Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

గాజాలో వైమానిక దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గర మిగూడినప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని వీడియో పేర్కొంది.వీడియోతో వైరల్ అవుతున్న వాదన/దావా ఇలా ఉంది:

भूख और प्यास से तड़प रहे पेलेस्टाइन, गाज़ा के बच्चे जब पानी पीने के लिए पानी की टंकी के पास पहुंचे तो, जालिम कातिल इजरायल आतंकवादी यो ने ऊपर से बम गिरा दिया और कइयों की जान चली गई कई जल गए!

क्या लाचारी है जो दुनिया यह सब देख रही है और देखकर आंख बंद कर लेती है??

(పై హిందీ అనువాదం:గాజా మరియు పాలస్తీనా పిల్లలు, ఆకలి మరియు దాహంతో బాధపడుతున్నప్పుడు, నీరు త్రాగడానికి వాటర్ ట్యాంక్ దగ్గరకు చేరుకున్నప్పుడు, ఇజ్రాయెల్ పై నుండి బాంబును విసిరింది. ఆ బాంబు దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది కాలిపోయారు! ప్రపంచం ఇదంతా చూస్తూ కళ్లు మూసుకుంటుంది,ఏంటి నిస్సహాయత??)

వీడియో X (గతంలో Twitter)లో కూడా వైరల్ అవుతోంది మరియు ఇలాంటి వాదనలతో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది

వాట్సాప్‌లో వైరల్ అయిన ఈ వీడియోను పరిశీలన చేయమని Digiteye India బృందానికి అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించింది.ఈ కీఫ్రేమ్‌లతో Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను అమలు చేయగా, అది టర్కిష్ వార్తల వెబ్‌సైట్, Haber 7కి దారితీసింది. అదే వీడియోతో కూడిన వీడియో నివేదిక అక్టోబర్ 13, 2023న పోస్ట్ చేయబడింది.నివేదిక యొక్క ముఖ్యాంశం, “సూడాన్‌లో డ్రోన్ దాడి విధ్వంసకు/విపత్తుకు కారణమైంది!” వీడియోకు టర్కిష్ భాషలో వివరణ కూడా ఉంది. దాని అనువాదం, “RSF దళాలపై సూడాన్ సైన్యం యొక్క సాయుధ డ్రోన్ దాడిలో ఇంధనం మండడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు మంటల్లో చిక్కుకున్నారు! ఆ దృశ్యాలు ఇలా కెమెరాలో బంధించబడ్డాయి.”

మేము ఈ క్లూని ఉపయోగించి,ఈ వైరల్ వీడియో యొక్క మూలం గురించి మరింత తెలుసుకోవడానికి Googleలో కీవర్డ్ సెర్చ్ను నిర్వహించగా,అల్ జజీరా వారి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోకు దారి తీసింది. వారి నివేదికలో, వారు అరబిక్‌లో ఒక వివరణను జోడించారు, “సుడానీస్ సైన్యం ఖార్టూమ్‌లోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు చెందిన ఇంధన ట్యాంకర్‌పై బాంబు దాడి చేసింది, #Video #Al Jazeera_Sudan.” వీడియో అక్టోబర్ 12, 2023న పోస్ట్ చేయబడింది.

సోషల్ మీడియా ‘X’లో మరింత పరిశీలన చేసినప్పుడు, అక్టోబర్ 12, 2023న అదే వీడియోను పోస్ట్ చేసిన ‘సుడాన్ న్యూస్’ యొక్క ఈ క్రింద  ట్వీట్‌ని మేము గమనించాము.”తమ మోటార్‌సైకిళ్లకు ఇంధనం నింపడానికి గుమిగూడిన రాపిడ్ సపోర్ట్ సైనికుల సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆర్మీ మార్చ్, అని వారు ట్వీట్ చేశారు”.”

కాబట్టి,వైరల్ వీడియో, ఖార్టూమ్ (సూడాన్)లో జరిగిన సంఘటన చూపిస్తుంది, గాజాలోనిది కాదు.

వాదన/CLAIM:గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ ముందు గుమికూడుతుండగా వారిపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిని వైరల్ వీడియోలో కనపడుతుంది.

నిర్ధారణ/CONCLUSION:వీడియో గాజా లేదా పాలస్తీనాకు చెందినది కాదు.సుడాన్‌లోని ఖార్టూమ్‌లో పారామిలిటరీ దళం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)కి చెందిన ఇంధన ట్యాంకర్‌పై సూడాన్ సైన్యం బాంబు దాడి చేసినప్పటి వీడియో.అక్టోబర్ ప్రారంభంలో సూడాన్‌లో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటి వీడియో ఇది.

RATING: Misrepresentation —

[మరి కొన్ని fact checks: హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check]