వాదన/Claim: కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో బబియా అనే శాఖాహార మొసలిని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది, మరియు మొసలి గుడిలోని ప్రసాదం మాత్రమే తింటుందనేదొక వాదన.
నిర్ధారణ/Conclusion: కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో శాకాహార మొసలి బబియా నివసిస్తుందనేది నిజం. అయితే, బబియా 2022లో మరణించింది మరియు ఒక సంవత్సరం తర్వాత సరస్సులో కొత్త మొసలి కనిపించింది.వైరల్ వీడియోలో బాబియా యొక్క కొన్ని చిత్రాలు మాత్రం కనబడుతాయి, అన్నీ కాదు. చిత్రాలలో ఒకటి కోస్టారికాకు చెందిన వ్యక్తి, గాయపడిన మొసలికి వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేసి, దాంతో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడం వంటి నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ నుండి తీసుకోబడింది.
రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు:
కేరళ దేవాలయంలోని చెరువులో శాకాహార మొసలి నివసిస్తోందని తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయ సరస్సులో మొసలి నివసిస్తోందని ఆ వీడియో పేర్కొంది. వీడియోలో మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తన తలను ఉంచే దృశ్యాలను చూడవచ్చు మరియు మొసలి పేరు బబియా అని, ఆలయ పూజారి మొసలికి ఆలయం నుండి బియ్యం ప్రసాదం కూడా అందజేస్తారని ఒక వాదన.
ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye Indiaకి వాట్సాప్‌లో అభ్యర్థన వచ్చింది.
FACT CHECK
Digiteye India బృందంవారు Googleలో Babiya కోసం వెతకగా అనేక ఆన్లైన్ వార్తాపత్రికలు నుంచి సమాచారం కనిపించగా, అందులో ఒకటి అక్టోబర్ 10,2022న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించబడిన కథనానికి దారితీసింది. ఏడు దశాబ్దాలకు పైగా ఆలయ చెరువులో నివసిస్తున్న బబియా మరణించినట్లు మరియు మొసలి “ఆలయం వారు సమర్పించే బియ్యం, బెల్లం ప్రసాదాలను మాత్రమే తినేదని” అని నివేదిక పేర్కొంది.
బాబియా మరణించిన ఒక సంవత్సరం తర్వాత, ఆలయ సరస్సులో మరొక మొసలి కనిపించిందని నవంబరు 13, 2023న ప్రచురించబడిన ‘ది హిందూ’ యొక్క మరొక నివేదిక పేర్కొంది. సరస్సులోకనిపించడం ఇది మూడో మొసలి అని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.
అయితే, వైరల్ వీడియోలో ఉపయోగించిన అన్ని విజువల్స్ బాబియాకి సంబంధించినవి కావు.
మేము అన్ని విజువల్స్‌పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తల ఉంచిన చిత్రం కేరళలోని దేవాలయం నుండి కాదని గమనించాము.ఇది 2013లో “ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్” అనే డాక్యుమెంటరీ సంబంధిచిన వీడియో. వైరల్ చిత్రం 20:57 మార్క్ వద్ద చూడవచ్చు.
“ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్”అనే డాక్యుమెంటరీ కోస్టారికాకు చెందిన గిల్బర్టో ‘చిటో’ షెడ్డెన్ అనే వ్యక్తి జీవితాన్ని సంబంధించింది.చేపలు పట్టే సమయంలో చీటో
కి ఈ మొసలిని కంట పడింది. గాయపడిన మొసలికి అతను వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేశాడు.అదే సమయంలో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడంతో దానికి ‘పోచో’ అని పేరు పెట్టాడు.డాక్యుమెంటరీ వివరణలో, “ఈ జీవికి(మొసలి) వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మొసలి తనను విడిచిపెట్టడానికి నిరాకరించడం చూసి చిటో ఆశ్చర్యపోయాడు. వారి స్నేహం దశాబ్దాలుగా కొనసాగింది, చిటో ప్రపంచంలో మొసలిని విజయవంతంగా మచ్చిక చేసుకున్న కొద్దిమంది వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.”
కాబట్టి, ఈ వాదన/దావా, తప్పు.
మరి కొన్ని Fact checks:
వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన
ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన
2 comments
Pingback: జాతీయ వైద్య కమిషన్ తన లోగోను రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మార్చేసిందా? వాస్తవ పరిశీలన - Digiteye Telugu
Pingback: కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవు