హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది.
వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది.
ఈ కథనాన్ని ‘మైక్రోసాఫ్టర్స్‘ అనే వెబ్‌సైట్ షేర్ చేసి,చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది మరియు చాలా మంది వ్యక్తులు ఈ వార్తలను విశ్వసించి, రీట్వీట్ చేయడం లేదా కొనుగోలుపై అంచనా వేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సోనీ లేదా మైక్రోసాఫ్ట్ నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన/జవాబు లేదా అధికారిక ప్రకటన లేదు. ఇది డిసెంబర్ 28, 2020న రోజంతా ట్విట్టర్‌లో వైరల్ అయింది.
FACT CHECK
అయినప్పటికీ, Google సహాయంతో ఆంగ్లంలోకి అనువదించబడినప్పుడు స్పానిష్‌లో చక్కటి అక్షరాల ముద్రణతో,దిగువ చిత్రంలో చూపిన విధంగా “ఏప్రిల్ ఫూల్స్ డే’ అని వ్రాసి ఉంది.
ఏప్రిల్ ఫూల్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న వచ్చినప్పటికీ, సోనీ మీద కధనం డిసెంబర్ 28న కనిపించింది.గూగుల్‌లో మరింత పరిశీలించగా, అనేక హిస్పానిక్ సంస్కృతులలో ఈ రోజును “పవిత్ర అమాయకుల దినోత్సవం”(Day of the Holy Innocents)గా విస్తృతంగా పాటిస్తారు, ఇది ప్రపంచ ఏప్రిల్ ఫూల్స్ డేకి సమానం.
ఇది నిజమైన వార్త అయితే, రెండు ప్రపంచ దిగ్గజాలు కలిసిపోతున్నట్లు గ్లోబల్ మీడియా విస్తృతంగా నివేదించి ఉండేది.హిస్పానిక్ సంస్కృతిలో చిలిపి పనుల (pranks) కోసం ఒక రోజు కేటాయిస్తారని,అందులో భాగంగానే ఈ కధనాన్ని ప్రచురించారని గ్రహించిన చాలా మంది కధనాన్ని మరియు ట్వీట్‌ను శీఘ్రంగా తొలగించారు.
వాదన/Claim:మైక్రోసాఫ్ట్ సోనీని $130 బిలియన్లకు కొనుగోలు చేసింది.
నిర్ధారణ/Conclusion:స్పానిష్ ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సోనీని మైక్రోసాఫ్ట్ 130 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందన్న నకిలీ వార్త(prank) సోషల్ మీడియాలో ప్రచారంలో జరిగింది.
Our rating —Totally False.
[మరి కొన్ని fact checks: ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Checkఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check]