ్‌ను కోల్పోయింది, తద్వారా నెయ్యి సరఫరా నిలిపివేయబడింది. 2023 మార్చిలో BJP అధికారంలో ఉన్నప్పుడు KMF అసలు వేలంపాటలో పాల్గొనలేదు.

Rating: Misrepresentation —