రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా?  వాస్తవ పరిశీలన

దావా/Claim: రాహుల్ గాంధీ భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను ప్రకటించారు.

నిర్ధారణ/Conclusion:తప్పు, రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ప్రకటించలేదు.

రేటింగ్: Misrepresentation —

Fact Check వివరాలు:

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్/సందేశం ఆఫర్‌ను పొందేందుకు లింక్‌ను అందించింది. ఇంతకు ముందు మా వాస్తవ పరిశీలనలో BJPకి సంబంధించి తప్పుడు లింక్‌ని ఉపయోగించిన ఇదే విధమైన దావా తప్పుదారి పట్టించే విధంగా ఉందని కనుగొనబడింది.

FACT CHECK

ముందుగా, మేము రాహుల్ గాంధీ ఓటర్లకు ఉచిత మొబైల్ రీఛార్జ్ అందించడం గురించి ఏదైనా ప్రకటన చేశారా అని వెతకగా, అది ఎక్కడా కనబడలేదు. అదే నిజమైతే, అన్ని సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా వెల్లడై ఉండేది. రెండవది, PM నరేంద్ర మోడీని ఉదహరిస్తూ ఇంతకుముందు ఇదే విధమైన దావా వైరల్ కాగా, Digiteye India బృందం వారు అది తప్పుడు దావా /వాదన అని నిరూపించింది. ఇక్కడ చూడవచ్చు.

అదేవిధంగా, ఈ సందేశాన్ని కూడా రాహుల్ గాంధీ లేదా భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదని కనుగొన్నాము. మరియు, పోస్ట్‌లో అందించిన లింక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో అనుసంధానించబడలేదు.

వెబ్ సైట్ ప్రామాణికత పరిశీలించగా, క్రింది ఫలితం వచ్చింది.

మరి కొన్నిFact Checks:

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? Fact Check

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

 

3 thoughts on “రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.