వాదన/CLAIM:COVID-19ని గుర్తించడానికి కొత్త లక్షణాలున్న జాబితాని AIIMS ఒక సలహా/ప్రకటన ద్వారా జారీ చేసింనేది వాదన.
నిర్ధారణ/CONCLUSION: AIIMS తన అధికారిక వెబ్‌సైట్‌లో అలాంటి సమాచారం ఏదీ కూడా షేర్ చేయలేదు.సాధారణ జలుబు, ఫ్లూ మరియు వైరల్ జ్వరం యొక్క లక్షణాలు COVID-19 మాదిరిగానే ఉంటాయి.దేశంలోని అనేక ప్రాంతాల్లో COVID-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం.
రేటింగ్: తప్పుదోవ పట్టించే వార్త.–
వాస్తవ పరిశీలన వివరాలు
కోవిడ్-19ని గుర్తించేందుకు ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)’ ఒక ప్రకటన ద్వారా కోవిడ్ యొక్క కొత్త లక్షణాల జాబితాను విడుదల చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో సోషల్ మీడియా ఈ సందేశం విస్తృతంగా షేర్ చేయబడుతోంది.ప్రకటన/సందేశం ప్రకారం, AIIMS యొక్క పాథాలజీ విభాగం ఇంట్లోనే కరోనా వైరసును ఎలా గుర్తించవచ్చో తెలిపారు.
వైరల్ మెసేజ్/సందేశం ఆరోపణ క్రింది విధంగా ఉంది:
1) పొడి దగ్గు + తుమ్ములు = వాయు కాలుష్యం
2) దగ్గు + శ్లేష్మం/చీమిడి + తుమ్ములు + ముక్కు కారడం = జలుబు/రొంప
3) దగ్గు + శ్లేష్మం/చీమిడి +తుమ్ములు + ముక్కు కారడం + ఒళ్లు/శరీర నొప్పులు + శరీర బలహీనత + తేలికపాటి జ్వరం = ఫ్లూ
4) పొడి దగ్గు + తుమ్ములు + ఒళ్లు/శరీర నొప్పులు + శరీర బలహీనత + తీవ్ర జ్వరం + శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది = కరోనా వైరస్
Digiteye India బృందం వారికి ఈ వైరల్ మెసేజ్ గురించి వాస్తవ పరిశీలన చేయమని వాట్సాప్‌లో అభ్యర్థనను వచ్చింది.
FACT CHECK
Digiteye India బృందం AIIMS వెబ్‌సైట్‌లో వైరల్ మెసేజ్ కి సంబంధించి ఏదైనా సలహా లేదా ప్రకటన జారీ చేసిందా లేదా అని పరిశిలన చేసింది.కోవిడ్-19ని ఈ విధంగా గుర్తించగలమని పేర్కొన్న నోటీసు లేదా మెమోరాండం ఏదీ మాకు కనపడలేదు.
ఈ విషయంపై గూగుల్లో కీవర్డ్ఉపయోగించి వెతకగా, డిసెంబర్ 27, 2023న హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన ఒక వార్తా కథనానికి దారితీసింది.
“C6 వార్డులో 12 పడకలు తీవ్ర అనారోగ్యంతో ఉన్న COVID-19 రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి కేటాయించబడతాయి” అని మాత్రమే పేర్కొన్న ఒక మెమోరాండంని AIIMS జారీ చేసింది.
మేము మరింత వెతకగా, AIIMS ద్వారా అప్‌లోడ్ చేయబడిన COVID-19 బుక్‌లెట్ మా దృష్టికి వచ్చింది. బుక్‌లెట్‌లో, వారు COVID-19 లక్షణాలని ఈ విధంగా పేర్కొన్నారు – “జ్వరం, గొంతు నొప్పి, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం. ఇవి జలుబు, ఇన్‌ఫ్లుఎంజా మొదలైన ఏదైనా వైరల్ ఇన్‌ఫెక్షన్ యొక్క లక్షణాలను పోలి ఉంటాయి.”
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రకటనను ఎయిమ్స్(AIIMS ) విడుదల చేయలేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇవి COVID-19 యొక్క లక్షణాలు : జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన యొక్క లక్షణాన్ని కోల్పోవడం, గొంతు నొప్పి, తలనొప్పి, నొప్పులు , అతిసారం, చర్మంపై దద్దుర్లు , చేతి లేదా కాలివేళ్ళ రంగు మారడం, మరియు ఎరుపెక్కిన కళ్ళు.
Digiteye India బృందం వారు ఢిల్లీకి చెందిన డాక్టర్ షగున్ గోవిల్‌తో మాట్లాడగా, అతను “COVID-19 యొక్క లక్షణాలు, ఫ్లూ మరియు సాధారణ జలుబుతో పోలి ఉన్నప్పటికీ, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, వారు సరైన మార్గనిర్దేశం చేయగల వైద్యుడిని సంప్రదించాలి.
కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
మరి కొన్ని Fact Checks:
శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check
MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check
పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదా? Fact Check
3 comments
Pingback: మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన - Digiteye Telugu
Pingback: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశ
Pingback: ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా AP, తెలంగాణలలో పాఠశాలలు మూసివేయబడ్డాయా? వాస్తవ పరి