వాదన/Claim: భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసిందని మరియు అధ్యక్షుడు ముయిజు వాటిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అప్పగించారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన/దావా. భారతదేశం ఎప్పుడూ కూడా 28 దీవులను కొనుగోలు చేయలేదు కానీ మాల్దీవులు ఆ దీవులపై నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టుల అమలు కోసం భారతదేశానికి అప్పగించింది.
రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన/దావా —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.
లేదా దిగువ కథనాన్ని చదవండి.
************************************************************************
మాల్దీవులలో ప్రభుత్వం మారినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, అయితే ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ద్వీప దేశాన్ని సందర్శించారు మరియు చైనా అనుకూల నేతగా కనిపించే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వంతో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
జైశంకర్ సందర్శన తర్వాత, ద్వీపసమూహ రాష్ట్రం(మాల్దీవులు) నుండి భారతదేశం 28 ద్వీపాలను “కొనుగోలు చేసింది” అనే వాదనతో సోషల్ మీడియా పోస్ట్‌లు వెలువడ్డాయి.
India bought 28 islands from Maldives. Maldives handover its 28 Islands to India. President Muizzu himself signed the agreement.
Opposition is busy polishing shoes of #HindenburgResearch meanwhile Modiji bought 28 islands from Maldives 🔥😂😂 pic.twitter.com/K7KWig8Zmj
— Priyanka M Mishra (@soulfulgirlll) August 12, 2024
ఇతర X వినియోగదారులు, “భారతదేశం మాల్దీవుల నుండి 28 దీవులను కొనుగోలు చేసింది. మాల్దీవులు తన 28 దీవులను భారతదేశానికి అప్పగించింది. అధ్యక్షుడు ముయిజు స్వయంగా ఒప్పందంపై సంతకం చేశారు” అని పోస్ట్ చేసారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ దీవులను సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ, “50 మీటర్ల నడక మరియు ఒక ట్వీట్ యొక్క అద్భుతం”, అని మరొక మరో వినియోగదారు పోస్ట్ చేసారు.
BREAKING : Maldives handover its 28 Islands to India. President Muizzu himself signed the agreement. pic.twitter.com/yKqX34Hhv7
— Baba Banaras™ (@RealBababanaras) August 12, 2024
అదే దావా/వాదన ఇక్కడ షేర్ చేయబడుతోంది:
Modi is the Boss!🔥
Once again, he proved it.
India took control of 28 islands from Maldives💪 pic.twitter.com/UHgPourg5t
— Amar Prasad Reddy (@amarprasadreddy) August 12, 2024
వాస్తవ పరిశీలన వివరాలు:
భారతదేశం,దీవులను కొనుగోలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు కాబట్టి, Digiteye India బృందం సంబంధిత సమాచారం కోసం Googleలో అన్వేషించగా, అది తప్పుదారి పట్టించే దావా అని కనుగొన్నారు. మాల్దీవులు చైనాతో దగ్గరి సంబంధాలు ఏర్పరుచుకుంటున్న తరుణంలో జైశంకర్ మూడు రోజుల పర్యటన కీలకమైన సమయంలో జరిగిందని వార్తా నివేదికలు వెల్లడించాయి.
వాస్తవానికి, భారతదేశం గతంలో మాల్దీవుల ప్రభుత్వంతో 28 దీవులలో అనేక నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టులను అమలు చేయడానికి ప్రతిపాదించింది. భారత విదేశాంగ మంత్రి పర్యటన ఈ ప్రాజెక్టులను ఖరారు చేసింది మరియు తదనుగుణంగా, ద్వీప దేశం యొక్క అత్యవసరమైన అవసరాలను అందించడానికి నీటి ప్రాజెక్టుల అమలు కోసం మాల్దీవుల ప్రభుత్వం ఆ దీవులను అప్పగించింది.
వార్తా కథనాలను ధృవీకరిస్తూ జైశంకర్ తన ట్వీట్లలో కూడా ప్రాజెక్ట్స్ ల ప్రస్తావన ప్రకటించారు:
India Maldives Friendship is people – centric. Please see.
🇮🇳 🇲🇻 pic.twitter.com/qTKWndXQdN
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 11, 2024
Concluded a productive visit to Maldives!
Living up to the message of our ties: ‘Imagined by Maldives, Delivered by India’.
🇮🇳 🇲🇻Some highlights: pic.twitter.com/RmdM3WLSoj
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 12, 2024
ప్రెసిడెంట్ ముయిజ్జూతో కలిసి జై శంకర్ మాల్దీవుల్లో నీరు మరియు మురుగునీటి నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు వార్తా నివేదిక పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ మాల్దీవులలోని 28 దీవులను కలుపుతుంది మరియు అవి ఇండియన్ ఎగ్జిమ్ బ్యాంక్ రుణాల సహకారంతో నిర్మించబడ్డాయి. అదనంగా, భారతదేశం మానసిక ఆరోగ్యం, వీధి దీపాల వంటి ఇతర సమాజ-కేంద్రీకృత ప్రాజెక్టులను చేపట్టింది.
మాల్దీవుల ప్రెసిడెంట్ మియుజు కూడా ఈ సంఘటన గురించి ట్వీట్ చేశారు మరియు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
It was a pleasure to meet @DrSJaishankar today and join him in the official handover of water and sewerage projects in 28 islands of the Maldives. I thank the Government of India, especially Prime Minister @narendramodi for always supporting the Maldives. Our enduring partnership… pic.twitter.com/fYtFb5QI6Q
— Dr Mohamed Muizzu (@MMuizzu) August 10, 2024
కాబట్టి, ఈ దీవులను నీరు మరియు మురుగునీటి ప్రాజెక్టులను అమలు చేయడానికి అప్పగించినందున, భారతదేశం ఈ 28 దీవులను కొనుగోలు చేసిందనే వాదన తప్పు.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు: